మెల్ల మెల్లగా పడమర వాలుతుంది
అర్థం కాని కాలం లా నీరాక
ఎప్పుడొస్తావు మరీ…
వెలిగే దీపాల కాంతిని
చీకటి మింగేసింది
నక్షత్రాలు వెలిగి వెలిగి
అలసి వెలసి పోయాయి
మనోహరమైన…
దృశ్యాలు మారుతున్నాయి
లోకం తనస్థితిని మార్చు కుంటుంది
మేఘాలు నలుపు నుండి తెలుపు లోకి
చెట్లపై పక్షులు గూడు నుండి
తొంగిచూస్తున్నాయి
మనోహరమైన…
నేను నీ బాధలో తడిసి
తపించి పోతున్నాను
ప్రత్యూష రేఖల
రాక మొదలైంది
మనోహరమైన…
గాలి కూడా తనదిశను
మార్చు కుంటుంది
కొత్త ఋతువు తనరాగాల
ప్రేమ గీతం ఆలపిస్తుంది …
మనోహరమైన రాత్రి
మెల్లమెల్లగా పడమర వాలుతుంది
అర్థం కాని కాలం లా నీరాక
ఎప్పుడొస్తావు మరి
రేడియమ్
9291527757





