21 సంఖ్య గణపతికి ఇష్టమైన సంఖ్య.”ఏకవింశతి” పాత్రములతో అనగా 21 పత్రములన్ని ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉండటం విశేషం. ఆ 21 పత్రాలు తులసీ పత్రం,విష్ణుక్రాంత పత్రం,దేవదారు పత్రం,బిల్వ పత్రం,దుర్వారాయుగ్మమ్,శమి పత్రం ,అశ్వత్త పత్రం,అర్జున(మద్ది) పత్రం,అర్నా పత్రం,సింధువార పత్రం,మరువక పత్రం,బృహతి పత్రం,అపామార్గ పత్రం,కర వీర పత్రం,చుర పత్రం,బదరి పత్రం,దాడిమి పత్రం,జాజి పత్రం,గండంకి పత్రం,మాచి పత్రం,దుత్తురా (ఉమ్మెత్త) పత్రం. ఈ విధంగా పృధ్వి నుండి వచ్చిన అనేక ఔషధాలతో ఆరాధించి సకల రోగాలను నయం చేసుకోవడానికి.

Cell 8500175459
శ్రావణ భాద్రపద మాసాలు కురిపించిన వర్షంతో పుడమితల్లి పలకరించి పురుడు పోసుకుంటుంది.అనేక వృక్ష జాతులు ,పచ్చని ఆకులు పచ్చని చీర కట్టి ప్రకృతికి ప్రత్యేక సౌందర్యాన్ని సమకూర్చి అనేక లక్షల జీవరాశులకు ఆహారం చేకూర్చే ఆహ్లాద కాలం భాద్రపధం. ఔషధాలు అందించే చక్కని సమయం. వేదకాలం మొదలుకొని, ఆధునిక సమకాలీన సాహితీవేత్త వరకు భూగోళం మొదలు, ఖగోళం వరకు విస్తరించిన నిత్య స్ఫూర్తి మూర్తి వినాయకుడు.చంద్రమాన భాద్రపధం నిజానికి సృష్టికి భాద్రపధం. వినాయకుని కథ తెలియని వారు చాలా వరకు లేరనే చెప్పవచ్చు. కానీ కావలసింది కథ మాత్రమే కాకుండా అందులోని అంతరార్థం కూడా తెలిసిఉండాలి. బ్రతుకంటే మంచి, చేడు లు,కష్ట సుఖాలు,ఆనంద విచారాలు అన్నింటిని స్థిత ప్రజ్ఞతతో జీర్ణించుకొని ప్రతీకాత్మకంగా జీవించడమే సరైన జీవితం.
వినాయకుని పుట్టుక చాలా చిత్రమైనది అనుకుంటే ఆకృతి అంతకన్నా విచిత్రమైంది. అయితేనేం ఎవరిని పూజించాలన్న , ఈ కార్యం చేయాలన్న అగ్ర పూజా ఆయనదే.తల్లిదండ్రులను మించిన దైవం లేదని నిరూపించి విఙ్నాదిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి గణేశ్వరుడు. గణపతి ఆవిర్భావం, రూపురేఖ విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికి సకల శాస్త్రాలు ఆయనని పరబ్రహ్మ స్వరూపుడిగా భవిష్యత్తు బ్రహ్మగా ను పేర్కొన్నాయి.సామాన్యులకు మాత్రం గణపతి విజ్ఞసంహారకుడు,ఆయనను స్తుతిస్తె సర్వ విజ్ఞాలు ఉపశమిస్తాయి.అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా.బంక మట్టిని తెచ్చి దానికి గణపతి రూపుకల్పించి,ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటి రకరకాల ఆకులతో పూజించి, ఉండ్రాళ్ళను, పండ్లను, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి అపరాధ క్షమాపణ గా ఐదు గుంజిల్లు తీస్తే చాలు,మన కోర్కెలన్నింటిని తీర్చే మహమూర్తి ఆ గణపతి.
ఎవరు ఏ దేవతను ఆరాధించిన ముందుగా కొలిచెది మాత్రం గణపతినే.అందుకే ఆయనను తొలి దైవం అన్నారు.గణపతిని విజ్ఞాలు తొలగి పోయేందుకు ఆరాధించడం వేధకాలం నుండి వస్తున్న సంప్రదాయం. సమస్త కార్యాలకు ప్రారంభంలో వినాయక పూజ చేసినట్లయితే ఫలం చేకూరుతుందని మాన విశ్వాసం. ” విగతోనాయకః వినాయక “, అంటే నాయకుడు లేని సర్వ స్వతంత్రుడు,ప్రథమ ఘనాలకే కాదు మానవ శరీరంలో ములాధార స్థానానికి అధిపతి గణపతే.
శివుని మెడలో పాము, వాహనం నంది,శివాని అనగా పార్వతీ దేవి వాహనం సింహం.వినాయక వాహనం ఎలుక,షణ్ముఖ స్వామి వాహనం నెమలి,ఇలా ఈ జంతుజాలం అంతా పరస్పరం ఒకదానికొకటి ఆహారం. గణపతి ని పత్రితో పూజించడం విశేషం.ఈ కాలంలోవచ్చే వ్యాధుల్ని,వాతావరణ కాలుష్యాన్ని నిరోధించే వివిధ రకాల ఔషధాలు కలవు.ఈ పత్రిని సమర్పిస్తే వినాయకుడు మహాధనంద పడతాడు అంటారు సుందర ,సుగంధ పుష్ప పత్రాలెన్నో ఉండగా వినాయకుడిని “దూర్వాంకురాలు”, అనగా గరికతో పూజిస్తేనే సంతుష్టుడు అవుతాడని అంటారు.అనలాసురుడు అనే రాక్షసున్ని మింగిన గణనాధుని తాపానికి ఈ దూర్వాంకురాలే తాపోపశమనాన్ని కలిగించాయి. అప్పుడు వినాయకుడు నా పూజలో ముఖ్యమైనవి ఈ గడ్డి పోచలే,ఇవిలేని పూజవల్లా ప్రయోజనం ఉండదు.
అందువల్ల 1 లేదా 21 దూర్వాంకురాలతో పూజ చేస్తే నేను సంతుష్టున్ని అవుతాను,దీని ఫలితం నూరు యజ్ఞాలు వల్ల గాని ,దానాధికముల వల్ల గాని,ఉగ్రతపోనిష్ఠ వల్ల గాని సంపాదించే పుణ్యం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పాడు.21 సంఖ్య గణపతికి ఇష్టమైన సంఖ్య.”ఏకవింశతి” పాత్రములతో అనగా 21 పత్రములన్ని ఆయుర్వేద ఔష ద గుణాలు కలిగి ఉండటం విశేషం. ఆ 21 పత్రాలు తులసీ పత్రం,విష్ణుక్రాంత పత్రం,దేవదారు పత్రం,బిల్వ పత్రం,దుర్వారాయుగ్మమ్,శమి పత్రం ,అశ్వత్త పత్రం,అర్జున(మద్ది) పత్రం,అర్నా పత్రం,సింధువార పత్రం,మరువక పత్రం,బృహతి పత్రం,అపామార్గ పత్రం,కర వీర పత్రం,చుర పత్రం,బదరి పత్రం,దాడిమి పత్రం,జాజి పత్రం,గండంకి పత్రం,మాచి పత్రం,దుత్తురా (ఉమ్మెత్త) పత్రం. ఈ విధంగా పృధ్వి నుండి వచ్చిన అనేక ఔషధాలతో ఆరాధించి సకల రోగాలను నయం చేసుకోవడానికి ఈ విధంగా సంపూర్ణమైన జాగ్రతకు సంకేతం ,.మేధాసంపత్తి కి చిహ్నం గజాణనుడు.
నిశిత పరిశీలకుడు గణపతి.ఇలా అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. వినాయక చతుర్ధి రోజున చెరువు నుండి తెచ్చిన మట్టితో వినాయకుని ప్రతిమను చేసి తిరిగి అక్కడే నిమజ్జనం చేయడం విశేషం. ఇక ప్రస్తుత కాలంలో వినాయక విగ్రహాల తయారీ విషయానికొస్తే,విగ్రహాల తయారీ లో వాడే ఇనుప చువ్వలు,వెదురు బొంగులు,గోడలకు వేసే సున్నం ,రంగులు,ప్లాస్టిక్ బాటిల్స్, కొబ్బరి కాయలు, ముఖ్యoగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రకరకాల రంగులు అద్దిన పేపర్లు వాతావరణాన్ని, నిమజ్జనం చేసిన తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాయి. కృత్రిమ రంగులు అద్దిన విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోవు. పైగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో ఉండే హానికరమైన రసాయనాలు నీటిని చాలా కలుషితం చేస్తున్నాయి. ఆ నీరు తాగితే అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
ఇలా కాకుoడా మట్టి విగ్రహాలను వాడి ప్రకృతిని,ప్రకృతిలోని ఎన్నో రకాలైన జీవరాశులను కాపాడుకుందాం.ఇలా చేయడం వలన ముందు తరాలవారికి పచ్చని పర్యావరణాన్ని,కలుషితం లేని పర్యవరణాన్నీ అందించిన వారమవుతాం. ఇలా ప్రకృతిని రక్షించేందుకు కొన్ని సంస్థలతో పాటు నిమజ్జనం కోసం ప్రత్యంన్యాయ పద్దతుల్ని సూచిస్తున్న పర్యావరణ ప్రేమికులందరో ఉన్నారు.
వారిమాటల్లో…..
వీలైనంత వరకు మట్టితో చేసిన చిన్న విగ్రహాన్ని పీజించాలి.దేవుడిని మనసారా కొలవాలి, అంతేగాని ఆడంబరంగా కాదు. మట్టి విగ్రహాన్ని ఇంట్లోనే ఓ బకెట్ నీళ్లలో నిమజ్జనం చేసి కరిగాక చెట్టుకి పోయాలి. కళాహృదయం ఉన్న వాళ్ళైతే చేతులతోనే చేసేస్తుంటారు.మనసంటూ ఉండాలేగాని ,ఇలా ఎన్నో మార్గాలు ఉంటాయి. పద్దతి ఏదైనా పండుగ పర్యవరణానికి హాని లేకుండా జరువుకోవడమే ముఖ్యం.
పూజించిన విగ్రహాలని కాదు,పూలు,పండ్లు,పత్రి ,అలంకారాలన్నింటిని నిమజ్జనం చేస్తుంటారు.ఈ విధంగా చేయడం వలన నదులు,సరస్సులలో చెత్త పేరుకు పోతుంది.అలాకాకుండా పత్రిని చెట్ల పొదల్లో కుండిలో ఉంచాలి.పండ్లు,కొబ్బరికాయలు పేదలకు పంచాలి.ఇలా పచ్చని పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత.ఇలా చెప్పుకుంటే పోతే అనేకం. ఇలా ఎన్నో ఆధునిక సంప్రదాయ విశేషాలు కలిగిన ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆ మహాగణపతిని ప్రతీ వారు తమకు నచ్చిన విధంగా బుద్ధి కుశలతతో,శ్రద్ధ,భక్తుల ను,విద్యా,వివేకాలను ప్రసాదించాల్సిందిగా వినాయకుని వేడుకుంటే అన్ని శుభాలే ప్రసాదిస్తాడు ఆ భక్త సులభుడు. ఈ వినాయక చవితి రోజున ఆ భక్త సులబుని స్మరించుకుంటు…ఆ లంబోధరుని ఆశీస్సులు పొందుదాం.





