ఇన్ స్టెంట్ జస్టిస్‌ ..!

“సమస్య మూలాలను నిర్మిలించకుండా, నేరం చేయాలన్న ఆలోచనలు మార్చకుండా తక్షణ న్యాయంతో సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు..నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు వంటి సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకుండా..యువత శక్తిని దేశాభివృద్ధి కోసం ఉపయోగించే పాలన అందించకుండా కేవలం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ తో న్యాయం చేస్తామని చెప్పడం సర్కార్‌ నిర్లక్ష్యానికి నిదర్శనం.”

గత రెండు దశాబ్దాలుగా  దేశంలో ఇన్ స్టెంట్ జస్టిస్‌ అనే చర్చ పెరుగుతుంది. యువతరం ఇన్ స్టెంట్ న్యాయాన్ని కోరుకుంటోంది. మరీ ముఖ్యంగా జెన్‌ జీల్లో ఈ ఆలోచనలు ఎక్కువ కనిస్తుంది. భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌ స్టెంట్‌ జస్టిస్ ఉద్యమాలు వచ్చాయి. వీటికి లెఫ్ట్ సంఘాలు, లైట్‌ వింగ్ సంస్థలు ప్రభుత్వాలను పడగోట్టిన అవన్నీ వరిగడ్డ మంటలా ఆరిపోయాయి.
మన దేశంలో ఇన్‌ స్టెంట్‌ ఉద్యమాలు పెద్దగా రాలేదు, వచ్చిన వాటిని మొగ్గలోనే పాలకులు తుంచేస్తున్నారు..అయితే ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ అనే అంశం ఇటీవలే జెన్‌ జీల్లో బాగా వినిస్తుంది. ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చకునేందుకు..సర్కార్‌ పై ప్రజా వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు పాలకులు ఇటీవలే కాలంలో ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ను ఆయుధంగా మార్చుకుంటుంది.
ఇన్ స్టెంట్‌ జస్టిస్‌ అంటే తక్షణ న్యాయం..నేరం జరిగినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే నేరారోణ ఎదుర్కొంటున్న వారిని భౌతికంగా దూరం చేయడం. రాజ్యాంగ పరిధిని దాటి. చట్టాలను అధికమించి ఎక్స్‌ ట్రా జుడిషియరీ కిల్లింగ్ చేయడం.సమాజంలో నేరాలు జరుగుతాయి..నేరాస్తులకు శిక్షపడాలి..కానీ ఆ శిక్ష న్యాయబద్దంగా ఉండాలి. ఇలా అంటే కొంత మందికి నచ్చకపోవచ్చు గానీ, చట్టాన్ని, న్యాయ వ్యవస్థను గౌరవించాలి కదా.
అయితే ప్రస్తుతం నేరం జరిగినప్పుడు తక్షణ న్యాయం జరగాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఉడుకు రక్తం యువతలో అది కాస్తా ఎక్కువుంది. తప్పులేదు..యువత సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, అచారకాల్ని ఎదిరించాలి. ప్రభుత్వాలను ప్రశ్నించాలి. అది యువతరం హక్కు కూడా.కానీ అదే సమయంలో చట్టాలను న్యాయవ్యవస్థను కూడా గౌరవించాలి.
న్యాయం జరిగినట్లు కాదు..కనిపించాలని సుప్రీం కోర్ట్‌ అనేక సందర్భాల్లో వ్యక్తం చేసింది..న్యాయం లేటైతే ఎంత బాధితులకు ఎంత నష్టం జరుగుతుందో..ఇన్‌ స్టెంట్‌ న్యాయం కూడా అంతకంటే ఎక్కువ నష్టం బాధితులకు నష్టం చేస్తుంది. నేరం రుజువు కాకుండానే నిందితున్ని ఇన్‌ స్టేంట్ జస్టిస్‌తో హత్యలు చేస్తే తర్వాత నేరారోపణ నిరూపించకపోతే నిందితులు అప్పుడు బాధితులు అవుతారు..వంద మంది నేరస్థులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక్క నిర్థోషికి అన్యాయం జరగకూడదన్న సహజ న్యాయ సూత్రాలకు ఇది పూర్తి విరుద్దం.
2012లో దిల్లీలో  దిశా అత్యాచారంతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది..దీనికి రాజకీయ కారణాలు తెరవెనుక ఉన్న బాధితురాలికి న్యాయం చేయాలన్న ప్రజలు ముఖ్యంగా యువత భాగోద్వేవంతో ముడిపడి ఉండటంతో ప్రభుత్వాలు తక్షణ న్యాయాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఇన్‌ స్టెంట జస్టిస్‌తో తక్షణం బాధితులు ఉపశమనం కల్పించిన దాని భవిష్యత్‌ పర్యవశాలు దారుణంగా ఉంటున్నాయి.
దిల్లీ దిశా ఉదాంతం తర్వాత దేశంలో మహిళలపై అత్యాచారాలు తగ్గలేదు..వెరసి ఇంకా పెరిగాయి..ఒక రకంగా ఇలాంటి నేరాలు వ్యవస్థకృతం అయ్యాయి..2019లో హైదరాబాద్ లో డాక్టర్‌పై గ్యాప్‌ జరిగింది..బాధితులరాలిని దారుణంగా దుర్మర్గులు హత్య చేశారు..ఇలాంటి ఘటనలు చూస్తే ఎవ్వరికైనా నేరాస్తులను చంపేయాలన్న కోసం సహజంగా వస్తుంది. అందులో జెన్‌ జీ తరంలో రక్తం ఇంకా ఎక్కువే ఉంటుంది.తక్షణ న్యాయంం చేయాలన్న డిమాండ్ తో నిందితులను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేశారు.
అయితే మహిలపై నేరాలు,వేధింపులు అక్కడి ఆగిపోలేదు. కానీ ఇన్‌స్టెంట్‌ జస్టిస్ డిమాండ్ వల్ల ఆ ఘటన అక్కడితో ఆగిపోయింది. ప్రజలు మరిచిపోయారు. పోలీసులకు పూలాభిషేకాలు పాలాభీషేకాలు చేశారు. కానీ తక్షణ న్యాయం పేరుతో ఎలాంటి విచారణ లేకుండానే, నేరారోపణ నిరూపితం కాకుండానే నిందితులను చంపే అధికారం పరోక్షంగా పోలీసుకు ఇచ్చినట్లు అవుతుంది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదం..రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకు అవమానకరం.
ఇన్‌ స్టెంట్ జస్టిస్ వల్ల నేరాలు తగ్గినాయా అంటే తగ్గలేదని చెప్పాలి..ఇంకా పెరిగాయని రికార్డ్‌లు చెపుతున్నాయి. దిల్లీ దిశ అయిన..హైదరాబాద్‌ డాక్టర్‌ అయిన..మొన్న నిజామాబాద్‌ లో రియాజ్‌ అయిన నిన్న ఏపీలో నారాయణ అయిన అంతకు ముందు వరంగల్‌లో ఎన్‌కౌంటర్లు అయిన ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ సాధించింది ఏమీ లేదు. వెరసి న్యాయ వ్యవస్థను చట్టాలను ఇలాంటి ఘటనలు అపహస్యం చేస్తున్నాయి. కోర్టులు చేయాల్సిన పనులు పోలీసులే చేయడం వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ పేరుతో రాజకీయ పార్టీలు యువత భావోద్వేగాలను రెచ్చగోట్టుతూ తమ కళ్లను మన వేళ్లతోనే పొడిపించే ప్రయత్నం చేస్తున్నాయి.ఇది యువత గ్రహించాలి.
ఇన్‌ స్టేంట్‌ జస్టిస్‌ అనేది పాలపొంగులాంటిది..దీని వల్ల నేరాలు తగ్గిపోవు. వెరసి నేరాలకు గల కారణాలపై చర్చించకుండా చేస్తాయి..అఘాయిత్యాలకు గల మూలాలు అన్వేషించకుండా తక్షణ న్యాయం అనే డిమాండ్ యువతను, ప్రజలను, చివరికి కోర్ట్‌లను కూడా తప్పు దోవపట్టిస్తు డైవర్ట్‌ చేస్తాయి. మహిళలపై నేరాలు రోజు రోజుకు పెరగడానికి ఇన్ స్టేంట్‌ జస్టిస్‌ డిమాండ్ కూడా కారణం.

దిశ చట్టం ఉన్న దేశంలో మహిళపై నేరాలు, అఘాయిత్యాలు ఆగడం లేదు..వేధింపులు తగ్గలేదు.దీని వెనుక పురాషాధిపత్య భావజాలం..స్త్రీని సెక్స్‌ బొమ్మగా చూడటం, మహిళలు బయటకు వచ్చి పురుషులతో సమాన హక్కులు కోరుకోవడం కూడా గిట్టని ఆలోచన ఉండవచ్చు.

దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా..పార్టీలు తాము మహిళ పక్షపాతం అంటూ గొప్ప ప్రకటనలు చేసిన స్త్రీలపై దారుణాలు ఆగడం లేదు..ఎన్ని చట్టాలు వచ్చిన..ఎన్ని ప్రభుత్వాలు మారిన దిశాలాంటి రేప్ అండ్ మర్డర్ ఘటనలు తగ్గడం లేదు. ఇన్‌స్టేంట్‌ జస్టిస్ డిమాండ్ న్యాయవ్యవస్థను అవమానిస్తుంది, చట్టాలను వెక్కిరిస్తుంది.

సమస్య మూలాలను నిర్మిలించకుండా, నేరం చేయాలన్న ఆలోచనలు మార్చకుండా తక్షణ న్యాయంతో సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు..నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు వంటి సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకుండా..యువత శక్తిని దేశాభివృద్ధి కోసం ఉపయోగించే పాలన అందించకుండా కేవలం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ తో న్యాయం చేస్తామని చెప్పడం సర్కార్‌ నిర్లక్ష్యానికి నిదర్శనం.

మరీ ముఖ్యంగా దేశంలో యువతకు సరైనా ఉపాధి లేక..వారు శ్రమ శక్తిలోకి రాకుండా..స్మార్ట్‌ ఫోన్లకు, ఫోర్ట్‌ సైట్స్‌కు యువతను బానిలుగా మార్చే ప్రయత్నాలు ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు చేస్తున్న విధానాలను చెక్‌ పెట్టకుండా ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ తో ఎన్ని హత్యలు చేసిన నేరం మూలాలు చనిపోవు..నేరం చేయాలన్న ఆలోచనలు చంపే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయకుండా ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌తో బాధితులకు న్యాయం చేస్తామంటే ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు.

ప్రపంచాన్ని మార్చే జెన్‌ జీలు కూడా పార్టీ ప్రభావంలో పడి..ప్రభుత్వాలు చేసే తప్పులును కప్పిపుచ్చుకునేందుకు ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ వంటి డిమాండ్‌తో బంధికావోద్దు..సమాజంలో ఉన్న కుల మత పురుషాధిపత్య జాడ్యాలు తొలగించేందుకు ప్రయత్నం చేయాలి. మహిళలపై జరుగుతున్న దారుణాలకు మూలాలు వెతికి వాటిని నిర్మూలించే విధంగా జెన్‌ జీల పోరాటం కార్యక్రమాలు ఉండాలి..అదే విధంగా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావడమే కాదు వాటిని అమలు చేసే విధంగా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి.

తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *