కల్పనారెంటాల
తెలుగు సాహిత్యంలో ఎల్జీబీటీక్యూ అంశాలమీద రచనలు చేసే విషయంలో రచయితలుగా ఒకవిధమైన సెన్సార్షిప్, ప్రచురణకు నోచుకోవడంలో మరో విధమైన సెన్సార్షిప్ ఎదుర్కొంటున్నారు. పాఠకుల్లోకూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంతమాత్రాన ఈ అంశం కేవలం 21 వ శతాబ్దపు సమాజానికి మాత్రమే సంబంధించినది కాదు. అలాగే ఇది కేవలం పాశ్చాత్యధోరణి కూడా కాదు. భారతీయ సమాజానికి ఎంతో పరిచితమైన ఈ అంశం గురించి ఇప్పటికీ లోతైన రచనలు రాలేదనే చెప్పవచ్చు. అయితే ఆ దిశగా రచయిత్రులు రెండురకాల సెన్సార్షిప్పులను అధిగమించి రచనలు చేస్తున్నారు.
నాన్ బైనరీ జెండర్ల అవగాహన ఇప్పటి సమాజానికి తప్పనిసరి. అది భారతదేశమైనా, పాశ్చాత్యమైనా. సమాజంలో ఎంతోకాలంగా బహిర్గతంగా కాకపోయినా, రహస్యంగానైనా ఎల్జీబీటీక్యూ సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే అనేకకారణాల వల్ల సాహిత్యంలో వీటినీ ఒకప్పుడు చెప్పీచెప్పినట్లు చెపితే ఇప్పుడు నేరుగా చర్చిస్తున్నారు.
అయితే ప్రచురణల విషయంలో ఆ ఓపెన్ నెస్ ఇంకా పూర్తిగా రాలేదు. పాఠకులనుంచి ప్రశంస కంటే ప్రతిఘటన, నిరసన, రాసిన రచయితల పట్ల ఒక విధమైన విషంచల్లే కామెంట్లు చేయటం పరిపాటై పోయింది. అలాగే ఈ అంశాల పట్ల సహానుభూతితో రచనలు చేస్తే, ఆ రచయితల వ్యక్తిగతబంధాలకు దాన్ని ముడిపెట్టేధోరణి ఆగనంతవరకు ఈ అంశాలమీద లోతైన సాహిత్యం రాలేకపోవచ్చు.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల