ఎయిర్ స్పేస్ మూసివేతతో ఇక్కట్లు
13 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రధానంగా ఈ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి. యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇజ్రాయిల్ విమానాలు రద్దు అయ్యాయి. విమానాల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉన్న ప్రయాణికులకు అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రయాణికులు విమానానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి సంబంధిత ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు. టికెట్ రీ-బుకింగ్ లేదా రీ-రూటింగ్ కోసం ఎయిర్‌లైన్ ప్రతినిధులతో మాట్లాడాలని అన్నారు. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయని… ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ విమాన సమయాలను ఒకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.
షాపింగ్ మాల్స్ మూతతో పర్యాటకం బంద్
దుబయ్,మార్చి14:దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం. అలాంటి మహా నగరాన్ని ఇరాన్ యుద్ధం కళా విహీనంగా మార్చింది. పశ్చిమాసియాలో యుద్ధం దుబాయ్ నగరంపై తీవ్ర ప్రభావం చూపించింది .యుద్ధం నేపథ్యంలో దుబాయ్ నగరం బోసిపోయింది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలను మూసేశారు. రోడ్లపై జనసంచారం లేదు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే బీచ్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురి కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు.విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగమూ కుదేలైంది. డిమాండ్ పెంచడానికి హోటళ్లు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నా స్పందన లేదు. సిటీ, స్టాండర్డ్ చార్టెర్డ్ తదితర అంతర్జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాలను ఖాలీ చేశాయి. వీధుల్లో జనసంచారం కనిపించడం లేదు.





