19. జనధర్మో విజయతే
వరంగల్లు మరిచిపోలేని వ్యక్తి కీర్తిశేషుడు
పేర్వారం జగన్నాధం గారు. (ఆగష్ట్23, 1934 –
సెప్టెంబర్ 29, 2008) ప్రముఖ తెలుగు కవి,
విమర్శకుడు, విద్యావేత్త. వరంగల్లు జిల్లా
రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో
సెప్టెంబర్ 23, 1934 న జన్మించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ
విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో
ఆచార్యుడుగా పనిచేసారు. అంతకుముందు
వరంగల్లోని సికెఎం కళాశాలలో
ప్రధానాచార్యుడి, 1992-95 లలో తెలుగు
విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నిర్వహించారు.
యం యస్ ఆచార్యతో కలిసి చదువుకున్నవారు. మంచి మిత్రులు. సికె ఎం
ప్రిన్సిపల్ గా ఉన్నపుడు ఈ రచయిత చదువునేర్చుకున్నాను. కొన్ని
కవిసమ్మేళనలలో పాల్గొనే అవకాశం వచ్చింది. అనేకానేక శిష్యులు
జగన్నాథం గారిని గుర్తించుకుంటారు. పేర్వారం గారు హైదరాబాద్
రాష్ట్రానికి స్వతంత్రం గురించి యం యస్ ఆచార్య తహతహ పడిన వారు.
సెప్టెంబర్ 17న వీర తెలంగాణ విముక్తి సాధించిన రోజు. జగన్నాథం ఆ వీర
కిశోరుడు రావి నారాయణ రెడ్డిగారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ
ద్వారా, తెలంగాణ విముక్తి గురించి ఆసక్తికరమైన అంశాలెన్నో జగన్నాథం
గారు వివరించారు.
యం యస్ ఆచార్య గారితో గాఢమైన స్నేహం కలిగిన వారు ప్రొఫెసర్
పేర్వారం జగన్నాథం. ఆచార్యగారి, జగన్నాథం గారికి నేను (మాడభూషి శ్రీధర్) శిష్యుడిని.
ప్రముఖ రచయిత డా. జి. వెంకటరత్నం (వరంగల్లు సి కె ఎం కాలేజి తెలుగు ప్రొఫెసర్) అనేకానేక
పుస్తకాలు రచించారు. పేర్వారం జగన్నాథం గారితో ఇంటర్వ్యూ చేసారు, అదే విధంగా జగన్నాథం గారిని
ఇతరులను చేసిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఇదొక కొత్త ప్రయోగం.
అంతేకాక నన్ను ఆయా సందర్భాల్లో కొందరు మిత్రులు ఇంటర్వ్యూలు చేసి
ఆయా పత్రికల్లో ప్రచురించినారు. వాటిని కూడ ఇందులో చేర్చినాము. అందులో ఒకటి
నేను కూడ డా. జి. వెంకటరత్నం గారికి పూర్వ విద్యార్థిని. ఉత్తమ జర్నలిస్టుగా పేరు
ప్రఖ్యాతులున్నవాడు. ఈతని తండ్రి స్వర్గీయ ఎం. ఎస్. ఆచార్య గారితో జగన్నాథం గారు
చిరకాల మిత్రుడు. సహాధ్యాయి కూడ. వరంగల్లు నుండి 'వరంగల్ వాణి' అనే ఏకైక
దినపత్రికనూ, 'జనధర్మ&39; వారపత్రికనూ అవిచ్ఛిన్నంగా నడిపిన కార్యదక్షుడు ఆచార్య అని
జగన్నాథం గారు వివరించారు. డా. జి. వెంకటరత్నం గారి సంపాదకత్వంలో 15.8.1997 లో ఈ
రచన గురించి ప్రస్తావన ఉంది.
దీనికి ప్రముఖ సంపాదకుడు, పొత్తూరి వేంకటేశ్వరరావు ముందుమాట లో
వ్యాఖ్యానం చేసారు. అందులో జగన్నాథం గారు రావినారాయణ రెడ్డిగారిని, కాళోజీ
నారాయణరావు గారిని, రామేశ్వరరావు గారిని, నల్ల నర్సింహులు గారిని బిరుదురాజు రామరాజు గారిని
ఇంటర్వ్యూ చేశారు. జగన్నాథంగారిని ఇద్దరు ముగ్గురు ప్రసిద్ధ పాత్రికేయులూ, విఖ్యాత రచయిత్రులూ,
రచయితలూ ఇంటర్వ్యూ చేశారు.
వరంగల్లు ప్రముఖ సాహీతీవేత్తలతో కాళోజీ దంపతులు, బి రామరాజు, యం.యస్ ఆచార్య, ఆ సభలో ప్రసంగిస్తున్న ప్రముఖ
కవి పేర్వారం జగన్నాథం 'పేర్వారం ఇంటర్వ్యూలు' పుస్తకంలో ఒక భాగంగా 'కొత్త కవిత్వంలో అనర్థం' అనే వ్యాస
సంకలనాన్ని ప్రచురించారు. కొత్త కవిత్వం అంటే ఇరవయ్యో శతాబ్ది కవిత్వం. అనర్థం అంటే అర్థం
లేకపోవడమో అర్థం కాకపోవడమో, లేక రెండూనో …. ఏదైనా కావచ్చును. కవిత్వంలో అర్థం
లేకపోవడమనే లక్షణాన్ని గురించి జగన్నాథంగారు 1969 సంవత్సరాంతాన 'జనధర్మ' పత్రిక ప్రత్యేక
సంచికలో చేసిన విమర్శ, దానిపై కొందరు ప్రసిద్ధ కవుల స్పందనల కూర్పు. ఇది సాహిత్య చర్చ
మరో విశేషం అని పొత్తూరి అన్నారు.
39జనధర్మ39;లో చర్చను జగన్నాథంగారు అప్పటికి ముగించినప్పటికీ 1983లో
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసంగిస్తూ … కవి ఎన్నుకుంటున్న ప్రతీకలు పాఠకుల అనుభూతికి చిక్కడం లేదు. కవి స్వయంగా
తన కవితకు తానే వ్యాఖ్యాతగా మారితే తప్ప కవి లక్షించిన భావస్ఫూర్తి కలగడం
లేదు…. అని మరొకసారి విమర్శించారు. కొత్త కవిత్వంలో అర్థం కాని, అర్థం లేని భాగం కొంతైనా ఉన్నమాట యదార్థం. ఈ
'అనర్థాన్ని' వేలెత్తి చూపిస్తున్న విమర్శకులు బహుశ జగన్నాథం గారు ఒక్కరేనేమో. దేవతా
వస్త్రాల కథలవలె ఎవరికి మట్టుకు వారు కాపట్యం పాటిస్తే సాహిత్యం ఎలా
మెరుగుపడుతుంది? మొగమాటం గాని, కపటం గాని లేకుండా 'కొత్త కవిత్వంలో అనర్థం' అంటూ
చర్చ లేవదీసిన జగన్నాథంగారి కృషి ప్రశంసార్హం, అనీ పఠితవ్య గ్రంథంగా 'పేర్వారం ఇంటర్వ్యూలు'
పదికాలాలపాటు నిలవాలని నా ఆకాంక్ష’ అని పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు.
రావి నారాయణ రెడ్డి వంటి త్యాగశీలి తో మన హైదరాబాద్
రాష్ట్రం స్వతంత్రం తెచ్చింది. ఆయన కర్మవీరుడు. అదనంగా పద్మ
విభూషణ్ కళాప్రపూర్ణ, కామ్రేడ్ మంచి మనిషి. అప్పట్లో ఆంధ్రజన
సంఘం అనేపేరుతో మాడపాటి హనుమంతరావు భాషా సంస్కృతుల సముద్ధరనకోసం
పెట్టారని ప్రముఖ కవి మాజీ తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్
పేర్వారం జగన్నాథం ఒక ఇంటర్వ్యూలో వివరించారు. కేవలం మరాఠీవారే
మాట్లాడాలని, తెలుగు మాట్లాడరాదనే పరిస్థితులు ఉంటే ఆంధ్రజన సంఘం
ఏర్పాటు చేయవలసి వచ్చింది. అదే కొన్నాళ్ల తరువాత ఆంధ్రజన కేంద్ర
సంఘం గా మారింది. తెలంగాణా ప్రజలకి ఆంధ్రప్రాంతంలో ఆయుధశిక్షణ
ఇచ్చిన సోదరులకు సహాయం చేశారు.
రెండు స్వీయ చరిత్రలు
రావి నారాయణరెడ్డి గారితో ఇంటర్వ్యూలో ఆయన ఆత్మకథ 'నాజీవిత పథంలో .. స్పృశించని
అంశాలు కొన్ని ఉన్నాయి. విశాలాంధ్ర అవతరణ సమయంలో ఆంధ్ర తెలంగాణా నాయకుల మధ్య
జరిగిన ఒప్పందంపై సంతకం చేసిన పెద్ద మనుషులలో ఒకరు కొండా వెంకటరంగారెడ్డి గారు.
ఆయన కూడా స్వీయ చరిత్ర రాసుకొన్నారు. ఈ రెండు స్వీయచరిత్రలలోనూ లేని ఒక విషయం రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డిగారు
కొండా వెంకట రంగారెడ్డి గారికి చేసిన హితబోధ. నిజాం నవాబు గారి కొలువులో పెద్ద పదవిని
నిర్వహిస్తున్నప్పటికీ వెంకటరామారెడ్డిగారు ఆంధ్రోద్యమాన్ని అభిమానిస్తుండే వారు. ఆయన ఒకరోజు
రంగారెడ్డి గారిని పిలిపించుకొని "ఫ్యూడల్స్ను బలపరచవద్దు" అని చెప్పారట ! తెలంగాణా
సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ సైద్ధాంతిక కారణాలవల్ల ప్రారంభించలేదని
నారాయణరెడ్డిగారు వెల్లడించారు. రజాకార్ల నుంచీ నైజాం -పోలీసుల నుంచి తమను తాము
రక్షించుకొనడానికి ప్రజలు ఆయుధాలు చేపడితే కమ్యూనిష్టు పార్టీ అప్పుడు పోరాటానికి
నాయకత్వాన్ని చేపట్టినదట. అప్పట్లో ప్రజలే పార్టీని నడిపించారు గాని, పార్టీ ప్రజలను
నడిపించలేదని ఆయన భావం. సంస్థాన విలీనానంతరం జరిగిన లోకసభ ఎన్నికలలో దేశం మొత్తంలోకి
అత్యధికంగా వోట్లు తెచ్చుకొని గెలిచిన నెహ్రూ కంటే కూడా ఎక్కువగా కమ్యూనిస్టు నాయకుడు
రావి నారాయణ రెడ్డి. ఆయనకు ఎందుకు అన్ని వోట్లు వచ్చాయో ఆయన విశ్లేషణే
తెలియజేస్తున్నది అని పొత్తూరి అన్నారు.





