సారసాల వలసలు

కలకల రావాలు
కాలం శకుంతాల శుభసూచికల
జండా ఊపింది
ఋతువును కనువిందు
చేస్తున్న ప్రకృతి పక్షులు…

ఒక వైపు మంచు వర్షం
సమశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో
మంచు వెన్నెల సోన
మంచినీటి సరస్సుల్లో
ఆహారం నీరు గూడు వసతి కై
వేల మైళ్లు ప్రయాణించే
వలస సారసాలు…

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో
రకరకాల విదేశి గువ్వలు
వాటి రంగు రంగుల రూపురేఖలు
వాటిసొగసు సోయగాలు
ఎపుడు చూడనివి
కనుల ముందు కనిపించె
పతంగాల గగన విన్యాసాలు
పర్యాటకుల కెమరాల్లో
ఖచరాలు హంసీరాలు
చిత్రకారుడు తన కుంచెకు
అందని అందలు
చిటారు కొమ్మ పై దివౌకసాలు…

గలగల సవ్వడులు చెసే
నీటి పరుగులు
కలకల రాగాలు మరో వైపు
విహాయాసల సరసాల కువకువలు…

కాలంతో పాటు వలసలు
కాలంతో పాటు పర్యాటకులు
మరిచి పోని జ్ఞాపకాలు
చిత్రాలు గా ఫోటోలు గా
మళ్ళి కొత్త పుంతలు తొక్కుతు
మనసుకు హత్తుకునె అందాల బంధాలు
– రేడియమ్‌, 9291527757

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *