“ఎన్ని సార్లు చెప్పాలి?”
“పర్లేదు చెప్పు, నీకు తాగే వోపిక వుంది. నాకు వినే వోపిక వుంది”
“అంటే?”
“సండే వీకెండ్ వదిలేసెయ్, మండే?”
“ఊ… మా ఫ్రెండ్‌వాళ్ళ మేరేజ్ డే, నువ్వొచ్చావ్ కదా?”
“సాక్షాలు వద్దు. ఫ్రెండ్స్‌తో తాగావ్, వోకే. ట్యూజ్ డే?”
“మా కొలీగ్ రిటైర్మెంట్ ఫంక్షన్, ప్రెజర్ చేస్తే?”
“వాళ్ళకోసం ప్రెజర్ తీసుకున్నావ్, మళ్ళీ నేనెందుకు ప్రెజర్ చెయ్యడం? నెక్స్ట్ వెన్స్ డే?”
“ఊర్నుంచి మా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ వచ్చాడు, చాలా యేళ్ళకి”
“సో, తప్పలేదు. ఐ అండర్‌స్టుడ్. వై థర్స్ డే?”
“అదేంటి నా థిక్ ఫ్రెండ్ రఘుగాడికి ప్రమోషనల్ పార్టీ, ఫ్రెండ్స్అందరినీ పిలిచాడు కదా?”
“ఊ… ఆనందం ‘ఫుల్ల్’గా పంచుకున్నావ్ అదీ వొకే, ఫ్రై డే… ఇండిపెండెన్స్ డే. పెళ్ళయి మీ ఇండిపెండెన్స్ పోయింది అందుకనా?”
“ఆఆ… అదికాదు, ఇండిపెండెన్స్ డే కదా? దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిందని కొందరు, రాలేదని కొందరు”
“ఆహా… రియల్లీ?”
“సిల్లీ కాదు, సీరియస్. ఇండిపెండెన్స్ వచ్చిందని నమ్మినవాళ్ళు హేపీగా, రాలేదని నమ్మినవాళ్ళు బాధగా”
“తాగేశారు. గుడ్! మరి సాటర్ డే?”
“సక్సెస్ మీట్!”
“వాట్?”
“మనోహర్‌గాడికి కిడ్నీలో స్టోన్స్ అయ్యాయి తెలుసు కదా?”
“వాడి నొప్పి మీరు మర్చిపోడానికి తాగారు వోకే, మరి యీ ‘సక్సెస్ మీట్’ యేంటి?
“ప్చ్… అదికాదు, వాడి ఆపరేషన్ సక్సెస్ అయింది, అందుకని అందరం కలిసి…”
“సక్సెస్ మీట్’ చేసుకున్నారు, వెరీగుడ్! మరి యివాళ?”
“అదేంటి వీకెండ్ కదా?”
“వారానికి వొక్క వీకెండ్. తప్పులేదు. సరేగాని, వొక మంచి సంబంధం వుంటే చూడు”
“ఎవరికిరా?”
“నాకే, నీ లివర్ పోయి పోతే, నన్నిలా వొంటిగా వదిలేస్తావా?”
“…………………….”
“అంత ఫీలవుతున్నావేంటి? ఈ బాధతో కూడా మందుకొట్టు. సంబంధం దొరికితే దొరికిందని కొట్టు. రేపు పెళ్ళానికి పెళ్ళయి పోయిందని కొట్టు. ఆవలెల్లుండి నుండి పాపం పెళ్ళామే లేదని రోజూ- కొట్టు…”
“ప్లీజ్…”
“అలా మాట్లాడొద్దా? ఎక్కడికి వెళుతున్నారు?”
“మందు మానేద్దామని అనుకున్నా, బట్ యివన్నీ విని తట్టుకోవడం నావల్ల కాదు…”
“……?…!…?…..”
బమ్మిడి జగదీశ్వరరావు





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల