ఫ్రీట్రేడ్‌ తో భారత్‌కు మరణశాసనమే..!

ఒక్క ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ మాత్రమే కాదు..కూల్ డ్రింక్స్‌, లగ్జరీ లిక్కర్‌ను భారత్‌లో కుమ్మరించేందుకు యూకే ప్లాన్‌ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ డ్రింక్‌ మార్కెట్‌కు భారత్‌ కేంద్రం..చాలా దేశాల్లో సాఫ్ట్ డ్రింక్‌ వల్ల పిల్లల్లో ఉబకాయంతో పాటు క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధులకు కారణం అవుతుందని ఆయా దేశాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పుడు భారత మార్కెట్‌ పై బ్రిటన్‌ కన్నెసింది. కాస్మోటిక్స్, టాయిలేటరీస్ పౌడర్ల, సింథటిక్ రసాయనం నుండి అనేక ఉత్పత్తుల వరకు అనేకం కేన్సర్ కి దోహదం చేస్తాయి.ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. కాస్మోటిక్స్ వ్యాపారానికి పెద్ద మార్కెట్‌గా ఉన్న ఇండియా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన ఉత్పత్తులను ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందంలో చేర్చడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రభావం చూపిస్తుంది.

భారత్‌-బ్రిటన్‌ మధ్య ఏన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ ఎట్టకేలాకు జూలై 24న ప్రధాని మోదీ యూకే పర్యటన సందర్భంగా పూర్తైంది. ప్రధాని మోదీ రెండు రోజుల యూకే టూర్‌లో బ్రిటన్‌లో భారత్‌ ఎఫ్‌టీఏను చేసుకున్నాయి..ఈ అగ్రిమెంట్‌తో రెండు దేశాలు తమ వస్తువులపై ఆయా దేశాల్లో ఫ్రీగా మార్కెట్‌ చేసుకోవచ్చు. ఎలాంటి ఎగుమతి దిగుమతి సుంకాలు లేకుండా ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.ఈ ఒప్పందంతో యూకేకు భారత్‌ ఎగుమతయ్యే వ్యవసాయ, టెక్స్‌ లైట్, లేదర్‌ వంటి ఉత్పత్తులకు సుంకాల మినహాయింపు ఉంటుంది..అదే సమయంలో యూకే నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే లగ్జరీ వస్తువులు,ప్రాసెసింగ్‌ ఫుడ్స్‌, కాస్టీ లిక్కర్‌ సహా దాదాపు 35 కీలక వస్తువులకు జీరో పన్ను ఉంటుంది.

 

వ్యాపారం అంటేనే లాభాలు,దానికే ప్రాధాన్యత ఉంటుంది. బడా కార్పొరేట్‌ శక్తులదే గుత్తాధిపత్యం.ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌లన్నీ బయటకు మెజార్టీ ప్రజలకు లాభం చేస్తున్నట్లు కనిపించిన.దాని సారంలో మాత్రం కార్పొరేట్ల లాభలే ప్రధానంగా ఉంటాయి. తాజాగా బ్రిటన్‌తో భారత ప్రభుత్వం చేసుకున్న ఎఫ్టీఏతో ఇండియాకు ప్రయోజనం చేస్తుందని,భారత్‌ ఆర్థికంగా బలపడుతుందని, దేశ ఆర్థికపురోగాభివృద్దికి ఈ డీల్‌ దోహదపడుతుందని, ప్రపంచ మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదిగేందుకు ఆ అగ్రమెంట్‌ ఉపయోగపడుతుందని రెండు ప్రభుత్వాలు ప్రకటించాయి.బీజేపీ అయితే దీన్ని గొప్ప దౌత్య విజయంగా ఊదరగొట్టుతున్నాయి.

 

అయితే బ్రిటన్‌తో ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందంతో భారత దేశానికి మరణశాసనం రాశారన్న అభిప్రాయం ఆర్ధికవేత్తల నుంచి వ్యక్తం అవుతుంది.యూకేతో ఎఫ్టీఏ వల్ల భారత్‌కు నష్టమే తప్ప లాభం ఉండదన్న వాదలున్నాయి.ప్రధాన మంత్రి దేశంలో మేజార్టీ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే విధంగా ఒప్పందం చేసుకున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశాల మధ్య వ్యాపార సంబంధాలు ఉండటం మంచిదే కానీ అదే సమయంలో మెజారిటీ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఒప్పందాల విషయంలో దేశీయ ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలి. అంతేగాని ప్రజలను బలిపీఠం ఎక్కించే విధంగా ఉంటే అది దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూకేతో భారత్‌ చేసుకున్న జీరో టారీఫ్ ఒప్పందం‌ వల్ల ఇండియా అర్ధిక వ్యవస్థనే ప్రమాదంలో పడుతుందని, కుప్పలు తెప్పలుగా బ్రిటన్‌ తమ వస్తువులను భారత్‌లో కుమ్మరించే అవకాశం ఉందని,ఇండియా మార్కెట్‌పై గుత్తాధిపత్యం పై నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీంతో భారత్‌ స్వయం సమృద్దిని,సెల్ప్‌రిలెటకు ప్రమాదం ఏర్పడుతుంది. భారత్‌ను యూకే వస్తు డంపింగ్‌ గా మార్చే ప్రమావదం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ హెచ్చరిస్తున్నారు.

బ్రిటన్‌తో భారత్‌ చేసుకున్న FTAలో 99 శాతం వస్తువులను జీరో టారీఫ్‌లో చేర్చారు.అందులో లగ్జీరీ వస్తువులతో పాటు వ్యవసాయ రంగం ఉత్పత్తులున్నాయి. మరీ ముఖ్యంగా భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే అగ్రి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని, రైతులు లాభాలు గడిస్తారని కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్రం ప్రకటను భిన్నంగా దేశంలో పరిస్థితులున్నాయి..బ్రిటన్‌తో సుంకాల రహిత ఒప్పందాల వల్ల దేశంలో వ్యవసాయం రంగం కుదేలైతుందని,కోట్లాది రైతు కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడుతాయన్న ఆవేదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతి ఆధారిత వ్యవసాయంతో దేశంలో సాగు దిగబడి క్షీణిస్తుంది.కేవలం బ్రిటన్‌కు అవసరమైన ఉత్పత్తులు మాత్రమే చేయడం వల్ల అగ్రికల్చర్‌ రంగం కుదేలైతుంది. వ్యవసాయ ఎగుమతుల కంటే వేగంగా దిగుమతులు పెరుగుతాయని అన్నదాతలు ఆందోళనలు చెందుతున్నారు. రైతుల నుండి నేరుగా సేకరించడానికి స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలను పుట్టుకొస్తాయని ,ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు సైతం వెలిసి వ్యవసాయంపై గుత్తాధిపత్యంతో రైతులకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

మూడు దశాబ్దాల క్రితం WTOతో భారత్‌ చేసుకున్న ఒప్పందంతో దేశీయ వ్యవసాయం రంగం ఎగుమతి లక్ష్యంవైపు మళ్లడంతో వ్యవసాయ రంగం సామర్ధ్యం తీవ్రంగా క్షీణించింది. నూనె విత్తనాలు, వంటనూనెలకు సంబంధించి ఇండియా దాదాపు స్వయం సమృద్ధంగా ఉండేది. వంట నూనెలు, నూనె విత్తనాల దిగుమతులపై ఆంక్షలు, సుంకాలు ఎత్తివేయడంతో సగం మార్కెట్ దిగుమతులపై ఆధారపడే స్ధితికి చేరుకుంది. ఇప్పుడు బ్రిటన్‌తో ఒప్పందం కూడా అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటున్నారు రైతులు. హార్టికల్చర్,సీఫుడ్స్‌ వంటి ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలు ఎత్తివేయడం వల్ల రైతులందరు వాటి ఉత్పత్తి వైపు మళ్లుతారు.ఫలితంగా ఆహార ధాన్యాలపైన ఆధారపడి బతికే రైతుల జీవనాధారం మరింత కుదించుకుపోతున్నది..మితిమీరిన సీఫుడ్ ఉత్పత్తులు పెంచడం ఎప్పటికీ ప్రమాదమే అన్నది ఇటీవలె అమెరికా,చైనా ఏపీ రోయ్యల ఎగుమతులపై పెట్టిన ఆంక్షలతో రైతులు నష్టపోయిన అనుభవాలు కళ్లముందే ఉన్నాయి. సాధారణంగా రైతులు తమ వస్తువులను డైరెక్ట్‌ యూకేకి ఎగుమతి చేసే అవకాశం ఉంది.మళ్లీ దలారీ వర్గాలపై అన్నదాత ఆధారపడాల్సిందే. ఇది రైతులను అణచివేస్తుంది.వ్యవసాయం నుండి మిగులును హరించివేస్తు అధిక లాభాలను ఆర్జిస్తుంది. రైతుల పరిస్థితి మరింత దిగజారిపోతుంది.ఇలాంటి అనుభవం బ్రిటిష్ ఇండియాలోనూ రైతులకు ఉన్నది.

అన్నికంటే ముఖ్యంగా FSA లో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ కీలకంగా ఉంది.యూకే భారత్‌కు ఎగుమతి చేసే అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ కు పూర్తి పన్ను రాయితీ ఇవ్వడం వల్ల ఇండియాను రోగగ్రస్తం గా మార్చవచ్చు. బ్రిటన్‌ ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను మోతాదుకు మించి భారత్‌తో డంప్ చేయడం వల్ల భవిష్యత్‌ తరాలు ఆనారోగ్యం చెందుతాయి. అధిక చెక్కర,అధిక సాల్ట్‌ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తో చిన్న పిల్లలు, వృద్దలపై దుష్ప్రాభావం చూపిస్తుంది.చిప్స్‌ లాంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తో క్యాన్సర్‌ వ్యాధులు పెరగవచ్చు. పిల్లల్లో ఉబకాయం పెరుగుతుంది.. గర్భిణీ స్త్రీలు, పుట్టే పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తుంది.మహిళాల్లో రక్తహీనత, పిల్లల్లో బరువు తక్కువ సమస్యలు దేశాన్ని కుదేలు చేస్తుంది..ఇప్పటికే అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పిల్లలో ఉబకాయం, పెద్దవాళ్లలో అనేక ఆనారోగ్య సమస్యలు వచ్చాయని జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు బ్రిటన్‌లో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ పై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.ఉత్పత్తిపై అనేక ఆంక్షలు పెట్టింది.అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రచారంపై నిబంధనలు పెట్టింది..ఉత్పత్తిలో వాడే కెమికల్స్‌లు ప్రజలు తెలిసేలా కలర్‌కోటింగ్‌ విధానాన్ని అమలు చేస్తుంది. యూకే ఆంక్షలు విధించిన అలాంటి ఫుడ్స్‌ను ఎఫ్టీఏలో భాగంగా భారత్‌లో డంప్‌ చేసేందుకు ఇండియన్‌ గవర్నమెంట్ అనుతి ఇవ్వడం ఆందోళనలు కలిగించే అంశం..అంతేకాదు ఉద్దేశ్య పూర్వకంగానే బ్రిటన్‌ లో ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ ఉత్పత్తి చేసే కంపెనీలకు నష్టం జరగకుండా ఎఫ్టీఏలో యూకే చేర్చిందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

 

ఒక్క ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ మాత్రమే కాదు..కూల్ డ్రింక్స్‌, లగ్జరీ లిక్కర్‌ను భారత్‌లో కుమ్మరించేందుకు యూకే ప్లాన్‌ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ డ్రింక్‌ మార్కెట్‌కు భారత్‌ కేంద్రం..చాలా దేశాల్లో సాఫ్ట్ డ్రింక్‌ వల్ల పిల్లల్లో ఉబకాయంతో పాటు క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధులకు కారణం అవుతుందని ఆయా దేశాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పుడు భారత మార్కెట్‌ పై బ్రిటన్‌ కన్నెసింది. కాస్మోటిక్స్, టాయిలేటరీస్ పౌడర్ల, సింథటిక్ రసాయనం నుండి అనేక ఉత్పత్తుల వరకు అనేకం కేన్సర్ కి దోహదం చేస్తాయి.ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి.కాస్మోటిక్స్ వ్యాపారానికి పెద్ద మార్కెట్‌గా ఉన్న ఇండియా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన ఉత్పత్తులను ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందంలో చేర్చడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రభావం చూపిస్తుంది.

అంతేకాదు, అనేక అనారోగ్యాలకు కారణం అయ్యే ఉత్పత్తులను యూకే కంపెనీలు భారత్‌లో తమ వస్తువులను డంప్‌ చేస్తూనే మరోవైపు ఆ వ్యాధులను నయం చేసే మందులు కూడా తయారు చేస్తుంది.రోగం, వైద్యం రెండూ ఒకరే ఇస్తే వ్యాపారం ఎలా వర్ధిల్లుతుందో సదరు కంపెనీల లాభాలే చెబుతున్నాయి.రోగుల వృద్ధిపై ఆధారపడి వర్ధిల్లుతున్న అవినీతి రాకెట్ గురించి వివరిస్తూ 2009లో ద ఇడియట్ సైకిల్ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందించబడింది. తాజా అగ్రిమెంట్‌ తో రోగాన్ని, వైద్యాన్ని కూడా బ్రిటన్‌ ఇస్తుంది.ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌తో రోగాన్ని ఇస్తూనే వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ పరికాలను జీరో టారిఫ్‌లో చేర్చింది.

మొదట ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందంతో ప్రజలను జబ్బులకు గురి చేసి ఆ తర్వాత ఔషధాలు తయారు చేసి అమ్ముకొని లాభాలు సంపాదించడానికి యూకే కంపెనీలు ఒత్తిడితో దేశ ప్రజల ఆరోగ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పెట్టింది.

 

యూకే మార్కెట్ తో ఎఫ్‌టీఏతో దేశీయ ఉత్పత్తి దారులు బ్రిటన్‌ మార్కెట్లలో లాభం పొందవచ్చని పైకి అనిపించినా, వాస్తవంలో ఆ అగ్రిమెంట్ పెట్టుబడిదారీ వ్యవస్థలలో వలే ఉత్పాదక శక్తులను ఉద్దీపింపజేయలేవు. దేశంలో ప్రజలు ఉత్పత్తి రాయితీలు ఇవ్వకుండా కేవలం బ్రిటన్‌ వంటి ప్రపంచంలోనే మొదటి వ్యాపార విప్లవాన్నిసాధించిన కంట్రీతో దేశ ప్రజలు పోటీ పడటం సాధ్యం కాదు.బ్రిటిష్‌ కంట్రీస్‌తో పోటీ పడే స్థాయికి దేశ ప్రజల ఎగుమతులు పెంచకుండా ఎఫ్టీఏతో మన ఎగుమతులు, దేశాభివృద్ది పెరుగుతాయని చెప్పడం తడిగుడ్డతో దేశప్రజల గొంతుకోయమే అవుతుంది..ఎఫ్టీఏతో దేశాన్ని మరింత ప్రమాదంలో పెట్టినట్లు అవుతుంది..

-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *