తెలంగాణలో జీఎస్టీ వృద్ధిరేటు గుండు సున్నా

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ ‌నిర్వాకమే..

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9: ‌జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ధ్వంసం చేస్తోందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. జీఎస్టీ వృద్ధిరేటు గుండు సున్నాగా నమోదు కావడంతో ఆయన ధ్వజమెత్తారు. సన్నాసి దిల్లీ పార్టీలను నమ్మితే.. తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువుచేసిన సందర్భమిది అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

తెలివి లేని దద్దమ్మను గద్దెనెక్కిస్తారు.. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తారు.. కోట్లాది మంది జీవితాలతో చెలగాటమాడతారు అని కాంగ్రెస్‌ ‌పార్టీపై నిప్పులు చెరిగారు. ఆర్థిక వృద్ధిలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాన్ని పాతాళానికి పడేసిన ఈ పాపం క్షమించరానిది. టూరిస్టు పార్టీలను నమ్మితే జరిగే విధ్వంసమిది.. విజన్‌ ‌లేనోళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే జరిగే వినాశనమిది. నాటి పదేళ్ల దార్శనిక పాలనకు.. నేటి దగుల్బాజీ విధానాలకు మధ్య తేడాను నాలుగు కోట్ల సమాజం నిశితంగా గమనిస్తోంది. ఇక జీవితంలో ఈ దిల్లీ పార్టీలను తెలంగాణ నమ్మదు.. మళ్లీ ఎప్పటికీ మోసపోదు అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *