1974 లో జరిగిన కాళోజీ నారాయణ రావు గారి షష్టిపూర్తి ఉత్సవాల సందర్భంగా పీ వీ నరసింహారావు గారు మాట్లాడుతూ చెప్పిన ఈ ఉదంతం ఆయన మాటల్లోనే – ‘‘సదాశివరావు మా వాడు’’. కాకతీయ పత్రిక కు ఎడిటర్. పత్రిక మొదలెట్టాం. ఎవరు అమ్మాలి దాన్ని? నేను అమ్మే వాడిని. స్నేహంగా ఎవరినయినా అడిగితే ఓ పది రూపాయలు చందా వచ్చేది. ఈ లోపల సదాశివరావు భూస్వాములను తిడుతూ వ్యాసాలు వ్రాసేవాడు. వాళ్ళు కొనరు చదవరు, నిరక్షరాస్యులు కనుక. పత్రిక అమ్మటానికి మటుకు అది అడ్డంకయింది. ఒక నిర్ణయానికొచ్చినాం. కారణం కాళోజీ. ‘నీ కేందుకీ ఆవేదన? నీకెవరన్నా ఫీజు ఇస్తున్నారా? కేస్ ఇచ్చారా? నీ వాణి ఎవరి కోసం రాసిందిరా? ఎవరికొరకూ కాదు ఇది మనసు నిండి ఒలకపోసిన ధార. ఎవరండీ ఆపేది?’ అన్నాడు కాళోజీ. ఆ అనడం లోనే అనేక అర్ఠాలు గోచరించాయి.’’
కాకతీయ పత్రిక ‘‘మొదటి స్వాతంత్య్ర దినోత్సవ సంచిక (15-8-1049)
1945 ప్రాంతాల్లో నాగపూర్ లో న్యాయ విద్య అభ్యసించిన పీ వీ గారు హైదరాబాద్ వచ్చి బూర్గుల రామ కృష్ణారావు గారి దగ్గర జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అప్పటి నిజాం నిరంకుశ ప్రభుత్వ వ్యతిరేక భా వాలను కలిగిన పీ వీ గారు స్వామి రామానందతీర్థ నాయ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీ సాగించే కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయనకు శిష్యుడిగా మారి న్యా యవాది వృత్తిని వదిలి రాజకీ యాల వైపు మొగ్గు చూపారు. 1941 లో నాగపూర్ లో పీవీతో కలిసి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న పాములపర్తి సదాశివరావు వరంగల్ చేరారు. పీవీ గారు తర్వాత బి ఎస్ సీ చదవడానికి పూనా వెళ్లారు. సదాశివరావు వరంగల్ లోనే వుండి పోయారు. దానికి కారణం ఆయన తల్లి దుర్గమ్మ గారు. ఎందుకంటే సదాశివరావు గర్భంలో వున్నప్పుడే ఆమె భర్త హను మంతరావు గారు చనిపోయారు.
1945 ప్రాంతాల్లో నాగపూర్ లో న్యాయ విద్య అభ్యసించిన పీ వీ గారు హైదరాబాద్ వచ్చి బూర్గుల రామ కృష్ణారావు గారి దగ్గర జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అప్పటి నిజాం నిరంకుశ ప్రభుత్వ వ్యతిరేక భా వాలను కలిగిన పీ వీ గారు స్వామి రామానందతీర్థ నాయ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీ సాగించే కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయనకు శిష్యుడిగా మారి న్యా యవాది వృత్తిని వదిలి రాజకీ యాల వైపు మొగ్గు చూపారు. 1941 లో నాగపూర్ లో పీవీతో కలిసి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న పాములపర్తి సదాశివరావు వరంగల్ చేరారు. పీవీ గారు తర్వాత బి ఎస్ సీ చదవడానికి పూనా వెళ్లారు. సదాశివరావు వరంగల్ లోనే వుండి పోయారు. దానికి కారణం ఆయన తల్లి దుర్గమ్మ గారు. ఎందుకంటే సదాశివరావు గర్భంలో వున్నప్పుడే ఆమె భర్త హను మంతరావు గారు చనిపోయారు.
తండ్రి లేని బిడ్డ అని చిన్నప్పటి నుండి సదాశివరావును ఆమె అతి గారాబం చేసేది. ఈ బిడ్డడు ఎప్పుడూ తన కండ్ల ముందే మెలగాలి అన్న భావన ఆమెలో పేరుకొని పోయి ఆయన నాగపూర్ లో చదువుకొన్నప్పుడు కూడా అనేక సార్లు ఆయనకు ఇబ్బంది కల గచేసేది. మొత్తానికి ఈ అతి గా రాబం ఆయన పై చదువుల ‘విద్య నాశాయ’ చేసింది. ఇక సదాశివరావు ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెట్టారు. ఎమ్ ఎన్ రాయ్ ఆలోచననా విధా నం నచ్చి మార్క్సిస్టు దృక్పథం వైపు ఆకర్షితులై ఆ రోజుల్లో అనం తపూర్. రాజమండ్రి, మద్రాసు మున్నగు ప్రాంతాల్లో రాజకీయ తరగతులు నిర్వహించే వారు. అవి అప్పుడప్పుడు మాత్రమే. వరంగల్ లోనే స్థిరపడ్డ ఆయన వరంగల్ ప్రజలకు వివిధ సాహిత్య, సాం స్కృతిక రంగాల్లో మంచి అవగాహన కల్పించాలని ముందుగా 1945 లో ‘కాకతీయ కళా సమితి’ అనే సాంస్కృతిక సంస్థను ఏర్పరచి ‘‘త్యాగరాజ ఉత్సవాలు’’ పేరిట ప్రతి సంవత్సరం 5 రోజులపాటు శాస్త్రీయ సంగీత, నాటక, చిత్రకళ, వక్తృత్వం, కవితా రచన మున్నగు అనేక కార్య క్రమాలను నిర్వహించి ప్రజలకు వినోదం, విజ్ఞానం కలిగించగలిగారు. నగర వాణిజ్య ప్రముఖులు, ఇతర పుర ప్రముఖులు అందరినీ ఈ కార్యక్రమాల నిర్వహణ లో భాగస్వామ్యం చేసి ప్రజలు వేల సంఖ్యలో వీటిని ఆస్వాదించేట్లు చేశారు.
పత్రిక ప్రారంభించిన ఒక సంవత్సరం తరువాత స్వంత ప్రింటింగ్ ప్రెస్ ను సమకూర్చుకున్న సందర్బంగా రాసిన హాస్య గుళిక (17-7-1949)
అదే సమయంలో పత్రికా రచన పై కూడ ఆసక్తి గల సదాశివరావు మూడు నెలల కొక సారి ‘కాకతీయ సారస్వత సంకలనం’ పేర నాలుగు పేజీల వార్తా సకలనం ప్రచురి స్తూవచ్చారు. ఇందులో వారికి అడవాల సత్య నారాయణ గారి సహకారం వుండేది. ఐతే పీవీ గారు అప్పుడప్పుడు వరంగల్ లో గురువు గార్లపాటి రాఘవరెడ్డి గారిని కలవడానికి వచ్చి గురు రాఘవరెడ్డి, కాళోజీ సోదరులు, సదాశివరావు మొదలగు మిత్ర బృందంతో సాహిత్య చర్చల్లో పాల్గొన్న ప్పుడు ఒకసారి ఈ మూడు నెలల సంకలనం బదులు రెగ్యులర్ గా ఒక వారపత్రికను ప్రచురించాలని అందరూ అనుకున్నారు. ఆ విధంగా ‘‘కాకతీయ పత్రిక’ ఒక వారపత్రిక గా 1948 సెప్టెంబర్ నెల 23 నాడు మొదటి సంచిక గా ఆవిర్భవించింది. ఐతే పత్రికా నిర్వహణకు గాను చేయవలసిన ముఖ్య రంగాలైన ‘ వార్తా సేకరణ మరియు రచనా’ కార్య క్రమం, ముద్రణా కార్య క్రమం, పత్రికలను చందా దారులకు, ప్రజలకు అందించే కార్య క్రమం, ‘ఆఫీసు మరియు ‘ జమా-ఖర్చుల’ నిర్వహణ మొదలగు పనుల సక్రమ నిర్వహణకు గాను ‘పని విభజన ’ చేసుకున్నారు. వీటన్నికంటే ముఖ్యమైన ఆర్ఠిక పటిష్ఠతా కార్యక్రమమైన ‘చందా దారులను’ చేర్పించే అతి ముఖ్య కార్యభారం పీవీ గారు తీసు కున్నారు.
వార్తా సేకరణ విభాగం లో పీ ఎన్ స్వామి, కొండబత్తిని జగదీశ్వర రావు, పెండెం శ్రీని వాస రావు (తర్వాత క్రమం లో చలసాని ప్రసాద రావు) గార్లు వుండగా పత్రికా రచనా కార్యక్రమంలో అప్పుడప్పుడే మేటి జర్నలిస్టుగా ఎదుగుతున్న ఎం ఎస్ ఆచార్య గారు వుండే వారు. ఇక పత్రికా రచన, సంపాదకత్వం సదాశివ రావు గారు చూసుకునే వారు. పీవీ గారు కూడా అప్పు డప్పుడు తన కలం ఝలిపించే వారు. ఇక ముద్రణా కార్యక్రమం (పేజ్ లే ఔట్, ప్రూఫ్ రీడింగ్ మొదలగునవి) చౌడవరపు రాజా నరేంద్ర గారు చూసేవారు. ఇక పోతే మరొక ముఖ్య కార్య క్రమమైన పత్రికా కార్యాలయ నిర్వహణ మొత్తం దేవులపల్లి దామోదర రావు గారు చూసుకునే వారు. ఈ విధంగా అలనాటి కాకతీయ పత్రిక నిర్వహణ ఒక సమిష్ఠి కృషి.1996 ఆగస్ట్‌లో సదాశివరావు చని పోయిన రెండు సంవత్సరాల పిదప 1998లో కాళోజీ గారు రాసిన ‘అడుగడుగునా అడ్డుపడే సదాశివుని యాది’ అనే వ్యాసంలో ‘1950 ప్రాంతంలో సదాశివుడు అపు డపుడూ కాకతీయ సారస్వత సంకలనాలు వెలు వరిస్తు ండేవాడు. అప్పుడే కాకతీయ వారపత్రిక కూడ సదాశివుని సం పాదకత్వంలో వెలువడేది. అప్పటి ‘వెల్లోడీ’ ప్రభుత్వం, వారి సిబ్బంది చేసే అవకతవక పనులను ప్రచురించడం, విమర్శించడం జరిగేది. పత్రికా సంపాదకత్వం అప్పు డప్పుడే ప్రారంభించినా ఎంతో అనుభవం ఉన్న వయోవృద్ధుడైన సంపాదకునిగా, ఆ పత్రికా నిర్వహణ చేసినాడు’ అని తెలిపారు. ఆ పత్రిక గురించి పీవీగారి వ్యాఖ్య – కాళోజీ గారి స్పందన ఈనాటి మన ము చ్చట.
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
– పాములపర్తి నిరంజన్ రావు
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
– పాములపర్తి నిరంజన్ రావు





