తొలిసారిగా ఖాలీ చేతులు
డబ్బుతో మాట్లాడినప్పుడు
రూపాయి బలం తెలిసింది.
పని పరిచమయ్యక
చెమట చుక్కలకు రెట్టింపు లెక్కతో
జేబు నిండినప్పుడు
ఏడిపించిన కోరిక
కాళ్ళ మీద పడి సలాం చేసింది.
ఊరి వీధులన్నీ
గౌరవిస్తూ వెంట నడిచాయి
ఇంటికెళ్లాక మంచం మంచి నిద్రని వడ్డిస్తే
కష్టం ఒడిలో ఆదమరచిన
ఈ మనిషి వెలుతురులో
ఇల్లు కళకళలాడింది.
– చందలూరి నారాయణరావు
9704437247





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల