యూత్ ఐడియాథాన్‌లో డీపీఎస్ విద్యార్థుల ప్రతిభ

‘ఫావమ్ లింక’కు వ్యాపారవేత్తలు, నిపుణుల ప్రశంసలు
వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 20: థింక్ స్టార్టప్, సీబీఎసఈలు సంయుక్తంగా ఐఐటి దిల్లీలో ఆదివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక యూత్ ఐడియాథాన్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా పెండ్యాలలోని డీపీఎస్ సీబీఎసఈ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని పాఠశాల చైర్మన్ రవికిరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘ఫామ్ లింక’ అనే యాప్‌ను అధ్యాపకుడు కాసిపేట మనోజ్‌రాజ్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధస్సు ఆధారిత ఈ యాప్ ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

రైతులు నేరుగా మార్కెట్లతో అనుసంధానం కావడం, సరైన ధరలు పొందడం వంటి అంశాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్థులు వివరించారు. విద్యార్థుల వినూత్న ఆలోచన న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, నిపుణుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది.

ఆధునిక సాంకేతికతను వ్యవసాయరంగ అభివృద్ధికి వినియోగించే దిశగా ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రవికిరణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇన్నారెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలతో ముందుండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *