ప్రత్యేక తెలంగాణ కోసం కొండా వెంకట్ రెడ్డి, 41 ఎంఎల్యేలు

“ఒక వైపున ఉపన్యాసాలు సత్యాగ్రహాలు, పికెటింగులు, ధారణలు హర్తాళ్లు విద్యార్థులు, ప్రజలూ సాగిస్తుండగా మరొక వైపున ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు. రైల్వే స్టేషన్లపై దాడులు, బస్సుల కాల్చివేత రైలుపట్టాల పీకివేత, వగైరా సాగినవి. లాఠీచార్జీ బాష్పవాయువు ప్రయోగం కాల్పులు, అరెస్టులు, రోజువారీ కార్యక్రమమైపోయినవి. పంచాయితీలు, సమితులు, మున్సిపాలిటీలూ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాలు చేయగా గ్రామాలలో కూడా ప్రజా సదస్సులు జరిగి అటువంటి తీర్మానాలే చేయబడ్డాయి తెలంగాణా ఎన్ జివోలూ, ఉపాధ్యాయులు సమ్మె సాగించి ఒకరోజు ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపచేశారు.”

35. జనధర్మో విజయతే

ప్రత్యేక తెలంగాణా కోరికను సమర్థిస్తూ ఆరుగురు కాంగ్రెస్ శాసన సభ్యులు ప్రకటనలు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండా వెంకటరంగా రెడ్డిగారు ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రకటించారు. 41 మంది శాసన సభ్యులు ఏప్రిల్ 15 వరకు రక్షణలు అమలు జరపాలని ప్రకటన చేశారు.

తెలంగాణ మంత్రులు 8 మంది ఒకటిగానూ శ్రీలక్ష్మణ్ గారు విడిగానూ, ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేక ప్రకటనలు చేశారు. తెలంగాణా సమస్యపై మళ్లీ పార్లమెంటులో దుమారం రేగింది. రక్షణలు అమలుపరచాలనీ, బ్రహ్మనందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి తెలంగాణా వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఏర్పాటుచేయాలని కమ్యూనిస్టుపార్టీ ప్రధానికి విజప్తి చేసింది. గవర్నర్ పరిపాలన రాష్ట్రంలో ఏర్పరచాలని జనసంఘం రాష్ట్ర రాజభవనం జట్లుజట్లుగా ధారణ ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రానికి సమ్మతించడానికీ, బ్రహ్మనందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. పార్లమెంటరీ ఉపసంఘాన్ని రాష్ట్రానికి పంపాలన్న సూచన కూడా అమలుకు రాలేదు. అసలు తెలంగాణాలో ఉద్యమం విజృంభించటానికి దరిద్రం నిరుద్యోగం వ్యాపించడమేగాక కాంగ్రెసు ముఠా కైలాటకాలు కూడా కారణమని అనేక పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ లోగా తెలంగాణా మిగులు నిధుల నిగ్గు తేల్చడానికి హైద్రాబాద్ వచ్చిన శ్రీ కుమార్ లలిత్, ప్రభుత్వం తనకు అందచేసిన సూచనలు, సమాచారం ఆధారంగా తెలంగాణా మిగుళ్లు 34 కోట్లుంటాయని ప్రకటించారు. ఈ లెక్క సరికాదనీ, తెలంగాణా నిధులు 100 కోట్లు పైబడి ఉంటాయని ప్రాంతీయ సంఘం, 70 కోట్ల దాకా ఉంటాయని శ్రీ కొండా లక్ష్మణ్ గారు ఆ తరువాత ప్రకటించించారు.

ఇదే సందర్భంలో ముల్కీ నిబంధనలు చెల్లవని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పింది. మంత్రి శ్రీ లక్ష్మణ్ ప్రాంతీయ సంఘాధ్యక్షుడు శ్రీ చొక్కరావుగారు ఢిల్లీ వెళ్లి ప్రధానికీ, కేంద్ర ప్రభుత్వ ‘పెద్దలకు “తెలంగాణా రాష్ట్రాన్ని ఉపరాష్ట్రంగా అస్సాంలో కొండ రాష్ట్రం మాదిరి అధికారాలు గలదిగా ఏర్పాటు చేయాలని శ్రీ లక్ష్మణ్ గారూ, ప్రాంతీయ సంఘానికి పరిపూర్ణ అధికారాలు ఇవ్వాలని శ్రీ చొక్కారావు గారూ కేంద్ర నాయకులకు నచ్చచెప్పలేకపోయారు. తరువాత శ్రీ లక్ష్మణ్ మంత్రి పదవికి రాజీనామా ఇచ్చారు.

ఒక వైపున ఉపన్యాసాలు సత్యాగ్రహాలు, పికెటింగులు, ధారణలు హర్తాళ్లు విద్యార్థులు, ప్రజలూ సాగిస్తుండగా మరొక వైపున ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు. రైల్వే స్టేషన్లపై దాడులు, బస్సుల కాల్చివేత రైలుపట్టాల పీకివేత, వగైరా సాగినవి. లాఠీచార్జీ బాష్పవాయువు ప్రయోగం కాల్పులు, అరెస్టులు, రోజువారీ కార్యక్రమమైపోయినవి. పంచాయితీలు, సమితులు, మున్సిపాలిటీలూ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాలు చేయగా గ్రామాలలో కూడా ప్రజా సదస్సులు జరిగి అటువంటి తీర్మానాలే చేయబడ్డాయి తెలంగాణా ఎన్ జివోలూ, ఉపాధ్యాయులు సమ్మె సాగించి ఒకరోజు ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపచేశారు. ఏప్రిల్ 6వ తేదీన తెలంగాణా అంతటా విద్యార్థి కార్యాచరణ సమితి నాయకులనూ, అచ్యుతరెడ్డి ప్రభృత శాసన సభ్యులనూ ప్రజాసమితి నాయకులనూ ప్రభుత్వం పి.డి. ఆక్ట్ క్రింద 151వ సెక్షన్ క్రింద అరెస్టులు చేసింది ఎ.పి.సి పి అధ్యక్షుడు కాకాని, డా॥ చెన్నారెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, చొక్కారావుగార్లతోనూ, ప్రతిపక్ష స్వపక్ష కేంద్ర నాయకులతోను ప్రధాని చర్చించారు. ఆ తరువాత ప్రధాని తెలంగాణా సమస్య పరిష్కారానికి అష్టసూత్ర పధకాన్ని ప్రకటించారు.

తెలంగాణా ప్రాంతీయ కాంగ్రెసు కార్యకర్తల సదస్సు మూడు రోజులు చర్చలు జరిపి కూడా ఏకగ్రీవ నిర్ణయానికి రాలేక ఏకగ్రీవత సాధించి నిర్ణయానికి వచ్చేందుకు 27 గురితో ఒక కమిటీ వేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తల సదస్సు జరిగి రాష్ట్ర సమైక్యతా తీర్మానం చేశారు.

ప్రధాని ప్రకటనననుసరించి నిధులు తేల్చటానికి భారవ సంఘం ఉద్యోగుల పరిస్థితి పరిశీలనకు వాంచూ సంఘం మొదలైన ఉన్నతాధికారి సంఘం వేయబడ్డాయి. ఫరీదాబాద్ కాంగ్రెస్ సభల్లో పాల్గొని వచ్చిన ముఖ్యమంత్రి తన మంత్రి వర్గాన్ని విస్తరించడానికి తెలంగాణా నాయకులతో మంతనాలు సాగించారు. జిల్లాకు కోటి రూపాయిల చొప్పున తెలంగాణా తొమ్మిది జిల్లాలలో అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణా ప్రాంతంలో రెండు వేల ఉద్యోగాలను కల్పిస్తూ అభ్యర్థులను ఎంచుకొనే ఆధికారం జిల్లా కలెక్టర్ చేశారు. ప్రాంతీయ కాంగ్రెస్ ఉపసంఘం రక్షణల అమలు కోరుతూ కొన్ని సిపార్సులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *