ప్రొఫెసర్ వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారానికి సాహితి విమర్శ గ్రంధాలను ఆహ్వానిస్తున్నాం అరసం వరంగల్ కమిటీ ప్రతియేటా ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తుంది. 2025 సంవత్సరానికి సాహిత్య విమర్శకు ప్రదానం చేయడానికి నిర్ణయించారు. 2021 జూలై నుండి 2025 జూన్ మధ్య ప్రచురించిన మెుదటి ముద్రణలు మాత్రమే పోటీకి పంపాలి.
పరిశీలనకు నాలుగు ప్రతులు అన్నిప్రాంతాల వారు పంపవచ్చు. వివిధ రచయితల కూర్పు సంకలనాలు పంపరాదు. ప్రతులు 31 ఆగస్టు 2025 లోపు పంపాలి. ఎంపికైన గ్రంథకర్తకు అక్టోబర్ 2025న హనుమకొండలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.5 వేల నగదు, శాలువ, జ్ఞాపికతో పురస్కారం ప్రదానం ఉంటుంది. పుస్తకాలను బూర భిక్షపతి, ఇంటి నెంబర్, 2 – 12 – 293/20, రోడ్ నెంబర్ 2బి, విజయనగర్ కాలని, గోపాలపురం రోడ్, హనమకొండ-506009 (తెలంగాణ) ఫోన్ : 9866612712





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల