చిరస్మరణీయుడు కాళోజీ..

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని ప్రకటించిన ప్రజా కవి కాళోజి నారాయణరావు నిత్య స్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్‌ నేత రోహిన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *