మీడియాకు ఆత్మవిమర్శ అవసరం లేదా..?

“రెండు చిన్న పేపర్లు, ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌ ఆధ్వర్యం నడిచే పత్రికలు ఒకటి, రెండు మినహా మెయిన్ స్ట్రీమ్‌ మీడియా, పత్రికలన్నీ ఏదో పార్టీతో అంటగాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేస్తున్నాయి.. ప్రజల ప్రయోజనాల కంటే అధికార పార్టీల ప్రయోజనాల రక్షణకే పని చేస్తున్నాయి. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజానాల కోసం మీడియాను, జర్నలిస్టులను పావుగా వాడుకుంటున్నారు తప్ప ప్రజాకోణం ఎక్కడ కనిపించడం లేదు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ప్రధాన స్రవంతి మీడియా మొత్తం పార్టీల కరపత్రాలుగా, పార్టీ ఆఫీస్‌ల మారాయి..ఈ మీడియా ఆ మీడియా అన్న తేడా ఏమీ లేదు..అన్ని ఆ తాను ముక్కలే..కొన్ని పత్రికలు ప్రజల కోసం ప్రతిపక్షమై “ప్రజాతంత్ర” విలువలకు అండగా నిలుస్తుంటే వాటిపై ప్రభుత్వాల ఆర్థిక, రాజకీయ ఒత్తిడుల గురించి చెప్పనవసరం లేదు.”
తెలుగు రాష్ట్రాల్లో మీడియా హద్దులు దాటుతుంది. పరిధికిమించి ప్రవర్తిస్తుంది.కొన్ని మీడియా హౌస్‌లు అధికార పార్టీ అనుసంధ సంఘాలుగా వ్యవహరిస్తున్నాయి.మీడియా విలువలకు, జర్నలిజం  ఎథిక్స్‌ ను గాలికి వదిలేసి ప్రభుత్వాల ప్రాపకం పని చేస్తున్నాయి..నాల్గో ఎస్టెట్‌గా గుర్తింపు,ప్రజల పక్షన పని చేయాల్సిన మీడియా ఇవాళ అధికార పార్టీల పంజరంలో బంధీగా మారింది.విచారణ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రతికార రాజకీయాలు చేసే అధికార పార్టీలకు ఇప్పుడు మీడియా కూడా తోడైంది.
తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే.కానీ మీడియా తెలుగురాష్ట్రాల్లో వర్తమాన రాజకీయాల్లో అలా వ్యవహరిస్తొందా ?, అంటే నూటికి నూరుశాతం లేదు.పక్షపాత తీర్పులు,ఏక పక్ష వైఖరులే వెల్లడౌతున్నాయి.ఒక రకంగా ప్రజల పక్షన ఉండాల్సిన మీడియా ఇవాళ ప్రభుత్వంపై, పార్టీలపై గుత్తాధిపత్యం సాధించి ఏకంగా షాడో గవర్నమెంట్‌ను నడిపిస్తున్నాయి.రాజ్యాంగ బద్దంగా ఉండాల్సిన మీడియా రాజ్యాంగేతర శక్తులుగా ఎదుతున్నాయి. చట్టాలు న్యాయవ్యవస్థ చేయాల్సిన విచారణలు కూడా కోర్ట్‌ల కంటే  ముందు మీడియానే న్యాయ ట్రయల్‌ చేస్తుంది.తీర్పు కూడా ఇచ్చేస్తుంది.
అధికారంలో ఏ పార్టీ ఉన్న మీడియా ప్రజల పక్షాన ఉండాలి.బలమైన ప్రతిపక్షపాత్ర పోషించాలి.అధికార పార్టీలు.ప్రతిపక్షాలు కుమ్మకై ప్రజలను మోసం చేస్తూ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిపై కలమెత్తాలి.వాచ్‌ డాగ్‌లా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలి . విజిల్‌బ్లోయర్   పాత్ర పాత్ర పోషించాలి.ప్రజలను చైతన్యం చేయాలి.ప్రతిపక్షాలు విఫలం అయిన చోట ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రభుత్వాన్ని నీడలా వెంటాడాలి. దురదృష్టం ఎందంటే ఇవాళ తెలుగు రాష్ట్రంలో మీడియా ఆ పాత్రను పోషించడం లేదు.
ఒకటి రెండు చిన్న పేపర్లు, ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌ ఆధ్వర్యం నడిచే పత్రికలు ఒకటి, రెండు మినహా మెయిన్  స్ట్రీమ్‌ మీడియా, పత్రికలన్నీ ఏదో పార్టీతో అంటగాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేస్తున్నాయి.. ప్రజల ప్రయోజనాల కంటే అధికార పార్టీల ప్రయోజనాల రక్షణకే పని చేస్తున్నాయి. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజానాల కోసం మీడియాను, జర్నలిస్టులను పావుగా వాడుకుంటున్నారు తప్ప ప్రజాకోణం ఎక్కడ కనిపించడం లేదు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ప్రధాన స్రవంతి మీడియా మొత్తం పార్టీల కరపత్రాలుగా, పార్టీ ఆఫీస్‌ల మారాయి..ఈ మీడియా ఆ మీడియా అన్న తేడా ఏమీ లేదు..అన్ని ఆ తాను ముక్కలే..కొన్ని  పత్రికలు ప్రజల కోసం ప్రతిపక్షమై “ప్రజాతంత్ర” విలువకు అండగా నిలుస్తుంటే వాటిపై ప్రభుత్వాల ఆర్థిక, రాజకీయ ఒత్తిడుల గురించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వాల వివక్ష, అణచివేతలను ఎదిరించి, అధికార పార్టీలను ధిక్కరించి ప్రజాక్షేత్రంలో ఆ పత్రికలు నిలబడుతున్నాయి. ఈ రోజుకి పత్రిక విలువలు, మీడియా ఎథిక్స్‌ కొద్దోగొప్పో బతికి ఉన్నాయంటే అంటే అది కొన్ని పత్రికలు పాటిస్తున్న పత్రిక విలువ వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
media accountability debate, media self-criticism India, journalism ethics in question, biased news reporting issues, media credibility crisis, role of media in democracy, fake news and media responsibility, press freedom vs responsibility, news media public trust, media reform discussion
స్మార్ట్ ఫోన్‌ విస్తృతంగా వినియోగం రావడంతో మీడియా విలువలు పూర్తిగా పడిపోయాయి..సోషల్‌ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌ పుట్టగోడుగుల్లా పుట్టుకురావడంతో ప్రపంచం మొత్తం ప్రజల గుప్పిట్లోంది ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది..ఇది ఒక రకంగా మీడియా రంగంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకువచ్చింది.అదే సమయంలో అనేక చెడు ప్రభావాలను కూడా తీసుకువచ్చింది..ఇన్‌ స్టేంట్‌ ఉద్యమాలు, తక్షణ ప్రతి స్పందనలు, క్లౌడ్‌ బరస్ట్‌ లాంటి ఉద్యమాలు కూడా సమాంతరంగా పెట్టుకువస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియా ప్రభావంలో పడిన మెయిన్  స్ట్రీమ్‌ మీడియా,ప్రధాన స్రవంతి పత్రికలు విలువలకు, నీతి, నిజాయితీకి తిలోదకాలిచ్చి పోటీ ప్రపంచ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.ప్రతీకార రాజకీయాల్లో పావుగా మారుతున్న తీరు గమనిస్తున్నాం. ప్రతిపక్షంగా ఉండాల్సిన మీడియా అధికార పార్టీ పంచన చేరిందని బహిరంగ రహస్యమే. అధికార పార్టీకి మీడియా హౌస్‌ అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నది గత కొంతకాలం ప్రజల ముందు కనిపిస్తూనే ఉంది.
..అంతేకాదు ప్రభుత్వం తప్పు చేస్తే మీడియా తప్పులను ఎత్తి చూపిస్తుంది.ప్రతిపక్షం విఫలం అయినప్పుడు మీడియా ఆ బాధ్యతను భుజాలకెత్తుకుటుంది.అధికార,ప్రతి పక్షాలు ప్రజా సమస్యలను పట్టించుకోనప్పడు మీడియాను రెండింటిని ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెట్టుతుంది. అలంటి మీడియానే ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రజల వ్యక్తగత జీవితాలను రోడ్డుమీదకు లాగే ప్రయత్నం చేస్తే మీడియాని  ఎవరు హద్దుల్లో పెట్టాలంటూ మీడియాపై జనాగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రజల బాధలు పట్టని మీడియాపై ప్రజాగ్రహాన్నివ్యక్తం చేస్తే, సోకాల్డ్ మీడియా పత్రిక స్వేచ్చపై దాడి అంటూ గగ్గోలుపెట్టుతుంది, ప్రజాస్వామ్యంపై దాడిగా ప్రకటిస్తుంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా దాడిని ఎవ్వరూ సవర్ధించరు.అదే టైంలో మీడియా ముసుగులో ప్రజల వ్యక్తిగత జీవితాలను రోడ్డుకులాడాన్ని కూడా ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ సమర్ధించరు.
ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో నిత్యం మీడియా ఆఫీస్‌ల వద్ద ఏదో ఒక పార్టీ నిరసనలు చేస్తుంది.మీడియాపై దాడులు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో దాడులకు అవకాశం లేదు.అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, దేశానికి ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న మీడియా తమ బాధ్యతను మరిచి ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల దాడులు సహజం అన్నవాదన కూడా ఉంది. చరిత్రలో మీడియాపై దాడులు జరగలేదు.దేశంలో అనేక ఉద్యమాలు  జరిగినా ఎప్పుడు మీడియాపై దాడి జరలేదు.తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాలు ఉవ్వేత్తున సాగినా  పత్రికలపై ఎప్పుడూ దాడులు జరగలేదు.ప్రజాస్వామ్య విలువలు, పత్రిక విలువలు పాటించాయి కాబట్టి జరలేదు. మెజార్టీ ప్రజల ఆకాంక్షతో పాటు మైనార్టీ ప్రజల అభిప్రాయాలకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వడంతో మీడియా ఎథిక్స్‌ పాటించడంతో ప్రజలు మీడియాను గౌరవించారు..ఆదరించారు.!
.అయితే ఇటీవలే జరుగుతున్న దాదుల వెనుక ప్రజల  అసంతృప్తి ఉంది..మీడియా ప్రజల వైపు ఉండటం లేదన్న ఆవేదన ఉంది.ప్రజల్లో ఉన్న ఆవేదన అసంతృప్తి ఆగ్రహంగా మారి దాడులకు దారి తీస్తుందన్న వాదన కూడా ఉంది. సహజంగా మీడియా నిజాయితీగా ప్రజల పక్షాన ఉంటే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటాయి. సర్కార్‌ వైఫల్యాలను, అధికార పార్టీ నేతల ఆరచాకాలు, అవినీతి బయటపెడితే మీడియాను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుంది.అవసరం అయితే అధికార బలం ఉందని దాడులు చేయిస్తుంది.
మీడియాపై ఏ పార్టీ, ఎవ్వరూ దాడి చేసిన తప్పే. అయితే  ఆ దాడులు ఎవరూ చేస్తున్నారన్నదే మీడియా నిజాయికీ గీటు రాయి. తమ తప్పులను, ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తి చూపిస్తుందన్న ఆగ్రహం ప్రభుత్వానికి ఉంటుంది.చేస్తే అధికార పార్టీ దాడి చేయాలి. కానీ ప్రతిపక్షాలను దాడుల చేసే వరకూ ఎవరూ తీసుకువస్తున్నారన్ని ప్రశ్న.ఎందుకు విక్షాలు దాడులు చేయాల్సిన అవసరం వస్తుందని మీడియా అధిపతులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అధికార పార్టీ మీడియాను నియంత్రంచే స్థాయి నుంచి ప్రతిపక్షం దాడులు చేసే దాకా ఎందుకు దిగజారింది..అయితే మీడియా ముసుగులో ఉంటూ.చట్టం మీద ప్రమాణం చేసి చట్ట సభల్లో చట్టాలు చేసే వాళ్ల భాషాలే జుగుప్సాకరంగా ఉంటే.ఇక వాళ్ళు చేసే చట్టాలు ఎలా ఉంటాయి.?.అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది.
ప్రజలకు శత్రువు మీడియానా..? ప్రతిపక్షమా..? ప్రభుత్వమా..?.మీడియా ముసుగులో ఎవరి కోసం పత్రికలు పని చేస్తున్నాయి.?.ప్రజల కోసమా..సర్కార్‌ కోసమా.?.సర్కార్‌ కోసమే పని చేస్తే అది మీడియా ఎలా అవుతుంది..?.మీడియా ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన చోట అధికార పార్టీ పంచన ఎందుకు చేరుతుంది.? ప్రజల పక్షాన కాకుండా అధికారం పక్షాన నిలిస్తే అది మీడియా ఎలా అవుతుంది.?..వాటిపై దాడి పత్రికలపై దాడి అవుతుందా..? మీడియా ముసుగులో ఏం రాసిన మాట్లాడిన చెల్లుతుందా..భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలతో సమానంగా కాకుండా మీడియాకు ఏమైనా ప్రత్యేకతలున్నాయా..?.ఇలా ప్రాధమిక సూత్రాలపై మీడియా సమీక్ష చేసుకొవాల్సిన సందర్భం ఇది.
మీడియా  రాసే రాతల్లో ప్రజా కోణం, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి పక్షపాతం లేకుండా ప్రతిపక్షాలు ఎందుకు దాడులు చేస్తాయి. ప్రతి పక్షాలు దాడులు చేస్తే విశాల ప్రజానీకానికే మీడియాకు అండగా నిలుస్తారు. కానీ  రాసే రాతలు ఒక పార్టీ కోసమే ఒక వ్యక్తి కోసమే ఒక వర్గం ప్రయోజనాల కోసం అయితే  ఇప్పటి దాకా మీడియాను విశ్వసించిన ప్రజలే విశ్వాస ఘాతకులుగా ప్రకటిస్తారు. తిరస్కరిస్తారు. ప్రతిపక్షం చేసే దాడులను పరోక్షంగా సమర్థిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పత్రికలు, మీడియాకు రక్షణ..అంతేకానీ ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఎల్లకాలం రక్షణగా ఉండదు..ప్రజా రక్షతి రక్షితః..
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *