జలాంతర్గాముల నిర్మాణంలో భారత్‌ ‌ప్రగతి

జలాంతర్గామి నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. ప్రత్యర్ధులు జలగర్భ మార్గాల ద్వారా దొంగదెబ్బ తీసే అవకాశం ఉందని క్రీ.పూ. 332లోనే గుర్తించాడు అలెగ్జాండర్‌. అం‌దుకే జలాల కింద కూడా పహారా కాయాలని అనుచరులను ఆదేశించాడు. ఓ అమోఘమైన ఘంటజాడీ (డైవింగ్‌ ‌బెల్‌) ‌ని రూపొందించి దాన్లో ఆయనే స్వయంగా జలాల్లోకి దిగినట్టు ప్రచారంలో ఉంది. పదిహేనో శతాబ్దం చివర్లో.. విఖ్యాత దార్శనికుడైన లియోనార్డో డావిన్చీ.. జల మధ్యంలోకి దూసుకుపోయే సైనిక పాటవం గురించి ప్రస్తావించాడు.  ఇంగ్లండ్‌లో ఉంటున్న డచ్‌ ‌వైద్యుడు కొర్నీలియస్‌ ‌డ్రబ్బెల్‌ 1620‌లో  ఎక్కువ సమయం నీటిలోపల ఉండి  గొర్రె తోలుతో కప్పిన చెక్క పెట్టెలాంటి దీనిలో- తెడ్డువేసే వారితో సహా మొత్తం 20 మంది ప్రయాణించేందుకు వీలైన  తొలి జలాంతర గమన వాహనం సిద్ధం చేశాడు.

1776 సెప్టెంబరులో న్యూయార్క్ ఓడరేవులో మోహరించిన బ్రిటన్‌ ‌యుద్ధనౌకలపై ‘దొంగదాడి’కి అమెరికా సిద్దం కాగా, ప్రత్యర్ధుల కళ్లు గప్పి,  వాళ్ల ఓడలకు రంధ్రాలు చేసి, వాటిని ముంచె య్యటం లక్ష్యంగా,  యేల్‌ ‌విశ్వవిద్యాలయం విద్యార్థి డేవిడ్‌ ‌బుష్‌నెల్‌ ‌పైకి కనబడకుండా తాబేలులా నీటిలోనే ప్రయాణించే ‘టర్టిల్‌’‌ను సిద్ధం చేశాడు.  అమెరికాకు చెందిన రాబర్ట్ ‌ఫల్టన్‌ 1798‌లో జలాంతర్గామి లోపలి గోడ చుట్టూ మరో పై గోడ నిర్మించి.. మధ్య ఖాళీలో నీరు నింపేలా బలాస్ట్ ‌ట్యాంకులు అమర్చాడు. అమెరికా, రష్యాలు జలాంతర్గాములతోనే ప్రచ్ఛన్న యుద్ధం సాగించిన క్రమంలో… జలాంతర్గాములు డీజిల్‌ ‌నింపుకోవటం కోసం పైకి రావడం వల్ల శత్రువుల కంటబడటం జరుగగా, ఆ ఇబ్బందిని అధిగమించ డానికి 1954లో అమెరికా మొట్టమొదటి సారిగా అణుఇంధనంతో నెలల తరబడి నీటిలోనే నడిచే ‘యుఎస్‌ఎస్‌ ‌నాటిలస్‌’‌ను, ఆ తర్వాత బాలిస్టిక్‌ ‌క్షిపణి ప్రయోగ జలాంతర్గాములను రూపొందించింది. భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్ర పరచుటలో, అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగు పరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది. భారత నావికా దళంలో  తూర్పు  కమాండ్‌ – ‌విశాఖపట్నం, పశ్చిమ కమాండ్‌ – ‌ముంబాయి దక్షిణ కమాండ్‌ – ‌కోచి,     అండమాన్‌ ‌నికోబార్‌ ‌నావల్‌ – ‌పోర్ట్ ‌బ్లెయిర్‌ అనే 4 కమాండ్‌ ‌లు ఉన్నాయి. 1985 నుండి అణు జలాంత ర్గాములను నిర్మించడానికి కల్పాక్కం వద్ద ఉన్న అణు కేంద్రంతో కలసి నేవి కృషి చేస్తోంది. 1987లో భారత నౌకా దళంలో జలాంతర్గాముల విభాగాన్ని ఏర్పాటు చేశారు. జలాంతర్గాముల నుండి టార్ఫీడో అను క్షిపణులను ప్రయోగిస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్ట మొదటి సబ్‌ ‌మెరైన్‌ – ఐ ఎన్‌ ఏస్‌ ‌షల్కి. 1967 లో డిసెంబర్‌ 8‌న భారత నౌకాదళంలో తొలి జలాంతర్గామి – ఐ ఎన్‌ ఏస్‌ ‌కల్వరి ప్రవేశ పెట్ట బడింది.  ప్రపంచంలో  అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లాండ్‌, ‌ఫ్రాన్స్, ఆ‌స్ట్రే లియాతో పాటు భారత దేశం ఏడు దేశాలు అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కలిగి ఉన్నాయి.

కల్వరి తరగతి సబ్‌మెరైన్‌ ‌ప్రాజెక్ట్-75‌లో  జలాంతర్గామి తరగతికి చెందిన ఐఎన్‌ఎస్‌ ‌కల్వరి, ఖండేరి, కరంజ్‌ ‌జలాంతర్గాములను మన దేశంలో ఇప్పటికే ప్రారంభించారు. 2023 నవంబర్‌ ‌చివరి వారంలో ఫ్రాన్స్‌కు చెందిన నావల్‌ ‌గ్రూప్‌తో కలిసి ముంబయి లోని మజాగావ్‌ ‌డాక్‌ ‌షిప్‌బిల్డర్స్ ‌లిమిటెడ్‌  ‌నిర్మించిన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జలాంత ర్గామి ఐఎన్‌ఎస్‌ ‌వేలా  నావిక దళంలోకి  ముంబైలోని నావల్‌ ‌డాక్‌యార్డ్‌లో చీఫ్‌ ఆఫ్‌ ‌నేవల్‌ ‌స్టాఫ్‌ అడ్మిరల్‌ ‌కరంబీర్‌ ‌సింగ్‌ ‌సమక్షంలో  జలప్రవేశం చేసింది. భారత రెండో అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ 2024 ఆగస్టు 29న నౌకాదళంలో చేరింది. అలా కల్వరిని భారత నౌకాదళంలో ప్రవేశ పెట్టబడిన డిసెంబర్‌ 8‌న భారత నావికా దళం జలాంతర్గామి దినంగా  జరుపు కుంటుంది. భారతదేశములో జలాంతర్గామి దినోత్సవం  ప్రతి సంవత్సరం డిసెంబరు 8 వ తేదీన జరుపుతారు. డిసెంబర్‌ 1967 ‌లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్ట బడిన తొలి జలాంతర్గామి – ఐ ఎన్‌ ఏస్‌ ‌కల్వరి. కల్వరిని భారత నౌకాదళంలో ప్రవేశ పెట్టబడిన రోజైన డిసెంబర్‌ 8‌న జలాంతర్గామి దినంగా  భారత నావికాదళం జరుపు కుంటుంది.
 – రామకిష్టయ్య సంగన భట్ల
     9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *