ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ ‌కొర్రీలు: మాజీ మంత్రి కేటీఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : ‌ధాన్యం కొనుగోళ్ల కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ సవాలక్ష కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేస్తోంద‌ని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విషయంలో కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌తీరు ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది కేవ‌లం 46 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు మాత్రమేనని విమర్శించారు. రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల కోట్లకు గాను గత వానాకాలం, యాసంగి కలిపి ఎగ్గొట్టింది రూ.26 వేల కోట్లని చెప్పారు.

క్వింటాలుకు రూ.500 బోనస్‌ అని రైతులలో ఆశలు రేపి దొడ్డు వడ్లకు.. తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టి విదిలించింది కేవలం రూ.530 కోట్లని మండిపడ్డారు. అసలు రైతుకే భరోసా లేదని, ఇక కౌలు రైతులు, రైతుకూలీల ఊసెక్కడిదని ధ్వజమెత్తారు. కల్లాల వద్దకే కొనుగోళ్లతో కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో రైతుకు భరోసా కల్పించామన్నారు. కల్లోల కాంగ్రెస్‌ ‌పాలనలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నలు నిత్యం ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *