స్త్రీవాదం vs. ట్రాడ్ వైఫ్

గత యాభై ఏళ్లలో తెలుగు స్త్రీవాదం ఒక ఉద్యమం నుంచి జీవన దృక్పథంగా పరిణతి చెందింది. నేడు ఇది కేవలం సమానత్వానికే పరిమితం కాకుండా కులం, మతం, ప్రాంతం మరియు LGBTQ+ వంటి బహుళ అస్తిత్వాల గొంతుకగా మారింది. స్త్రీలు బాధితులుగా కాకుండా, తమ జీవితాలను తామే నిర్మించుకునే కర్తలుగా ఆవిష్కరిస్తున్నది.

దేహ రాజకీయాల నుంచి మేధస్సు వరకు, ప్రకృతితో మమేకమవ్వడం నుంచి వ్యవస్థాగత మార్పుల వరకు ఈ చైతన్యం విస్తరించింది. అయితే, సోషల్ మీడియాలో ‘ట్రాడ్ వైఫ్’ వంటి సంప్రదాయవాద పోకడలు దీనికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. స్త్రీవాదం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందనే ముద్ర వేస్తూ, తిరిగి స్త్రీని ఇంటికే పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, నేటి స్త్రీవాదం హక్కుల కోసమే కాక, గౌరవప్రదమైన, వివక్ష లేని నూతన ప్రపంచం కోసం ఒక నిర్మాణాత్మక పోరాటంగా సాగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *