సర్కిల్ వారీగా ఎక్కువ మొత్తంలో కుక్కలను పట్టుకోవాలి : కమిషనర్ ఇలంబర్తి
హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 25:నగరంలో కుక్కల బెడద నివారణకు స్టెరిలైజేషన్ అధిక సంఖ్యలో చేపట్టాలని జీహెచ్‌ఎంసి కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం ఉదయం కమిషనర్ ఎల్బీ నగర్ జోన్ ఫతుల్లగూడ జంతు సంరక్షణ కేంద్రాన్ని, డాగ్ క్యాచింగ్ వెహికల్, కుక్కల ఆపరేషన్ థియేటర్, పెంపుడు కుక్కల క్రిమిటోరియం, సి అండ్ డి ప్రాసెసింగ్ ప్లాంట్ లను పరిశీలించారు. కుక్కలను పట్టుకునే వాహనాలు రోజుకు ఎన్ని కుక్కలను పట్టుకుంటున్నారు? రోజుకు ఎన్నింటికి స్టెరిలైజేషన్ జరుగుతున్నాయి అంటూ కమిషనర్ చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ ను ప్రశ్నించారు. స్టెరిలైజేషన్ చేసిన కుక్కల వివరాలు, జోన్ లోని సర్కిల్ వారీగా పట్టుకున్న కుక్కల వివరాలను డాక్టర్ వకీల్ కమిషనర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… సర్కిల్ వారీగా వెహి కల్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుక్కల బెడద, కుక్క కాటు నివారణకు శస్త్ర చికిత్సలు చేసినప్పుడు మాత్రమే ఫలి తాలు ఉంటాయన్నారు. అందుకు రోజు వారీగా సమీక్షించి అధిక సంఖ్యలో కుక్కలను పట్టుకునే విధంగా క్షేత్ర స్థాయి అధి కారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలన్నారు. డాగ్ క్యాచర్ లకు సెట్లను అందజేయాలని సూచించారు. పెట్ డాగ్ ల క్రిమిటోరియం పరిశీలించి నెలకు ఎన్ని జరుగుతు న్నాయని నిర్వాహకులను అడుగగా నెలకు సుమారు 30 నుండి 35 వరకు క్రిమిటోరియం చేస్తున్నట్లు వారు కమిషనర్ కు వివరి ంచారు.కమిషనర్ భవన నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ యూనిట్‌లను పరిశీలించారు.
ఈ సందర్భంగా 500 టన్నుల కెపాసిటీ గల నాలుగు భవన నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి కమి షనర్‌కు వివరించారు. రాంకీ ద్వారా జీడిమెట్ల, ఫతుల్లగూడలలో ఏర్పాటు చేయగా, సోమా శ్రీనివాస్ రెడ్డి ద్వారా శంషాబాద్, తూముకుంట లలో యూ నిట్లు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. కమిషనర్ వెంట ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, హెల్త్ అడిషనల్ కమీషనర్ పంకజ, చీఫ్ వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వకీల్, జోనల్ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ రంజిత్, హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.





