“మరోవైపు ఇరాన్ వార్ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన,గ్యాస్ సంక్షోభం సృష్టిస్తుంటే. ఎన్డీయే సర్కార్ అనుహ్యంగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేసేదే కావచ్చు.కానీ ఇన్ని రోజులు తగ్గించకుండా ఇప్పుడే ఎందుకు తగ్గించాల్సి వచ్చిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కొరోనా కాలంలో కూడా పెట్రోల్ డిజిల్ పై సుంకాలు తగ్గించ లేదు.వెరసి రకరకాల పేర్లతో సుంకాలు పెంచింది.వ్యాట్ పెంచింది. ఇప్పుడు తగ్గించడం కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే అంటున్నాయి విపక్షాలు.అదే వాస్తవం కూడా..అయితే తగ్గించిన సుంకాలు మళ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడిన రోజునుంచే క్రమంగా ప్రజలకు తెలియకుండానే పెంచుతుందంటున్నారు. అటు తాజా తగ్గింపు వెనుక వాహన కంపెనీల ప్రయోజనాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.”
నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి ఎలక్షన్ గేమ్ స్టార్ట్ చేసింది. బెంగాల్, కేరళ,అసోం, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ మొదలుపెట్టింది. అసోంలో తప్ప ఎక్కుడ బీజేపీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు..బీజేపీ ఆశలు పెట్టుకున్న బెంగాల్‌లో ఎన్నికల సంఘం తీరుతో విజయం తథ్యం అనుకున్న చోట ఈసీ వ్యవహారంతో పరిస్థితులు మారిపోయాయి.ఇక గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటున్న అసోంలో కూడా పరిస్థితి తారుమారు అయ్యేలా కనిసిస్తున్నాయి. అటు అనుహ్యంగా తిరువనంతపురం మేయర్ సీట్ కైవసం కాషాయా పార్టీ ఈ సారీ కేరళంలో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌లు బలంగా పోటీ పడుతుండటంతో కేరళంలో గెలుస్తామన్న ఆశలు బీజేపీలో సన్నగిల్లినట్లు కనిపిస్తుంది.
దీంతో ఎలాగైనా ఐదు రాష్ట్రాల్లో గెలవాలన్న ఉద్దేశ్యంలో మరో ఎలక్షన్ స్టంట్‌కు బీజేపీ తెరతీసింది.ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్ డీజిల్ పై ఏకంగా భారీగా సుంకాలు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ 13 నుంచి రూ.3లకు తగ్గింది. అటు డిజీల్ పై ఉన్న రూ.10 సుంకాన్ని సున్నాకు తగ్గింది. తగ్గించిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ సుంకాల తగ్గింపు కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసే వరకూ మాత్రమే ఉంటుందన్న అనుమానాలు దేశ ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకను తగ్గించుకోవడానికి కేంద్రం పెట్రో డిజీల్‌పై ఎక్సైంజ్ సుంకాలు తగ్గించిందన్న బహిరంగ రహస్యం.
వాస్తవానికి అసోం తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు లేవు..అయితే బెంగాల్, తమిళనాడు, కేరళం రాష్ట్ర ఎన్నికలను కాషాయ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి.ఎలాగైనా గెలిచి దేశంలో తిరుగులేని శక్తని నిరూపించేందుకు ఏకంగా పెట్రో డిజిల్ పై భారీగా సుంకాలను తగ్గించింది. దేశంతో పాటు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది..మరీ ముఖ్యంగా యువత, రైతులు, మహిళల్లో ఎన్డీయే ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. నిరుద్యోగం పెరిగింది..ధరలు భగ్గుమంటూ పేద మధ్య తరగతి ప్రజల జీవితాలను చింద్రం చేస్తుంది.అర్థిక అసమానాలతు పెరుగుతున్నాయి. నిత్యవసర ధరలతో పాటు పెట్రోల్ డిజిల్ వంటి ఇంధనంపై కేంద్రం భారీ సుంకాలతో మధ్య తరగతి జనాల నడ్డీ విరుస్తుంది. ప్రత్యేక్ష పరోక్ష పన్నులతో ప్రజల జేబుకు చిల్లు పడుతుంది.ఉపాధి లేదు. ఉద్యోగావకాశాలు లేవు. జెన్ జీలో చదువుకున్న నిరుద్యోగులు పెరుగుతున్నారు. వ్యవసాయరంగం కుదేలైంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉంది. దీంతో బీజేపీలో గెలుపు ఆశావాదం తగ్గి ఓటమి నిరాశావాదం పెరుగుతుంది.
.తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్ అమెరిక వార్‌తో ప్రపంచం ఒక నిప్పుల కొలిమిలా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ తమ ఆధిపత్యం కోసం మొదలుపెట్టిన యుద్దం ప్రపంచాన్ని కుదిపేస్తుంది.ఇండియాపై ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఎక్కువ పడింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్దమేఘాలు క్రమంగా భారత్‌ను కమ్మెస్తున్నాయి.దేశ ఆర్థిక వ్యవస్థ షేక్ చేస్తుంది. ఇండియా దిగుమతి చేసుకునే ముడి చమురు, గ్యాస్ ఎక్కువ భాగం పశ్చిమాసియా నుంచే అవుతుంది.ఇప్పుడు యుద్దం కారణంగా పెట్రో డిజిల్ గ్యాస్ కోరత ఏర్పడింది. ఉక్రెయిన్ రష్యా యుద్దం కేవలం రెండు దేశాలకే పరిమితం కావడంతో మన దేశంపై వార్ ఎఫెక్ట్ పెద్దగా పడలేదు.వెరిసి రష్యాతో మంచి సంబంధాలు ఉండటంతో మన దేశ ఎగుమతులు, పెట్రో దిగుమతులపై పెద్దగా పడలేదు.భారత ప్రజలపై భారం పడలేదు.
.అయితే ఇరాన్‌పై యూఎస్ , ఇజ్రాయెల్ వార్ భారత్‌పై ఎక్కువ పడింది..ఇరాన్ యుద్దం ఇండియా బలహీనతను బయటపెట్టింది. పశ్చిమాసియాతో సంబంధాలు లేకుండా భారత్ ముందుకు సాగడం అసాధ్యమని ఇరాన్ వార్ బయటపెట్టింది. అంతేకాదు, ఇరాన్ యుద్దం భారత్‌ను ఆర్టిక రాజకీయ సామాజిక సంక్షోభంలో పడేస్తుంది.ఇరాన్ సహా పశ్చిమాసియా దేశాలు, ఇజ్రాయెల్ అమెరికాతో భారత్‌కు ఆర్థిక, వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉండటంతో ఇప్పుడు వార్ ఎఫెక్ట్ పడుతుంది. యుద్దంలో పాల్గొంటున్న దేశాలతో భారత్‌కు సన్నిహిత రాజకీయాలతో పాటు వ్యూహాత్మక వ్యాపార బంధాలుండటంతో కేంద్రం న్యూట్రల్ గా ఉంటుంది. ఇది వ్యూహత్మకమే అయిన ఇరాన్ యుద్ద సంక్షోభం దేశ ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతుంది. ఇండియాపై ఇరాన్ వార్ చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది..మీరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండటంతో కేంద్రం వ్యూహత్మకంగా పెట్రో డిజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది..ఇది ఎన్నికల స్టంటే అయిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలకు కాస్త ఊరటనిస్తుంది.
.దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన, కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే ప్రతిసారీ బీజేపీకి దేశ భక్తిని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకుంటుంది. ఉగ్రదాడులు, మత పరమైన ఘర్షణలు వంటి అంశాలను కాషాయా పార్టీ ఎజెండాగా ఎంచుకుంటుంది. ఎన్నికల్లో లబ్ది పోందుతుంది. అయితే ప్రస్తుతం కీలమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ అలాంటి దేశ భక్తితో ముడిపెట్టే అంశాలేవి లేవు.వెరసి దేశంలో బీజేపీపై వ్యతిరేకత పెరగడం, ఎన్డీయే ప్రభుత్వం విదేశాంగ విధానంలో విఫలం కావడంతో ఇరాన్ యుద్ద ప్రభావం దేశ ప్రజలపై ఎక్కువ పడటంతో జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునే స్థాయికి చేరింది.అదే టైంలో సర్కార్ నిర్ణయాల వల్ల ధరలు పెరగడం, దేశంలో పెట్రో డిజిల్ గ్యాస్ కొరత ఏర్పాడటంతో ప్రజలు ధర్మాగ్రహంతో ఉన్నారు.
.ఈ జనాగ్రహం వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడుతుందని, ఫలితాలు తారుమారు అవుతాయని గ్రహించిన కేంద్రం, ఎన్డీయే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ప్రజలకు తాత్కాలిక తాయిలాలు ఇచ్చి ఎన్నికల్లో వోట్ల వల విసిరారు..ఇరాన్ వార్‌లో దేశంలో ప్రజా సమస్యలన్నీ కనుమరుగయ్యాయి..యుద్దం కారణంగా దేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలపై చర్చలేకుండా పోయింది.
కీలకమైన బడ్జెట్ సమావేశాలు కూడా ఇరాన్ యుద్ద మబ్బుల్లో కోట్టుకుపోయాయి..ప్రజలందరూ గత నెల రోజులుగా పెట్రోల్ బంక్ చుట్టూ, గ్యాస్ ఏజెన్సీల చుట్టు ఎంగేజ్ అయ్యారు..దీంతో ప్రజల సమస్యల అంశమే కనిపించడం లేదు.అయితే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పెట్రోల్ డిజీల్ పై ఎక్పైజ్ సుంకాన్ని మోదీ ప్రభుత్వం తగ్గించింది.
ఇకవైపు పశ్చిమాసియాలో రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతూ ఇంధన, గ్యాస్ సంక్షోభంతో ప్రజలను కష్టాలు పీడితుస్తుంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం అంటే కేవలం ఎన్నికల స్టంట్ కాక మరేమైతుంది.అయితే దేశంలో పెట్రోల్ డిజిల్ గ్యాస్ కొరత లేదని ప్రజలు ప్యానిక్ కావొద్దని కేంద్రం సంకేతాలు ఇవ్వడానికి సుంకాలు తగ్గింపు ఒక వ్యూహం కావచ్చు..అదే సమయంలో ఇంధన గ్యాస్ కొరత లేదు కాబట్టే సుంకాలు తగ్గించామని, భారత విదేశాంగ విధానం విఫలం కాలేదని సక్సెస్ కావడం వల్లే దేశంలో ఇంధన కోరత లేదని, ప్రజలను ధరాభారం నుంచి విముక్తి చేసేందుకు, సంఘటిత, అసంఘటిత రంగాలకు ఊతం ఇచ్చేందుకే పెట్రో డిజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తమ ప్రభుత్వం తగ్గించిందిని బీజేపీ మరోసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ది పోందే ప్రయత్నంగా కనిపిస్తుంది.
మరోవైపు ఇరాన్ వార్ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన,గ్యాస్ సంక్షోభం సృష్టిస్తుంటే. ఎన్డీయే సర్కార్ అనుహ్యంగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేసేదే కావచ్చు.కానీ ఇన్ని రోజులు తగ్గించకుండా ఇప్పుడే ఎందుకు తగ్గించాల్సి వచ్చిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కొరోనా కాలంలో కూడా పెట్రోల్ డిజిల్ పై సుంకాలు తగ్గించ లేదు.వెరసి రకరకాల పేర్లతో సుంకాలు పెంచింది.వ్యాట్ పెంచింది. ఇప్పుడు తగ్గించడం కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే అంటున్నాయి విపక్షాలు.అదే వాస్తవం కూడా..అయితే తగ్గించిన సుంకాలు మళ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడిన రోజునుంచే క్రమంగా ప్రజలకు తెలియకుండానే పెంచుతుందంటున్నారు. అటు తాజా తగ్గింపు వెనుక వాహన కంపెనీల ప్రయోజనాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
ఒకవైపు దేశంలో ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తూనే మరోవైపు పెట్రో డిజిల్పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించడం అనేక అనుమానాలు దారి తీస్తుంది. వాహనాల కంపెనీల ఆర్థిక సంవత్సరం చివరలో సేల్స్ పెంచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న చట్టం కేంద్రం తీసుకువచ్చింది.దీంతో ఇప్పుటికే తయారైన వాహనాల అమ్మకం పెంచుకునేందుకు ఆయా వాహన కంపెనీల ఒత్తిడితోనే కేంద్రం పెట్రోల్ డిజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెట్రో డిజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గితే పరోక్షంగా అది వాహనాల అమ్మకాలను పెంచుతుంది.
అంతేకాదు ఇప్పుడు ఎన్నికల కోసం కేంద్రం పెట్రోల్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందంటే ఆ మేరకు వచ్చే బడ్జెట్‌లో రాష్ట్రాల కేటాయించే కేంద్ర పన్నుల వాటా రాష్ట్రాలకు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశ ప్రజలపై మోదీకి, ఎన్డీయే ప్రభుత్వాని ప్రేమ ఉంటే ఎక్సైజ్ డ్యూటీతో పాటు పెట్రోల్ డిజిల్ పై వ్యాట్ తగ్గించాలి.వ్యాట్ తగ్గితే రాష్ట్రాలకు, ప్రత్యేక్షంగా ప్రజలకు లాభం ఉంటుంది.కేవలం ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే తగ్గిస్తే అది అంతిమంగా రాష్ట్రాలపై, ప్రజలపై పరోక్షంగా పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అమలు చేసే సంక్షేమం అభివృద్దిపై పడుతుంది.
-తోటకూర రమేష్





