అంబేడ్కర్ రాజ్యాంగంతోనే భారతీయ మహిళలు విముక్తులయ్యారు

“నేడు భారతీయ అన్ని కులాల, అన్ని మతాల మహిళలు పురుషులతో పాటు సమానంగా స్వేచ్ఛగా జీవిస్తూ విద్యనభ్యసిస్తూ గొప్పనైన ఉద్యోగాలు చేస్తూ పురుషులతో పాటు ఎంతో కొంత ఆధునిక సామాజిక గౌరవ జీవితం పొందుతున్నారంటే అందుకు ప్రధాన కారణం డా. అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక హక్కుల మూలంగా మాత్రమే నేడు భారతీయ మహిళలు తమ ఇష్టానుసారం జీవించగలుగుతున్నారు. ఉద్యోగం చేసే మహిళలు అయినప్పటికీ వారు ప్రెగ్నెన్సీ సమయంలో దాదాపు 26 వారాల పాటు వేతనాన్ని పొందుతూ మేటర్నటీ సెలవులు తీసుకొని గృహంలో విరామం తీసుకోవచ్చు. అంతేకాకుండా మహిళలు పనిచేసే సంఘటిత ఆసంఘటిత సంస్థల్లో మహిళల కోసం ప్రత్యేక వెసులుబాటు కూడిన హక్కులు ఉండటం గమనార్హం .మహిళల నుండి ఎలాంటి సామాజిక పోరాటలు లేకున్న, అడగకుండానే పురుషులతో పాటు సమానంగా సర్వహక్కులు ఇచ్చి సామాజిక గౌరవం ఇచ్చిన అంబేడ్కర్ కి భారతీయ మహిళ సమాజం రుణపడి ఉండాలి.”

_ పుల్లెంల గణేష్
(సోషల్, పొలిటికల్ ఏనాలిస్ట్)
_ 9553041549

విశ్వ మానవాళి పుట్టుకలో ఆనాటి ప్రాచీన అనాగరిక సమాజం నుండి నేటి నాగరిక ఆధునిక సమాజం వరకు మహిళల పాత్ర చాలా ఉన్నతమైనదని జగమెరిగిన సత్యం. ఎందుకంటే స్త్రీలు లేకుండా పురుష సమాజాన్ని చూడలేము ఒక విధంగా ప్రకృతి సత్యం చెప్పాలంటే స్త్రీలు లేకుండా మానవ సమాజ మనుగడని ఊహించలేము.ఇక నేటి ఆధునిక సమాజంలో మహిళా సాధికారత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక సమాజంలో కూడా లింగ అసమానత్వం అన్ని దేశాల్లో ఉంటున్నట్లుగా క్షుణ్ణంగా పరిశీలిస్తే నిరూపణ కాబడుతుంది. నేటి ఆధునిక సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా స్వాతంత్ర పాలనతో కూడిన దాదాపు 195 దేశాలు ఉండగా అన్ని దేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ ఇలా అనేక రంగాల్లో స్త్రీలకి పురుషులతో పాటు సమాన ప్రాతినిధ్యం లేకపోవడం, నేటి ఆధునిక సమాజంలో కూడా స్త్రీల పట్ల ఉన్న చిన్నచూపుకి నిదర్శనం ఐతే, అసమానతలు రూపాన్ని మార్చుకొని గుణాన్ని కోల్పోకుండా ఉన్నట్లు నిరూపణ కాబడుతుంది.

ఇక భారత దేశ స్త్రీల పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే భారత రాజ్యాంగం ముందు దేశంలో స్త్రీల పరిస్థితి అగౌరవంగా ఉన్నట్లుగా చరిత్రని క్షుణ్ణంగా పరిశీలిస్తే నిరూపితం అవుతుంది. భారత రాజ్యాంగానికి ముందు ఉన్న మనువు రాసిన మనుస్మృతి గ్రంథం ప్రకారమే దేశ పాలన జరిగేది కాబట్టి మనుధర్మ శాస్త్రం స్త్రీలని వంట గదికి, పురుషుల పడక గదికి మాత్రమే పరిమితం చేయడం గమనర్షం. మనుధర్మ శాస్త్రం స్త్రీలకి పురుషులతో పాటు సమానంగా స్వేచ్ఛ సమానత్వ సోదరభావ ప్రజాస్వామ్య గణతంత్ర హక్కులు ఇవ్వలేదు తద్వారా స్త్రీలు అనేక సామాజిక అసమనాతలకి లోను అవుతూ పురుషుల చేతిలో కీలు బొమ్మగా ఉండేవారు. డా. అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 న అమలు తదనంతరమే పురుషులతో పాటు సమానంగా మహిళలకి స్వేచ్ఛ సమానత్వ సోదరభావ ప్రజాస్వామ్య గణతంత్రం హక్కులు రావడం మూలంగా నేడు స్త్రీలు సమాజంలో గౌరవంతో కూడిన జీవితం గడుపుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మనుధర్మ శాస్త్రంతో మహిళలకి మనువు వేసిన సంకెళ్ళని భారత రాజ్యాంగం రూపంలో బద్దలు కొట్టి భారతీయ మహిళా సమాజానికి దేవుడు వలె, మహాపురుషుడిగా, మానవ రూపంలో అంబేడ్కర్ వచ్చాడని భావించక తప్పదు..!

నేడు భారతీయ అన్ని కులాల, అన్ని మతాల మహిళలు పురుషులతో పాటు సమానంగా స్వేచ్ఛగా జీవిస్తూ విద్యనభ్యసిస్తూ గొప్పనైన ఉద్యోగాలు చేస్తూ పురుషులతో పాటు ఎంతో కొంత ఆధునిక సామాజిక గౌరవ జీవితం పొందుతున్నారంటే అందుకు ప్రధాన కారణం డా. అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక హక్కుల మూలంగా మాత్రమే నేడు భారతీయ మహిళలు తమ ఇష్టానుసారం జీవించగలుగుతున్నారు. ఉద్యోగం చేసే మహిళలు అయినప్పటికీ వారు ప్రెగ్నెన్సీ సమయంలో దాదాపు 26 వారాల పాటు వేతనాన్ని పొందుతూ మేటర్నటీ సెలవులు తీసుకొని గృహంలో విరామం తీసుకోవచ్చు. అంతేకాకుండా మహిళలు పనిచేసే సంఘటిత ఆసంఘటిత సంస్థల్లో మహిళల కోసం ప్రత్యేక వెసులుబాటు కూడిన హక్కులు ఉండటం గమనార్హం .

మహిళల నుండి ఎలాంటి సామాజిక పోరాటలు లేకున్న, అడగకుండానే పురుషులతో పాటు సమానంగా సర్వహక్కులు ఇచ్చి సామాజిక గౌరవం ఇచ్చిన అంబేడ్కర్ కి భారతీయ మహిళ సమాజం రుణపడి ఉండాలి.నేడు ఆధునిక సమాజంలో స్త్రీలకి కొన్ని ఉచిత పథకాలు ఇచ్చి స్త్రీలకి ఉచిత పెన్షన్లు ఇచ్చి ఇతరత్రా స్వల్ప కార్యక్రమాలు చేపట్టి అంబేడ్కర్ కంటే ఎక్కువ హక్కులు కల్పించినట్టుగా రాజకీయ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు కానీ నిజంగా స్త్రీల అభివృద్ధిని లింగ సమానత్వాన్ని కోరుకునే విధంగా ప్రభుత్వాలు అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టాల్సిన అత్యవసరత ఉన్నది.నేటి ప్రభుత్వాలు మహిళలని బస్సులలో ఉచిత ప్రయాణం చేయించి మహిళ డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, మిహిళ డ్వాక్రా సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపించడం కాకుండా గౌరవప్రదంగా ఇంటి దగ్గరే కూర్చొని ఉపాధి పొందే విధంగా ఆధునిక పథకాలు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత నేడు ప్రభుత్వాలని నడిపే అన్ని పార్టీలపై ఉన్నదని గుర్తించాలి.

ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా చైనా జపాన్ మొదలగు దేశాల్లో తమ దేశ మహిళలని ఇంటి దగ్గరే కూర్చోబెట్టి వారి చేత ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయిస్తూ రోజుకి దాదాపు 2000 నుండి 3000 రూపాయలు ప్రతి మహిళకి ఆదాయం వచ్చేలా పథకాలు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి వివిధ దేశాలకి వెళ్లి ఆయ దేశాల పథకాలను గమనిస్తున్న భారతీయ రాజకీయ నాయకులు ప్రపంచ దేశాల్లో స్త్రీల అభివృద్ధి కోసం మహిళా సాధికారత కోసం ప్రవేశపెడుతున్న ఆధునిక పథకాలని, ఆధునిక జీవన విధానాన్ని భారతీయ మహిళలకు కూడా నేర్పించి గౌరవ జీవితాన్ని ఇవ్వాలి అంతేకాకుండా మహిళలకి నిజమైన గౌరవం సమానత్వం దక్కలంటే పురుషుల జీవితాల్లో సగ భాగంగా భావించే, భర్తల శరీరాల్లో సగభాగంగా భావించే భారతీయ సంప్రదాయంలో స్త్రీలకు కూడా అంతే సమానంగా అన్ని రంగాల్లో సమాన వాటా ఇవ్వడమే మహిళలకు ఇచ్చే నిజమైన గౌరవమని ప్రభుత్వాలు అందుకు తగువిధంగా చట్టాలు తీసుకురావాల్సిన అత్యవసరత ఉన్నది.

ఒకపక్క స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ తమను తాను నిరూపణ చేసుకోవడం కోసం ఉన్నత విద్యని అభ్యసించి దేశ రక్షణ రంగంలో, పోలీస్ రంగంలో, పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ అంతరిక్షంలోకి కూడా ప్రయాణిస్తున్నరు. నేటి ఆధునిక సమాజంలో కూడా ఉపాధి లభించక రాష్ట్రంలో నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అణగారిన వర్గాల మహిళలు ఇంట్లో కూర్చొని బీడీలు తయారు చేస్తూ రోజుకి 200 రూపాయలు కూడా సంపాదించుకోలేని ఘోరమైన జీవితాన్ని గడుపుతున్నారంటే, 75 సంవత్సరాల స్వాతంత్ర, గణతంత్ర భారతంలో మహిళాల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉన్నది.

కాబట్టి ప్రభుత్వాలకి చిత్తశుద్ధి నిబద్ధత ఉంటే మహిళలని ఇంట్లో కూర్చోబెట్టి అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ మరియు ప్లాస్టిక్ పరికరాలు తయారు చేయిస్తూ లక్షల కుటుంబానికి ఉపాధిని కల్పించవచ్చు, తద్వారా తలసరి ఆదాయాన్ని, రాష్ట్ర మరియు దేశ ఆదాయాన్ని పెంచవచ్చు ఆ దిశగా నేటి ప్రభుత్వలు పని చేయాల్సిన అవసరత ఉన్నది. ఆనాడు డా.అంబేడ్కర్ మహిళలకు హిందూకోడ్ బిల్ ద్వారా సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వ వాటా కోసం పాటుపడితే నాటి కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నాయకులు అంబేడ్కర్ చెప్పిన మహిళా సమానత్వానికి ఒప్పుకోకపోవడం మూలంగా నాడు తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కానీ నేడు కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకి 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చట్టం చేసిన ఆ చట్టాన్ని కూడా 2026 డీలిమిటేషన్ ప్రక్రియ తదనంతరం అమలు చేస్తామన్నారు. కానీ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో వోట్లు కూడా స్త్రీలవే ఎక్కువ ఉండడం గమనర్షం.

_ పుల్లెంల గణేష్
(సోషల్, పొలిటికల్ ఏనాలిస్ట్)
9553041549

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *