ఎన్ని వర్షాలకు తడిసినా
బొట్టు చుక్కకు జాగా లేదు
ఆ తోడులో

ఎన్ని ఎండలకు ఆ కప్పు మండినా
ఒక్క పగులుకి ఆస్కారం లేదు
ఆ నీడలో

ఎన్ని కష్టాలకు పుట్టిల్లు మారినా
ఆ ప్రేమకు ఢోకా లేదు
ఆ గూడులో

ఎన్ని బాధల మధ్య
బంధాలు అల్లుకున్నా
అసలు ఇరుకులేదు
ఆ గుండెలో

అమ్మ పునాదిగా
నాన్నే నిర్మాణంగా
శాంతికి ప్రేమకు చిహ్నం
ఆ ఇల్లు
 చందలూరి నారాయణరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *