గాడి తప్పుతున్న జర్నలిజం?

” కేసులు,జైళ్ళు ఇక జర్నలిజానికి వేదికలువేధింపులు కాబోతున్నాయి.ఇదే అదనుగా పాలక పక్షాలు నిజమైన జర్నలిస్టులకు వేధింపులు కోసం కేసులుదర్యాప్తు సంస్థలు వినియోగించరనే  గ్యారెంటీ ఏమీ లేదు. జర్నలిస్టులు పాలకులు -యాజమాన్యాల క్రీడలో పావులుగా మారనున్నారు.జర్నలిస్టు సంఘాలు కూడా స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించినా అలా లేవు..!ఏదో ఒక పాలకపక్షం విదిలించే పదవుల కోసం తమ సంఘాల చైతన్యం తాకట్టు పెడుతున్నారు.ఎవరి గుంపు వారికే ఉంది.దశాబ్దాలుగా జర్నలిస్టు సంఘాలు నడిపిస్తున్న నాయకత్వాలే అందుకు ఉదాహరణ..”

‘మాయా’దర్పణం-1

ఎన్.తిర్మల్,
(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)
మొబైల్ :9441864414.ఇమెయిల్: thirmal.1960@gmail.com

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా.భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా మూడు స్తంభాలు మాదిరిగానే పత్రికలుమీడియా వక్రమార్గం పడుతుంది. కాదు,పట్టిస్తున్నారు.స్వతంత్రతను కాపాడుకోవాల్సిన మీడియా పాలక తంత్రాల్లో,కుతంత్రాలలో భాగం అవుతున్నప్పుడే దాని వీశ్వసనీయత ప్రజల్లో సన్న గిల్లుతుంది.పాలకులు సైతం తమ పాపాలపుట్టలను కాపాడుకోవడం కోసం పరోక్షంగానో,ప్రత్యక్షంగానో మీడియా లో పెట్టుబడులు ప్రవహింప జేసి తమ అదుపాజ్ఞలలో పెట్టుకుంటున్నారు.నయానో,భయానో ,ప్రలోభాలతో మీడియా ను గుప్పిట్లో పెట్టుకోవడం ఒక రాజకీయ కళగా ఇప్పుడు అభివృద్ధి అయ్యింది.అవసరం అయితే యాజమాన్యాలు మార్చడానికి పాలకులు వెనుకాడడం లేదు.

ఇక పత్రికా యాజమాన్యాలు పాలకులు ఇప్పుడు వేర్వేరు అనుకుంటే భ్రమే! పత్రికా యాజమాన్యాలు కూడా పైకి స్వతంత్రంగా ఉన్నట్లు నటిస్తూనేవాస్తవం గా ఏదో ఒక పాలకపక్షం అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు.అంతేకాదు తమ వ్యాపార లావాదేవీలకు మీడియాను అడ్డంపెట్టుకొనిజర్నలిజంను నిర్లజ్జగా వాడు కొంటున్న యాజమాన్యాలు తయారయ్యాయి. పొట్టకూటికోసం వృత్తి జర్నలిస్టులు ఆయా యాజమాన్యాలు ఆదేశాలను పాటించి అబద్ధాలను అందంగా మలిచి చెప్పగలుగుతున్నారే తప్పమచ్చుకూ జర్నలిజం విలువలను పాటించడం లేదు.

జర్నలిజంలో నిష్పాక్షికత,మద్యే వాదం అన్నమాట ఇప్పుడు మిధ్య గా మారింది.పద ప్రయోగంలో కూడా సరిహద్దులు చెరిగిపోయాయి.ఇక్కడ యాజమాన్యం తాము భుజాన వేసుకున్న రాజకీయాలు ఎంత నిస్సిగ్గుగా ,నీచంగా మోస్తున్నారో చెప్పవలసిన పనిలేదు,పసిపిల్లవాడినడిగినా ఇట్టే చెప్పేసే పరిస్థితి.ఆయా మీడియాపత్రికల్లో సీనియర్ జర్నలిస్టులు కూడా అంతే లౌక్యంగా వారి పనిని అంకితం చేస్తున్నారు.ఒక సంఘటన జరిగితే సంఘటన సంఘటనగా కాక దాన్ని చిలువలుపలువలు  అల్లి తమ యాజమాన్యాలుతద్వారా తమ పాలకులను ఆనంద పరుస్తున్నారు.వీరందరూ అడ్డం పెట్టుకునే పదం ప్రజలే! కానీ,ఏకోశానా ప్రజా ప్రయోజనం అందులో ఉండదు.

గతంలో పత్రికలు ప్రింట్ చేసి అమ్ముకుంటేఇప్పుడు ముందే అమ్మేసుకొని పత్రికలు నడుపుతున్నారు.ఎవరికి వారు వారివారి వందిమాగాదులను ఎంపిక చేసుకొని చర్చలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నాలే చేస్తారు తప్ప,భిన్న కోణాల్లో సమస్యను చర్చించాలనే  వైఖరి వాస్తవాలు బహిర్గతం చేయాలనే వైఖరి ఎప్పుడో గాలికి వదిలివేశారు. మీడియా రూపురేఖలే మారాయి.సమాజం పత్రికలుమీడియా అంటేనే కాదుజర్నలిస్టు అనే పదానికే విశ్వాసం సన్నగిల్లింది.కుప్పతెప్పలుగా పుట్టిన పత్రికలుయూట్యూబ్ చానెళ్ళు వలన వాటిని ఆదరించి,నియంత్రించే శక్తి ప్రజలకు లేకుండా పోయింది.ఇట్లాంటి స్థితిలో జర్నలిజం విలువలు వెతుక్కోవడం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వేరుకోవడంలాగా ప్రస్తుత జర్నలిజం పరిణామం చెందింది.

ఈ మధ్య జర్నలిజం అధికారప్రతిపక్షాలు బూతులు స్థాయికి దిగజార్చారు.సోషల్ మీడియా పేరుతో పచ్చి అబద్ధాలను కూడా అదుపుతప్పిన మాటలతో ప్రత్యార్థులపై ఉసిగొల్పుతున్నారు.అందుకోసం కొన్ని పత్రికలుమీడియా ఛానళ్ళు,యుట్యూబ్ ఛానళ్ళు రాజకీయ పక్షాలే డబ్బు పెట్టి ప్రత్యేకంగా పెంచి పోషిస్తున్నాయి.గోబెల్స్ అనే వాడు పుట్టింది జర్మనీలో అయినా మన ఇండియా మీడియా అంతా ఎక్కడ చూసినా ఆయన సంతతే కనపడుతుంది.అబద్దాలకు జర్నలిజం షుగర్ కోటింగ్ ఇచ్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారు.ఒకరకంగా జర్నలిజం లో ఆశ్రిత పెట్టుబడులు ప్రొత్సహించి మీడియా గుత్తాధిపత్యాన్ని కి ద్వారాలు తెరిచింది మాత్రం కేంద్రంలో నరేంద్ర మోదీ నే!అదే గోదీ మీడియా గా ప్రత్యర్థులు విమర్శలు కురిపిస్తున్నారు.పాలకులు,యాజమాన్యాలు ఆడుతున్న జర్నలిజం అనబడే పాచికలో చిన్నా,చితకా జర్నలిస్టులు బలౌతున్నారు.కేంద్రప్రభుత్వం లొంగని మీడియా పై సిబిఐ,ఈడీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు.పైగా తమ మీడియాకు తాయిలాలుప్రత్యర్థి మీడియాకు వేధింపులు నిత్య కృత్యం అయ్యింది.

నేషనల్ హేరాల్డ్ కేసులో ప్రతిపక్ష నేతలు సోనియా గాంధీరాహుల్ గాంధీపై కేసులు కట్టి దర్యాప్తు సంస్థలు ఉసీగొల్పిన తీరు చూశాం.ఇంకా రాష్ట్రాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఉపయోగించి రాజ్యాంగ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యర్థి మీడియా పై కేసులు మీద కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రత్యార్థి సోషల్ మీడియాను కట్టడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని,ఇటీవల తామరతంపరగా సోషల్ మీడియా నిర్వాహకుల అరెస్టులే ధృవీకరిస్తూ ఉన్నాయి.మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే బాటలో నడిచి యన్ టీవిజర్నలిస్టులు ముగ్గురిని సంక్రాంతి పండుగ అని కూడా చూడకుండా బలవంతంగా అదుపులోనికి తీసుకున్నారు.పైగా ఓ వార్తా కధనం పై విచారణకు సిట్ అనే దర్యాప్తు గ్రూపును సైతం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన పనికి,అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ చేసిన పనికి పెద్ద తేడా ఏమీలేదు..!ఇక్కడ,అక్కడ,ఎక్కడైనా  మీడియా గ్రూపులు ప్రయోగిస్తున్న తీవ్రమైన పదజాలంఅసత్యాలు, అర్థ సత్యాలు జర్నలిజం కానేకాదు.కానీ,వాటికి జర్నలిజం ముసుగు తొడిగి కక్ష్యలుకార్పణ్యాల రొంపిలోకి జర్నలిజం అనే పదాన్ని లాగుతున్నారు.

కేసులు,జైళ్ళు ఇక జర్నలిజానికి వేదికలువేధింపులు కాబోతున్నాయి.ఇదే అదనుగా పాలక పక్షాలు నిజమైన జర్నలిస్టులకు  వేధింపులు కోసం కేసులుదర్యాప్తు సంస్థలు వినియోగించరనే  గ్యారెంటీ ఏమీ లేదు. జర్నలిస్టులు పాలకులు -యాజమాన్యాల క్రీడలో పావులుగా మారనున్నారు.జర్నలిస్టు సంఘాలు కూడా స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించినా అలా లేవు..!ఏదో ఒక పాలకపక్షం విదిలించే పదవుల కోసం తమ సంఘాల చైతన్యం తాకట్టు పెడుతున్నారు.ఎవరి గుంపు వారికే ఉంది.దశాబ్దాలుగా జర్నలిస్టు సంఘాలు నడిపిస్తున్న  నాయకత్వాలే అందుకు ఉదాహరణ. అన్ని వ్యవస్థల మాదిరే జర్నలిస్టు వ్యవస్థను భ్రష్టు పట్టించే పనిలో పాలక పక్షాలు తలమునకలై నాయి.ప్రజలుకూడా తమ జర్నలిస్టు లలో పూర్వంలాగా పని నిబద్దతవృత్తి నిబద్దత ఉందని భావించడం లేదు.

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన జర్నలిజం పెట్టుబడికి,కట్టుకథలకు విషపుత్రికలుగా మారిపోయాయి.పాలకులు-మీడియా-యాజమాన్యాలు-జర్నలిజం తో క్రమంగా ప్రజలు అనే పదానికి మధ్య సంబంధం తెగిపోయి కనిపిస్తుంది.తస్మాత్ జర్నలిస్టు మిత్రులారా జాగ్రత్త !కాలంతోపాటు వృత్తి ధర్మం మారుతుంది.స్వార్థం వెయ్యి వెర్రితలలు వేస్తున్న వేళ జర్నలిజంలో  నిబద్దత కనాకష్టంగా  మారుతుంది. జర్నలిజం మచ్చుకు కూడా కానవచ్చే పరిస్థితి లేదు.ప్రజాస్వామ్య నాలుగవ స్తంభం అయిన జర్నలిజం పునాదులు గురించి ప్రజలుజర్నలిస్టులు సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.బహుపరాక్ జర్నలిస్టు మిత్రులారాఇక జర్నలిజం అంటే దాడులుకేసులు,కోర్టులు,జైళ్ళు అనే ఓ భయానక వాతావరణం అనేది సమాజానికి అంతమంచిది కాదు! ప్రజల స్వేఛ్ఛా సమాచారహక్కును నిరోధించడం,భంగం కలిగించడమే అవుతుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *