నా అదృష్టంగా భావిస్తున్నాను

తెలుగు సాహిత్యరంగంలో ‘రైటర్స్ మీట్‘ అగ్రశ్రేణి రచయితల నుండి వర్ధమాన రచయితల వరకు అందరినీ ఏకం చేసే అద్భుతమైన వేదిక. రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో, ఎనిమిదేళ్ళుగా కోర్ టీమ్ సభ్యురాలిగా ఈ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి ఇన్ ఫార్మల్ చర్చలు, సీనియర్ల అనుభవాలు, నవతరం ఆలోచనలు నాలో విస్తృతమైన మార్పును తీసుకొచ్చాయి. ప్రముఖ రచయితలు, పబ్లిషర్లతో ఏర్పడిన పరిచయాలు నాకు చాలా మంచిమిత్రులను సంపాదించి పెట్టడమే కాకుండా, నా రెండు పుస్తకాల ప్రచురణకు అవసరమైన ప్రేరణను, రిసోర్సెస్ ని అందించాయి. నేడు తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న అనేక ఆధునికమార్పులకు ఈ వేదికే ప్రధాన కారణం. వేసిన ముందడుగు. ఈ అక్షర యజ్ఞం మరెందరో రచయితలకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.

-ఝాన్సీ పాపుదేశి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *