16న విచారణకు రావాలని ఆదేశం
ఫార్ములా ఈ–కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈడీ ఎదుట కేటీఆర్ మంగళవారం హాజరు కావాల్సి ఉంది. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని తెలిపారు. హైకోర్టుపైనున్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంత వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ సమాధానం పంపారు.
. అయితే ఫార్ములా–ఈ–కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యహారంలో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యతంర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది ఈ క్రమంలో ఈడీ తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసి 16న విచారణకు రావాలని కేటీఆర్‌ను ఆదేశించింది.
హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్‌లోని తన నివాసంలో తన లీగల్ టీమ్‌లో చర్చిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారు. కాగా, క్వాష్ పిటన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




