“ఒక సంఘటన జరిగిన సందర్భాల్లో భిన్న అభిప్రాయాలో, ఆరోపణలో వెల్లడి కావటం వ్యక్తం చేయటం సాధారణమే కానీ బాధితులను దోషులుగా చిత్రిస్తూ సోషల్ కోళ్ళు కూస్తుండటం విచారకరం.. మరికొందరు ఆమెను సరధిస్తూ పెడుతున్న పోస్టులలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తుండటం గమనార్హం.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు కిలినిక్ లు ఏర్పాటు చేస్తున్నప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.. బాధితురాలు ఫలానా సామాజిక వర్గం కనుక ఆమెపై సస్పెండ్ వేటువేయగలిగారన్న కుల ప్రస్తావనలూ చోటు చేసుకుంటున్నాయి.”
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లను సృష్టిస్తోంది.. యూ ట్యూబ్, ఇన్స్టా లో ఇంఫ్లూయెన్స్ కలిగిన వారికి వారి ఫాలోవర్స్ ఆధారితంగా ప్రమోషన్ ఆఫర్స్ అందుతున్నాయి.. ఈ ప్రమోషన్లే కొందరి కొంప ముంచుతున్నాయి..తమకు ఇంఫ్లూయన్సర్ హోదా దాక్కిందని, ప్రమోషన్ చేసే చాన్స్ వచ్చిందని వెనుకాముందు ఆలోచించకుండా గుడ్డిగా వ్యవహరిస్తున్నారు. గతంలో బెట్టింగ్ యాప్ లకు ఇదే రీతిలో ప్రచారాలు నిర్వహించి ఇబ్బందులు పడిన వారు సైతం ఉన్నాయి. తమకు ప్రమోషన్ ఆఫర్ వచ్చినప్పటికీ ఆ ప్రకటన దేనికి సంబంధించినది దానిని ప్రచారం చేయటం వల్ల ఇతరులు నష్టపోయే ప్రమాదముందా, తాము నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రమాదముందా అన్న ఆలోచనకు ఆస్కారం ఇవ్వటంలేదు..
ఆధునిక కాలం అనేక సాంకేతిక సంబంధితాలను నిత్య జీవితంలోకి చొప్పిస్తోంది.. భాషకు, సంస్కృతికి, సంప్రదాయానికి, ఇంకా సంభాషణకు, భావ వ్యక్తీకరణకు సంబంధించి అనేక కొత్త పదాలు చోటు చేసుకుంటున్న విషయం కొత్తదేం కాదు.. వాటిల్లో మరొకటి ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగులు సోషల్ మీడియా.. సోషల్ మీడియాను ఉపయోగించుకోవటం ప్రభుత్వోద్యోగులకు నిషేధమేం కాదు కానీ వినియోగ హద్దుల అవగాహనా స్పష్టత లేకపోవటంతో కొందరు ప్రభుత్వోద్యోగులు చిక్కుల్లో పడుతున్నారు.. తాజా ఉదాహరణ ఖమ్మం ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఘటన. సోషల్ మీడియా వినియోగిత నియంత్రణ విషయమై లక్ష్మణ రేఖ లేకపోవటంతో ఆమె సమస్యల్లో పడ్డట్టు అర్థం అవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలై ఉండి ఆమె ప్రైవేటు విద్యాసంస్థల ప్రచారం చేయటం తప్పని, తద్వారా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని తాము సూచించినా ముందస్తు హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడవుతున్నాయి..
ఒక సంఘటన జరిగిన సందర్భాల్లో భిన్న అభిప్రాయాలో, ఆరోపణలో వెల్లడి కావటం వ్యక్తం చేయటం సాధారణమే కానీ బాధితులను దోషులుగా చిత్రిస్తూ సోషల్ కోళ్ళు కూస్తుండటం విచారకరం.. మరికొందరు ఆమెను సరధిస్తూ పెడుతున్న పోస్టులలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తుండటం గమనార్హం.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు కిలినిక్ లు ఏర్పాటు చేస్తున్నప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.. బాధితురాలు ఫలానా సామాజిక వర్గం కనుక ఆమెపై సస్పెండ్ వేటువేయగలిగారన్న కుల ప్రస్తావనలూ చోటు చేసుకుంటున్నాయి..
బాధ్యతగల ప్రభుత్వోద్యోగి ,అందునా ఉపాధ్యాయురాలై ఉండి ప్రైవేటు స్కూళ్ళకు అడ్మిషన్ల ప్రచారం చేయటం ఆమెపైగల అభియోగం. గతంలో ఖమ్మం మునిసిపాలిటీకే చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది టిక్ టాక్ రీల్స్ చేసి ఇదే తరహాలో సస్పెండ్ వేటుకు గురయ్యారు. వాస్తవానికి వారు ఎంతో ప్రతిభావంతులైన నటులు, కళాకారులు కానీ పనిచేస్తున్న విభాగాలలోనే రీల్స్ చేశారన్న అభియోగంపై అప్పట్లో వేటుపడింది. తాము భోజన విరామ సమయంలో రీల్స్ చేశామని వారు అప్పట్లో వాదించారు.. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఆక్టివిస్టులుగా ఉండకూడదనో, వినియోగించకూడదనో అనటం భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లు అవుతుంది కనుక..ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా కానీ ఉమ్మడిగా కానీ ప్రభుత్వోద్యోగులసోషల్ మీడియా వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించాలి.
ఉదాహరణకు విధుల నిర్వహణ సమయంలో ,రీల్స్ చేయకూడదు, విధులు నిర్వహించే చోట షూట్ చేయకూడదు, ఒకవేళ వాటిని ఎక్కడో తమ ఇళ్ళవద్దో, ఇతర ఏ ప్రాంతంలోనో షూట్ చేసుకున్నా వాటిని తమ పని గంటల సమయంలో (డ్యూటీ అవర్స్) లలో అప్లోడ్ చేయకుండా ఉండటం..తమ సంస్థలకు నష్టం కలిగించేవిగా వారి పోస్టులు, ప్రచారాలు ఉండకుండా చూసుకోవటం అనే సాధారణ విషయాలకు సంబంధించి తగిన అవగాహన కల్పించాలి..ఎందుకంటే సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించేది యూత్ కనుక..కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతీ యువకులు సోషల్ పోస్టుల కారణంగా ఇబ్బందుల్లో పడకుండా ఉండటంకోసం..ఇవన్నీ అందరికీ తెలిసిన అంశాలే అని అనిపించొచ్చు కానీ అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..ఒకవేళ అటువంటివి ఇప్పటికే ప్రతిపాదించి ఉంటే వాటిని మరోసారి ఎరుక పరచాలి. తద్వారా ఇతర ప్రభుత్యోద్యోగులు తమ హద్దులు దాటకుండా ఉండటానికి ఆస్కారముంటుంది.
కంచర్ల శ్రీనివాస్
9640311380





