మానస ఎండ్లూరి
పురాణాల నుంచి స్వలింగ సంపర్కుల గురించి ప్రస్తావన ఉన్నా ఇప్పటికీ ఇవి అప్పుడే ఉన్నాయని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆధునిక సాహిత్యంలో కొంతమంది రచయితలు బెరుకుగానో ధైర్యంగానో స్వలింగ సంపర్కుల గురించి బృహన్నల నేపథ్యాలతో రచనలు చేస్తూ వస్తున్నారు. తెలుగులో ఒకప్పుడు కేవలం ట్రాన్స్ విమెన్ ల గురించి మాత్రమే సానుభూతి సాహిత్యం వచ్చిందని చెప్పాలి.
వారు పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తూ వ్యభిచారం చేస్తూ ఇతరులకి సాయం చేస్తున్నట్టు వారి వెనుకున్న జాలి జీవితాలను ఈ వ్యవస్థ వాళ్లనుపెట్టే శారీరకహింసను గురించి మాత్రమే సాహిత్యంలో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేది. పైగా ఇవి ట్రాన్స్ విమెన్ రాసిన రచనలు కాదు. స్త్రీ పురుషులే వీళ్ళ గురించి ఉత్సుకతతో రాసినవి.
ఇప్పటికీ స్త్రీ పురుషులుగా ఉన్న రచయితలు మాత్రమే లెస్బియన్స్ గే ల కథలు రాస్తున్నారు. ఇప్పుడొచ్చిన మార్పు ఏమిటంటే ఇదివరకట్లా కేవలం జాలి సాహిత్యం కాకుండా వారిప్రేమలు, మనసుల్లో ఉన్న భయాలు, సంకోచాలు, సందేహాలు, స్నేహితులతో కుటుంబాలతో ఈ సమాజంతో ఉన్న క్లిష్టతరమైన విషయాలను కథలుగా రాస్తున్నారు. కొంతమంది ఈ విషయాల గురించి తెలుసుకోవడం చదువుకోవడం ఫ్యాన్సీ విషయంగా చూడటం గమనించాను.
అయితే వీళ్ళల్లో కూడా కులం, స్థాయి బేధాలు లేకపోలేదు. వీళ్లలో కూడా మగవారిదే పనిచేయి. ఇప్పటికీ గేల గురించి మాట్లాడుకున్నంత హాయిగా లెస్బియన్ ల గురించి ట్రాన్స్ మెన్ గురించి బై సెక్ష్సువల్ ఆడవారి గురించి మాట్లాడుకోవడానికి ఇదే సంఘం వెనకాడుతుంది. సమాజం ముందుగా అంగీకరించింది కూడా పెద్ద కులాల నుంచి వచ్చిన గేలు, ఎన్నారైలనే.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల