జీవితాన్ని తెలంగాణ కోసం

అర్పించిన మహనీయుడు కాళోజీ
ప్రజాకవికి కేసీఆర్‌ నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాం స్కృతిక గరిమను ప్రపంచా నికి చాటేందుకు కవిగా తన కలాన్ని గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.ప్రజాకవి, పద్మ విభూషణ్‌ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా కేసీఆర్‌ ఆయన సేవలను స్మరించుకున్నారు.

తెలంగాణ సమాజం కోసం వారు పడిన తపన, వారందించిన పోరాట స్ఫూర్తి, మలిదశ ఉద్యమంలో అనంతర బిఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో ఇమిడివున్నదని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. కాళోజీ కృషిని, స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు అందించటానికి నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. తోటి మనిషి క్షేమాన్ని కోరుకోవడం, సబ్బండ వర్ణాల అభ్యున్నతకి చిత్తశుద్ధి తో కృషి చేయడం ద్వారానే వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాళోజీకి మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *