సాహిత్యం ద్వారా గొంతునివ్వాలి

మోహిత కౌండిన్య

“అవతీర్ణ” (2018) ఇద్దరు మహిళల ప్రేమకథ. వారిలో ఒకామె తల్లి కావాలనుకుంటుంది. నా ఈ కథ కేవలం స్వలింగసంపర్కుల గురించేకాదు, ప్రేమ, ఆత్మగౌరవం, మాతృత్వం, స్వేచ్ఛకోసం పోరాటం, సైన్సువల్ల చిగురించిన ఆశల గురించి కూడా. అవతీర్ణ (పైనుండి దిగివచ్చినది) అనే పేరు దిగజారుతున్న సమాజాన్ని సూచిస్తుంది. ఈ శతాబ్దంలో మనం ఆశించే పురోగతి బదులు, మతమూఢనమ్మకాల, రక్షణవాద సంస్కారాల, ధార్మికనియమాల పేరుతో ప్రేమలపై, స్వేచ్ఛలపై సమాజం ఎలా తెగబడుతుందో చెప్పడానికి ఈ పదం సరిపోతుంది.

చదువరులనుంచి లెక్కలేనన్ని భిన్నాభిప్రాయాలు, ప్రతివాక్యానికి ఆశ్చర్యకరమైనప్రశ్నలు ఎదురయ్యాయి. కథను చెబుతున్న పాత్ర పురుషుడా, స్త్రీయా అనే అయోమయం, ఇద్దరు మహిళలు పిల్లలను ఎలా పొందగలరనే విస్మయం, నువ్విలాంటి కథనెందుకు రాశావనే సంప్రదాయవాద అసహనం వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా కొంతమంది గే/ లెస్బియన్ చదువరులు “ఇందులో మేము కనిపించాము అక్కా” అని చెప్పినప్పుడు చలించిపోయాను. ప్రతినిధిత్వం లేని ఎన్నోవర్గాలకు సాహిత్యంద్వారా ఒక గొంతుకనివ్వాలని బలంగా నిర్ణయించుకున్నాను. మాతృత్వానికి లింగభేదంలేదని, ప్రేమ ఏ రూపంలో వచ్చినా అది పవిత్రమేనని నమ్మే కథ ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *