పక్షి జీవితం
స్వేచ్ఛమయ జీవనం
నీలి గగనం
హిమనగం
అడువులు లోయలు
పూలపండ్ల తోటలు
చింత తొర్రలు
తాటి తోపులు
శిథిల భవనాలు
ఇక్కడ అక్కడని కాదు
ప్రకృతియే పక్షి
సహజ రాగాల పుట్టినిల్లు
సంగీత రసధుని
అందమైన రంగుల అహార్యం
తన్మయత్వంలో సర్వజీవులు
కంటి కెమరాకు చిక్కీ చిక్కని
నివాస జిగిబిగిల కల్పనలు
నేర్పుతాయి వైవాహిక తత్త్వాన్ని
స్వేచ్ఛా రెక్కలు తెగినా
స్వేచ్చకు అవాంతరం ఏర్పడినా
మళ్లీ మళ్లీ రెక్కల అంకురార్పణం
మళ్లీ స్వేచ్చ ప్రయాణం
స్వేచ్ఛకు మృత్యువు లేనే లేదు
శ్వాస ఉన్నంతవరకు పోరు తప్పదు
-రేడియమ్