ఈడబ్లూ ్యఎస్ రిజర్వేషన్‌లపై ఎన్నో అనుమానాలు..సందేహాలు
ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. ఇది వినడానికి బాగానే ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడిరది. దానికి గల కారణం ఈ డబ్ల్యూ ఎస్. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ (ఆర్థికంగా వెనుకబడిన వారికి) రిజర్వేషన్లు కల్పించింది. మొత్తం కోటాలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది.అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లపై ఎన్నో అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. దీనివల్ల బీసీలు చాలా నష్టపోతున్నారు. మొట్టమొదట 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అగ్రవర్ణాలకు 1990 లో పీవీ నరసింహారావు కేటాయిస్తూ ఒక మెమోను ఇవ్వడం జరిగింది.ఆర్థిక పరమైన టువంటి రిజర్వేషన్లను రాజ్యాంగపరంగా ఇవ్వడానికి కుదరదని ఆ రోజే సుప్రీంకోర్టు తెలియజేసింది. 2005 లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మేజర్ జనరల్ సింహా కమిటీని వేశారు.
ఆ కమిటీ 2011లో 10% అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలని రిపోర్ట్ ఇచ్చింది. 2019 లో 103 వ రాజ్యాంగ సవరణ చేసి ఈ డబ్ల్యూ ఎస్ ను కేంద్ర ప్రభుత్వం అప్పటినుండి అమలు చేస్తుంది. దీని ద్వారా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు రిజర్వేషన్ రావడం సులభమైంది. ఈడబ్ల్యూఎస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా 2021 నుండి అమలు అమలవుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ డబ్ల్యూ ఎస్ అమలవుతుంది. ఏదైనా ప్రభుత్వ రాత పరీక్ష రాసి మంచి మార్కులు పొందినటువంటి విద్యార్థుల యొక్క నోటి దగ్గర కూడును ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ పేర అగ్రకులాలకు చెందినటువంటి విద్యార్థులు తీసుకెళ్తున్నారు. దేశంలోనే 50 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతుంది. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీలు కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. తరతరాలుగా సామాజికంగా దోపిడికి గురైనటువంటి కులాలు గ్రామాల్లో వివక్షతకు గురి అయి అగ్రకులాల ఆధిపత్య పోరు సాగుతుంది.
అందుకే గతంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉండే అధికారులు అగ్రకులాల వారే ఉండేది. 1950 నుంచి బీసీల పోరాటం జరిగితే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. రాజ్యాంగాన్ని కూడా సవరించె వీలున్నప్పటికీ, ఆ పని చేయలేదు. గతంలో కేంద్రంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి బిజెపి పార్టీ అగ్రకులాలకు అండగానే నిలబడడం జరిగింది. అధికారమే ధ్యేయంగా, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అగ్రవర్ణాలకి పెద్ద పీఠ వేసేవారు. కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేదు. బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినటువంటి సమయంలోనే కులగణన జరిగింది తప్ప, మళ్లీ ఇంతవరకు జరగలేదు. ఎస్సీ,ఎస్టీలకు వారికి కావలసినంత రిజర్వేషన్లను అమలు చేయడం జరుగుతుంది. జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలకు మాత్రం జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించడం లేదు. ఓసీలు చాలా తక్కువ శాతం లో ఉన్నప్పటికీ,వారికి 10% ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. మొన్న టీచర్ల నియామకాల్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది. ఆరవ ర్యాంకు వచ్చినటువంటి బీసీ విద్యార్థికి స్కూల్ అసిస్టెంట్ రాలేదు కానీ ఈడబ్ల్యూఎస్ లో 42వ ర్యాంకు వచ్చినటువంటి వారికి ఉద్యోగం వచ్చింది.61వ ర్యాంకు వచ్చినటువంటి అమ్మాయికి ఉద్యోగం రాలేదు కానీ ఈ డబ్ల్యు ఎస్ ఉన్నటువంటి 452 ర్యాంకు వారికీ ఉద్యోగం వచ్చింది.ఈ విధంగా అడుగడుగునా ఎక్కువగా అన్యాయం జరుగుతూ ఉంది.దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి కాంపిటేటివ్ పరీక్షలలో ఈ ఈ డబ్ల్యూ ఎస్ ద్వారా అన్ని రాష్ట్రాలలోని యువతి, యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఉదాహరణకి నెట్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్,స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ ఆర్ బి వంటివే కాక ఇతర అనేక పరీక్షల్లో కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్న వారు మొదటగా బీసీలు, ఆ తరువాతే ఎస్సీ,ఎస్టీ లు. ఓపెన్ కేటగిరి లో 50% నుంచి 10 శాతాన్ని ఓసీలకు అనగా ఈడబ్ల్యూఎస్ ఉన్నవారికి ఇవ్వాలి. ఈ విధానం బాగుంటుంది. కానీ 100% లో 10 శాతాన్ని ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి ఇవ్వడం వల్ల అన్యాయం జరుగుతుంది. సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించి , అర్హులైనటువంటి వారికి మాత్రమే ఇవ్వాలి. ఓసి అయినంత మాత్రాన ధనవంతుడైన కూడా ఇస్తే అలాంటి వాటిని గమనించి సర్టిఫికేట్ రాకుండా చర్యలు తీసుకోవాలి.ఇలా చేసినప్పుడు మాత్రమే ఈ డబ్ల్యూ ఎస్ ను కొంతలో కొంతమేర నివారించవచ్చు.విద్య,ఉద్యోగ రంగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకురావడం ద్వారా ఓబీసీ అభ్యర్థుల అవకాశాలకు అడ్డుకట్ట పడిరది. ఏ రిక్రూట్మెంట్ చూసినప్పటికీ ఈ డబ్ల్యూ ఎస్ వారి మెరిట్ కంటే కూడా ఓబీసీల యొక్క మెరిట్ చాలా ఎక్కువ. కానీ ఓబీసీలకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు.
అందుకే కులగణన ను చేయమని సుప్రీంకోర్టులో కేసు నంబర్ డబ్ల్యూపి 841/2021లో అఫిడవిట్ వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా, ప్రైవేటీకరణ చేసినటువంటి సంస్థల్లో కూడా ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ఓబీసీలకు వ్యతిరేక చట్టాలు, నిర్ణయాలు వచ్చినా రావచ్చు. బీసీలంతా కూడా రాజకీయాలను పక్కన పెట్టి , ఒక్కటై , బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. ఒక కులం,మరొక కులం పై ఆదిపత్య భావనతో ఉండకూడదు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా వంటి అన్ని రంగాల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలు వివక్షకు గురవుతున్నారు. వీరికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే వారి అభివృద్ధి జరగదు.సామాజికంగా, ఆర్థికంగా పురోగమించలేరు. రాష్ట్ర ప్రభుత్వము కులగణన ను చేపట్టి దేశంలో 56% ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేసే దిశగా పనిచేయాలి.జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లను అమలు చేయాలి. ఈ విధంగా తగిన నియమ, నిబంధాలను పాటిస్తేనే అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది.
-డా.మోటె చిరంజీవి
సామాజిక వేత్త, విశ్లేషకులు
సెల్ : 9949194327.





