కాలానికి  సైతం
నచ్చని నిజమొకటి ఉంది నాలో
దాని ఈర్ష్య ఓ పరీక్ష

కొలిచినా చిన్నచూపే
కలసిరాని పగ దానిది
రుచిని వేధిస్తు ఆకలిని నిషేధిస్తుంది

ఆశకు విలువ లేకుండా చేసి
మంచిని నటిస్తు దేన్నీ రానివ్వదు
బలగాలతో  బలం చూపుతుంది

రేపు ఏదో ఓ రోజు
తను పల్లకీగా మారుతానని తెలిసే
ఈ లోపల ఇదంతా ఆ ఆటలా ఓ నాటకం

కష్టం సహనం నమ్మకం దైర్యం
ఎవరి ముఖంలో చూసినా
లొంగుబాటు ధోరణి దాని నైజం

ఎదురుతిరిగి తిరిగిదాడి చేస్తేనే
కాలం తనతో సమానంగా
నిన్ను నీ పేరుతో గౌరవించేది

చందలూరి నారాయణరావు  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *