“అరాచకానికి పరాకాష్ట గా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అభ్యర్థుల వ్యక్తిగత కుటుంబ జీవితాలను నుండి మొదలై రాజకీయ పార్టీల విమర్శల హద్దులు దాటి ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు సైతం వాడుతున్న పదాలు నిజంగా సిగ్గుచేటు. ఈ చర్చ ప్రక్రియను లేదా ఈ దిగజారుడుతనాన్ని ఎవరు మొదలుపెట్టిన హుందాగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ నాయకులు కూడా అదే అదే దారిలో నడుస్తున్నారు.దోచుకోవడం దాచుకోవడం అనే లక్ష్యం తో పనిచేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజలకు తిట్లు పంచుతున్నారు . ఫలితంగా రాజకీయాలంటేనే నూతన తరాలకు ఒక ఏహ్యా భావన ఏర్పడుతుంది.”
వోట్ల కోసం..నాయకుల “బూతు” పంచాంగం
టీఆర్పీ రెట్లకోసం .. కొన్ని మీడియా సంస్థల ఆరాటం
తెలంగాణ రాజకీయ నాయకులు తాము గెలవడం కొరకు వ్యక్తిత్వహననానికి పాల్పడుతూ మనుషులుగా ఓడిపోతున్నారు. అభివృద్ధి పునర్నిర్మాణం లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ.దానికి భిన్నంగా తెలంగాణా రాజకీయాల్లో జరుగుతున్న విమర్శ ప్రతి విమర్శలు జుగుత్సా కరంగా తయారయ్యాయి. విధాన పరమైన విశ్లేషణలతో జరగాల్సిన చర్చలు తాత్కాలికంగా పై చేయి సాధించాలనే ఆతృతలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వ్యక్తిత్వాలను కోల్పోతున్నారు. బూతులు మాట్లాడితేనే పోలింగ్ భూతుల్లో వోట్లు పడేస్థాయికి తెచ్చారు. రాజకీయాలనగానే పరుష పదాలు వాడితేనే పక్కపార్టీని నిజంగా విమర్శించినట్లు నీళ్ల పంపులకాడ పంచాయితీల లాగా తయారు చేశారు .బూతులు వాటికి కౌంటర్ బూతులు ఇవే నేటి రాజకీయ విమర్శలు ప్రజలిక్కడ ప్రేక్షకులు.టీవీల్లో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాం స్థాయికి రాజకీయాలను తెచ్చారు .
అరాచకానికి పరాకాష్ట గా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అభ్యర్థుల వ్యక్తిగత కుటుంబ జీవితాలను నుండి మొదలై రాజకీయ పార్టీల విమర్శల హద్దులు దాటి ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు సైతం వాడుతున్న పదాలు నిజంగా సిగ్గుచేటు. ఈ చర్చ ప్రక్రియను లేదా ఈ దిగజారుడుతనాన్ని ఎవరు మొదలుపెట్టిన హుందాగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ నాయకులు కూడా అదే అదే దారిలో నడుస్తున్నారు. దోచుకోవడం దాచుకోవడం అనే లక్ష్యం తో పనిచేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజలకు తిట్లు పంచుతున్నారు . ఫలితంగా రాజకీయాలంటేనే నూతన తరాలకు ఒక ఏహ్యా భావన ఏర్పడుతుంది. ఇప్పటివరకు ప్రజలను మద్యం మత్తు సంక్షేమ పథకాల బూచితో తమ వెంట తిప్పుకున్న నాయకులు నేడు తాత్కాలిక భావోద్వేగాలను రెచ్చగొట్టి మా నాయకుని ఇలా అన్నారు.
అంటే మేముతట్టుకోలేము అని ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ ఇండ్ల మీద ఆఫీసుల మీద దాడి చేస్తాము అన్న ఉన్మాదానికి తీసుకొచ్చారు. ఇది కాదు కదా రాజకీయాలుఅంటే ..గతపదేండ్ల అధికారంలో బూతులనే అధికారం చేసిన కేసీఆర్ ఆయన పార్టీ వాళ్లు కానీ కొందరు ఎదుగుతున్న ఇతర నాయకులుగా చెప్పుకోబడుతున్న వాళ్ళు కానీ ఆయన ఫార్ములానే వాడుతూ ప్రమోషన్ పొందాలని చూస్తున్నారు. తమ రహస్య ఎజెండాలను అమలు చేసుకోవడానికి వీరికి ప్రోత్సహిస్తూ ఒకవైపు మీడియా సంస్థలు వీటినే ప్రధానం చేస్తూ రోజులకు రోజులు వార్తా ప్రసారాలు చేస్తూ ఇష్టం వచ్చిన తంబ్ నెయిల్స్ పెట్టి వ్యూయర్ పెంచు కొనే ప్రయత్నం చేయడం ప్రస్తుతం వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుoదేమో గాని ఇది భవిష్యత్తు సమాజా విధ్వంసానికి పునాది మాత్రమే.
కేవలం బూతు విమర్శ ప్రతి విమర్శనే కాదు దీనీ వెనక పెద్ద రాజకీయ కుట్ర ఉంది . రాష్ట్రంలో దేశంలో తాండవిస్తున్న అవినీతి ,నిరుద్యోగము ఉపాధి సమస్యలు వైద్య ఆరోగ్య సమస్యలపై కరిగిపోతున్న ప్రజాస్వామిక విలువలపై రాజ్యాంగ స్ఫూర్తి పై ప్రజా దృష్టి నీ మరల్చేందుకు ఈ అవాంచిత చర్చలను ప్రదానం చేస్తున్నారూ.. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాల పేరుతో కొంతమంది నాయకులు వేస్తున్న బూతుల ఎరలో ట్రాప్ లో పడకుండా సoవయనం పాటించాల్సిన అవసరం ఉంది.
అన్నా అక్క అంటూ ఆప్యాయంగా పలకరించుకోవడం తెలంగాణ ప్రాంత జీవన సంస్కృతి కానీ ఈ ఎన్నికల రాజకీయాల్లో ఆ జీవన సంస్కృతిని దెబ్బతీస్తూ ప్రారంభించిన ఈ వైషమ్య వ్యక్తిత్వ హనన సంస్కృతికి ఇప్పటికైనా అంతం పలకాల్సిందే. రాజకీయ సభలైన ఎన్నికల ప్రచారాలైనా జరగాల్సింది చెప్పాల్సింది రాజకీయ విధానాలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజా అభివృద్ధికి వాళ్ళ ముందున్న ప్రణాళికలు మాత్రమే. ఇవి మాత్రమే భారత ప్రజాస్వామిక విలువలను కాపాడుతాయి ఆ పిల్లలను రక్షించేందుకు అందరము నడుం బిగించాల్సిన అవసరం ఉంది.
-ధర్మార్జున్
తెలంగాణ జన సమితి
తెలంగాణ జన సమితి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి





