పుస్త‌క ప‌ఠ‌నాస‌క్తి పెంచుదాం

ఆదివారం ఇందిరా పార్క్ లో కార్య‌క్ర‌మం

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోని పార్కుల్లో అక్టోబర్ 26న పార్కుల్లో పుస్తక పఠన ప్రాముఖ్యతను తెలపడానికి మ‌రో గ్రంథాల‌యం సంస్థ నిర్వాహ‌కులు ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రచయితలు ,రచయిత్రులు, కవులు, కవయిత్రులు, కళాకారులు, జర్నలిస్ట్ లు, విద్యావంతులు, పుస్తకప్రేమికులు,ప్రచురణకర్తలు,పుస్తక విక్రేతలు,సంపాదకులు విద్యార్థులు ,అధ్యాపకులచే, వాళ్లు రాసిన లేదా చదివిన మంచి పుస్తకాన్ని, కథను, కవితను, పాటనో,పద్యాన్ని చదివే కార్యక్రమాన్ని అక్టోబర్ 26న ఉదయం 10 గంటల నుండి హైదరాబాదు ఇందిరా పార్క్ లో చేపట్టింది.

ఎవ‌రైనా త‌మ‌కు నచ్చిన పుస్తకంతో వ‌చ్చి చ‌దివి ప‌రిచ‌యం చేయ‌వ‌చ్చున‌ని మ‌రో గ్రంథాల‌య ఉద్య‌మ నిర్వాహ‌కులు శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అజ్ఞానాన్ని పారదోలడానికి,(అత్ దీపోభవ) నువ్వే దీపం కావాలి! ‘ జ్ఞానాన్ని వెదజల్లడమే ప్రాణం ఉన్న మనుషులు చేయాల్సిన పని’అన్న బుద్ధుడి స్పూర్తితో బుద్ధిజీవులుగా మరో గ్రంథాలయ ఉద్యమం లో పాల్గొందామ‌ని పిలుపునిచ్చారు.

ఊరూర,బడిలో,పార్కుల్లో ,కాలేజీల్లో, కార్నర్స్ లో మరో గ్రంథాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయ‌డం ద్వారా భవిష్యత్ తరాన్ని కాపాడుకుందామ‌ని మ‌రో గ్రంథాలయ ఉద్యమం తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కమిటీ యాకూబ్,మంచికంటి,బండారు విజయ కాసుల రవికుమార్, సీఏ ప్రసాద్. ప్రచురణకర్తలు :ప్రభాకర్ కస్తూరి, సంపత్ రెడ్డిలు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *