
దక్షిణార్ధ గోళంలో ఉన్న ఆసియా దేశాలలో అనేకం మతం ఆధారంగా కలహించుకుంటూ,అగ్ర రాజ్యాల ప్రయోజనాలకు తీర్చే విధంగా విధేయంగా ఉంటున్న సందర్భంలో ,వీటికి అతీతంగా స్వయం స్వాలంబన ,ఆత్మ గౌరవ బావుటా ను ఎగురవేస్తున్న దేశంగా ఇరాన్ చరిత్ర పుటలలో నిలుస్తున్నది.వియత్నాం తర్వాత ప్రపంచ పోలీసుగా విర్రవీగుతున్న అమెరికాను అది అగ్ర రాజ్యం కాదు,ఒక క్రూర ఆధిపత్య అప్రజాస్వామిక నియంత ధోరణులకు ప్రతీక అని అని ప్రకటించిన దేశం ఇరాన్.ఇంధన వనరులు ఎక్కువగా ఉన్న మధ్య ప్రాచ్యంలో అమెరికా విస్తరణ వాదానికి,దాని ప్రాక్సీ ఇజ్రాయెల్ ను మధ్య ఆసియాలో అగ్ర పోలీసు రాజ్యంగా నిలబెట్టడానికి దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియను నిరోధిస్తూ బలమైన రక్షణ శ్రేణిగా ఇరాన్ నిలబడుతున్నది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుద్ధాలకు అమెరికా దూరంగా ఉండాలని ప్రదర్శనలు జరిపి,నేను అధికారంలో ఉంటే రష్యా ఉక్రేనియా యుద్ధం జరిగేది కాదని అని చెప్పి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచం పై ఆధిపత్యం కోసం యుద్ధోన్మాదం కొనసాగిస్తున్నారు .తన తొలి దశ పాలనలో ఇరాన్ సైన్యాధిపతి సులేమాన్ ను 2020లో చంపిన ట్రంప్ అమెరికా రెండో దశ పాలనలో తన ప్రాక్సీ ఇజ్రాయెల్ తో ఇరాన్ పై జూన్ 13 నుండి దాడులను ప్రారంభించింది.ఇరాన్ కీలక శాస్త్రవేత్తలను సైనికాధికారులను హతమార్చింది.జూన్ 22 న అమెరికా నేరుగా 30 వేల కిలోల పేలుడు పదార్థాలను ఇరాన్ లోని ఫార్డో ,నటాంజ్,ఇష్ఫాన్ అణు క్షేత్రాలపై జారవిడిచి వాటిని ధ్వంసం చేసింది .
పేరుకు ధార్మిక పాలనగా ఉన్న ఇరాన్ లో మత ఛాందసవాదానికి చోటు లేకుండా చేశారు.విద్యా సాంకేతిక వైద్య రంగాలలో అనూహ్య మార్పులు తెచ్చి ఇరాన్ ను అభివృద్ధి సూచికలలో గొప్ప ముందడుగు వేయించారు.బాగా అభివృద్ధి చెందుతున్న దేశంగా యు యన్ పేర్కొంది.అంతరిక్షం,ఏ ఐ,జీవ,సేమి కండక్టర్ సాంకేతిక రంగాలలో తనకంటూ సొంత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంది.ఆల్ ఖైదా ఆరంభించిన ఛాందస ఇస్లామిక్ స్టేట్ ను బలహీనం చేయడంలో గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది…
అమెరికన్ ఇంటలెజిన్స్ సంస్థ ,యు యన్ అణుశక్తి విభాగం వారు తమ నివేదికలలో ఇరాన్ అణుబాంబు తయారీకి ప్రయత్నం చేయడం లేదని దానికి ఎలాంటి ఆధారాలు లేవని పలు మార్లు స్పష్టం చేసాయి.శాంతి యుత ప్రయోజనాల కోసం,అణు విద్యుత్ కోసం మాత్రమే యురేనియం శుద్ధిని చేస్తున్నామని ఇరాన్ పదే పదే పలు వేదికలపై స్పష్టం చేసింది.అణ్వస్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని గుర్తించి ఇరాన్ సంతకం చేసింది.ఇరాన్ యురేనియం శుద్ధి వైద్యం,శక్తి రంగంలో మాత్రమే ఉపయోగిస్తున్నామని ,ఈ విషయాలను అణు ఏజెన్సీ కి ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉంది. అయినా కూడా ఇరాన్ వల్ల తమకు హాని ఉందని ఇజ్రాయెల్ అమెరికా లు అమానవీయ దాడులకు పాల్పడుతున్నాయి.
ఇరాన్ లో 1953లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అమెరికా కుట్రతో కులదోసి తన అనుకూల రాజా వంశం ప్లవీ షా ను రాజుగా నియమించింది.రాచరిక పాలనలో అమెరికా ప్రయోజనాలను నెరవేర్చడం కోసం స్థానిక ప్రజలపై తీవ్రమైన దమనకాండను రాజు అమలు చేశాడు.ఈ అణచివేత తో వచ్చిన నిరసన వెల్లువలో 1979 లో అమెరికా అనుకూల ప్లవీ షా రాచరికాన్ని కూలదోసి ఇస్లామిక్ విప్లవం ద్వారా అధికారంలోకి ఖమైని అధికారంలోకి వచ్చారు.పేరుకు ధార్మిక పాలనగా ఉన్న ఇరాన్ లో మత ఛాందసవాదానికి చోటు లేకుండా చేశారు.విద్యా సాంకేతిక వైద్య రంగాలలో అనూహ్య మార్పులు తెచ్చి ఇరాన్ ను అభివృద్ధి సూచికలలో గొప్ప ముందడుగు వేయించారు.బాగా అభివృద్ధి చెందుతున్న దేశంగా యు యన్ పేర్కొంది.అంతరిక్షం,ఏ ఐ,జీవ,సేమి కండక్టర్ సాంకేతిక రంగాలలో తనకంటూ సొంత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంది.ఆల్ ఖైదా ఆరంభించిన ఛాందస ఇస్లామిక్ స్టేట్ ను బలహీనం చేయడంలో గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది
వడ్డీ ఇతర వ్యాపారాలలో ఐరోపా జనాన్ని మోసం చేస్తూ,అక్కడి స్థానిక ప్రజలకు అవకాశాలు లేకుండా చేస్తున్న యూదులను జర్మన్ నాజీ హిట్లర్ తో పాటు యూరప్ ఖండమంతా లక్షలాదిగా హననం చేసి,తన్ని తరిమేస్తున్న సందర్భంలో వారంతా పాలస్తీనా కు నివాసం ఏర్పాటు చేసుకున్నారు.ఇక్కడి అరబ్బులు ,పరిసర ఇరాన్ దేశం కూడా సాదరంగా స్వీకరించి అక్కున చేర్చుకున్నారు.ఆ తర్వాత తమకు ఆశ్రయం ఇచ్చిన పాలస్తీనా ప్రజలను మోసం చేసి ,అణచివేత దౌర్జన్యాలతో ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్నారు.పరిసర లెబనాన్,ఈజిప్ట్ సిరియా లలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.
1979 నుండి ఇరాన్ ఇజ్రాయెల్ ను గుర్తించడం మానేసింది.ఇజ్రాయెల్ అనుసరుస్తున్న విస్తరణ దురాక్రమణకు పోరాడుతున్న పలు దేశాల పోరాట సంస్థలకు అండగా ఉంటున్నది.అక్కడి ప్రజల ఆత్మ గౌరవ స్వయం పాలన పోరాటాలకు సంఘీభావాన్ని ఇస్తున్నది. మధ్య ఆసియాలో ఉన్న అపార చమురు నిల్వలను చేజిక్కుంచుకోవడానికి ,అమెరికా తన విధేయ ఇజ్రాయెల్ లు చేస్తున్న పలు ప్రయత్నాలకు అడ్డు గోడగా నిలుస్తున్నది.రాజకీయ ఆర్థిక సాంకేతిక రంగాలలో నిలదొక్కుకుని మధ్య ప్రాచ్యంలో సామ్రాజ్యవాదానికి సవాల్ విసురుతున్న ఇరాన్ ను మట్టు బెట్టాలనే తెగింపుతోనే అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధమిది.
ట్రంప్ బాంబు దాడులకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేదు,అక్కడి ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఈ యుద్ధం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు,ఐక్యరాజ్య సమితి నియమాలకు విరుద్ధమైనది అని అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి.బాంబులు తుపాకులతో పాటు ఆహారాన్ని పాలస్తీన ప్రజలకు అందకుండా చేస్తూ జెనోసైడ్ కు పాల్పడుతున్న యుద్ధ నేరస్తుడిగా అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారంట్ జారీ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు జత కట్టడం అమానవీయం అని ట్రంప్ పై విరుచుకపడుతున్నారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులు సుమారు 30 బిలియన్ కోట్ల డాలర్లను ఇజ్రాయెల్ కు అందించడం నేరమని నిరసన తెలియచేస్తున్నారు. జూన్ 14 న దేశ వ్యాప్తంగా నో కింగ్స్ డే పేరుతో రెండు వేల ప్రాంతాలలో కోటికి పైగా ప్రజలు ట్రంప్ అస్తవ్యత్స్య టారిఫ్ లు,ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా వీధులలోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపారు.
ఇరాన్ తన చుట్టూ ఉన్న పాకిస్థాన్,చైనా రష్యా ,ఇజ్రాయెల్ దేశాలు అణుశక్తిని కలిగి ఉన్నాయి.ఇజ్రాయెల్ మినహా మిగతా దేశాలతో స్నేహ సంబంధాలను కలిగి ఉన్నది.తమ అణు విధానం శాంతియుత ప్రయోజనం కోసం అని నిరూపిస్తూ ఒబామా కాలంలో అమెరికాతో ఒప్పందం చేసుకున్నది. ట్రంప్ ఈ ఒప్పందం నుండి వైదొలిగినా కూడా అతనితో ఐదు దఫాలుగా చర్చలు జరిపింది.తమ ప్రపంచ ఆధిపత్యానికి అడ్డుగా ఉన్న చైనా రష్యాతో స్నేహాన్ని కలిగి ఉందని , మధ్య ప్రాచ్యంలో తమ ప్రాబల్యానికి సవాల్ గా ఉన్న ఇరాన్ ను వికృత యుద్ధోన్మాదంతో దాడులకు తెగ పాల్పడుతున్నారు.అమెరికా గతంలో జరిపిన ఆక్రమణ వాద యుద్ధాలతో ఇంకా గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. 2001 లో అఫ్గానిస్తాన్ నుండి తాలిబన్ లను ఏరివేస్తానని 20 ఏండ్ల యుద్ధం చేసి చివరకు వారికే అధికారాన్ని అప్పచెప్పిన వైనం ఉంది.జనహనన ఆయుధాల నెపంతో ఇరాక్ పై 2003లో దాడి చేసింది.అలాగే లిబియాను 2011లో కల్లోల పరిచింది.వీటిలో అమెరికా తన దురాశ ప్రయోజనాలను నెరవేర్చుకోలేకపోయింది.
ఇరాన్ ఇప్పుడు సామ్రాజ్యవాద పీడిత మూడవ ప్రపంచానికి ఒక దీప స్తంభంగా మారుతున్నది.అమెరికా దాడులకు ప్రతీకారంగా మధ్య ప్రాచ్యంలోని అమెరికా యుద్ధ స్థావరాలపై విరుచకపడుతున్నది.ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపిస్తున్నది,ఈ యుద్ధం తాము ప్రారంభించినది కాదని ,తమ పై దాడి చేసిన వారి పట్ల జాలి చూపమని గర్జిస్తున్నది.ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన అనంతరం కూడా ఇజ్రాయెల్ పై శక్తి మేరకు దాడులు చేసి నష్టపరిచింది.ఏలాంటీ తడబాటును,లొంగుబాటును ప్రదర్శించలేదు.
కొందరు అణ్వస్రాలను ఉంచుకుని మిగతా వాళ్లకు అ హక్కుకు లేదనడం అన్యాయం.అణ్వస్త్ర దేశాలు అవి లేని దేశాలతో ఏర్పాటు చేసిందే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం.దీనిని భారత్ ఆమోదించలేదు.భారత అణుశక్తి విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు అగ్ర రాజ్యాల బెదిరింపును ధిక్కరిస్తూ నెహ్రూ వ్యాఖ్య “మాకు అణు బాంబు తయారు చేయాలన్న కోరిక లేదు,అయితే మాతో శత్రుత్వం ఉన్న వారు తయారు చేసుకుంటే చేతులు ముడుచుకుని కూర్చోము.అంతే కాక శాంతియుత అవసరాల కోసం అణు శక్తిని వాడుతున్నప్పుడు ,అదే క్రమంలో బాంబులు తయారు చేస్తామేమోనని అమెరికాకు అనుమానం వచ్చినంత మాత్రాన మా సాంకేతిక అవసరాలను మేము వదులుకోము”ఈ వైఖిరితో ఇరాన్ దేశానికి భారత్ అండగా ఉండాలి.తటస్థ వైఖిరిని కలిగి ఉండడం,కనీసం ఖండన లేక పోవడం భారత్ కు చారిత్రక అపరాధిగా మిగులుస్తుంది.ఇరాన్ తో భారత్ కు శతాబ్దాల పాటు సాంస్కృతిక వ్యాపార సంబంధాలు ఉన్నాయి.అమెరికాను నమ్ముకునే బదులు దక్షిణార్ధ గోళ దేశాలతో కలిసి అలీన దేశంగా ప్రభావంతమైన శక్తిగా భారత్ ముందున్న కర్తవ్యం.





