యుద్దమైన,రాజకీయమైన ఓ సుదీర్ఘ ప్రస్థానం ఎప్పుడూ వేడి చల్లారకుండా నాయకులు పార్టీ కార్యకర్తల్లో ఆవేశపు నిప్పు రాజేస్తూ ఉండాలి. ఆ పని ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో భావోద్రేకాల వేడి చల్లారకుండా రెట్టింపు ఉత్సాహం తనదైన శైలిలో నిరూపించారు.మోదీ నేర్పరితనం కంటే కూడా వ్యూహం చాల శక్తివంతమైనదని పలుమార్లు రుజువు చేసారు. నిన్న జరిగిన పాకిస్థాన్, భారత్ యుద్ధం ఒక్కసారిగా కాల్పుల విరమణ ప్రకటించడం చూస్తే అనుమానం రాకమానదు.మోదీ మాత్రం సింధూర్ ఆగలేదని చెప్పడం విశేషం. నాడు పుల్వామా ఉగ్రదాడి పుణ్యమాని భారత్ ఎదురుదాడి చేసి ముష్కరులను మట్టుబెట్టారు.నేడు పహల్గామ్ లో జరిగిన ఉగ్రమూకలు 26 మందిని పొట్టనబెట్టుకున్నందుకు మోదీ ప్రభుత్వం చలించిపోయి ఆపరేషన్ సింధూర్ పేరుతో రంగంలోకి దిగింది. పాక్ దుశ్చర్యలను తిప్పికోట్టింది.ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది.దాడికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదలతో వాళ్ళ అకృత్యాలు బయటపడినాయి. ఆలస్యం అమృతం విషం అన్న మాదిరిగా ఏమాత్రం ఆగకుండా ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత ఆర్మీ రెండు భాగాలలో దాడులు చేసింది. సామాన్య ప్రజలకు నష్టం జరుగకుండా దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి 100 మంది తీవ్రవాదులను హతమార్చి భారత్ పై సాధించింది.ప్రత్యర్థులు పీవోకేను అప్పగించడం తప్ప పాక్ కు గత్యంతరం లేదని గట్టిగా జవాబు ఇచ్చింది.బీకరంగా సాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణపై ట్రంప్ టెంపరితనం ఏమిటో అర్థం కావడంలేదు.ఒకప్పుడు పాక్ కు వంద కోట్ల డాలర్లకు పైగా అందజేసిన అమెరికా ఇప్పటికే బడ్జెట్ లో తగ్గించింది.కానీ ఇక్కడ ఓ వైపు పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా ఉచిత సలహాలు ఇచ్చిందేమోననే భావన అందరిలో ఏర్పడింది.
ఈ ఉగ్రదాడి పాకిస్థాన్ పైశాచికత్వంతో మానవత్వం పై జరిగిన దాడిగా 140 ప్రజలు భావించారు,విచక్షణ, వివేకం, ధ్యేయం లేని ఉగ్ర ముఠాలను పెంచి పోషించి ,భారత సైన్యం చేతిలో కోల్పోయిన ఉగ్రవాదులకు పాక్ జెండాను కప్పి నివాళులు అర్పించడం వారి అజ్ఞానికి నిదర్శనం.ఈ దాడి దేశ ప్రతిష్టను, భిన్నత్వంలో ఏకత్వం వారసత్వంతో జీవిస్తున్న ప్రజల సామరస్యత సహజీవన విలువలకు విఘాతం కలిగించే చర్యగా ప్రతి ఒక్కరు స్పందించారు. .ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ దుస్సాహసానికి విరుగుడులా భారత సైన్యం పాక్, క్షిపణులను,డ్రోన్ లను సునాయాసంగా తిప్పికొట్టింది.పాక్ సరిహద్దుల్లో అనుమాన స్పదంగా వ్యవహరిస్తే కాల్చి వేసేలా ఉత్తర్వులు జారీచేశారు.దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుంది. పహల్గమ్ మతోన్మాదుల రాక్షసత్వానికి 26 కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి.దేశ విదేశీ పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే స్వర్గ ధామం గా నిలిచే కాశ్మీర్ లో ఇలాంటి ఘటనలకు చోటు కొత్తకాదు.ప్రపంచ జ్యోతి, శాంతి దూత బుద్ధుడు బోధించిన కరుణ దయ జ్ఞానాలతో అశోకుడు నిర్మించిన కాశ్మీర్ భారత ప్రజల సమష్టి సంపద,అటువంటిది కులాల, మతాల కుంపటి రగిలిస్తూ ఉగ్రవాద కల్లోల చర్యలతో రక్తపాతం ఏరులుగా పారిస్తున్నది ముష్కరుల అనాలోచిత విధానాల వల్ల పర్యాటక ప్రాంత ప్రజల జీవనోపాధిని దెబ్బ దీస్తుంది,ఇది అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేయాలనేది దాయాదుల పన్నాగం అనేది స్పష్టంగా కన్పిస్తున్నది.
భారతావని పై అంతులేని విద్వేషంతో ఉగ్రమూకలను రెచ్చగొట్టి కార్గిల్ వార్, పుల్వామా దాడి లాంటి సంఘటనలు మరువక ముందే పాక్ తరచూ కాశ్మీర్ లో రక్తపాతం సృష్టిస్తున్నది.శాంతియుత సహజీవనం కు ఇబ్బందులు కలిగించే ఉగ్ర ముఠాల మూలాలను దెబ్బతీయాలంటే రాజకీయాలకు ఇవ్వకుండా ట్రంప్ దౌత్యం లేకుండా కాల్పుల విరమణ జరగాలంటే పాకిస్తాన్ బేషరత్ గా పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించాలి, నరరూప రాక్షసుడు మసూద్ అజార్ లాంటి ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంటి పోరు పీక్ స్థాయిలో ఉన్నది బెలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా నినదిస్తున్నది.అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు యుద్ధాన్ని నడిపించే తాకతి లేదు.ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో అల్లాడి పోతుంది. అప్పుల కోసం ఎవరి మెట్లు ఎక్కినా ఎవ్వడు రానివ్వడం లేదు.అయినా కింద పడుకొని ఎనకర్రకు కాళ్ళు చాపుతున్నది, రాత్రి అయ్యిందంటే డ్రోన్లు, క్షిపణులు పట్టుకొని మిరుగుడు పువ్వు మాదిరిగా దొంగ రాత్రి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.ఇప్పటికే ఐదుగురు భారత సైనికులను పొట్టన పెట్టుకుంది.నిజంగానే యుద్ధం జరిగితే భారత్ తో ఏ రకంగానూ సరిపడే శక్తి లేదు.ఇప్పటికే పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.అయినా తగ్గకుండా భారతీయ విమానాశ్రయాలు,నగరాలు టార్గెట్ గా పాక్ దాడి యత్నాలను మన బలగాలు సునాయాసంగా ప్రతిఘటించాయి. మరోవైపు కశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ మాటలు నమ్మి మరోసారి మోసానికి గురికావద్దు.ఏడూ దశాబ్దాల చరిత్రలో నిత్యం శాంతి కోసం అర్రులు చాచిన ఇండియా కాల్పుల విరమణను నమ్మి మరో సారి మోసపోకుండా ముష్కరులను తుదిముట్టించి పాక్ ను స్వాధీనం చేసుకున్నప్పుడే ఉగ్ర మూకల దాడుల్లో అసువులు బాసిన భారత సైనికులకు అందించే ఘనమైన నివాళి.






