“భారతదేశ పొరుగు శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న సరిహద్దు వివాదాలు, కక్ష పూరిత ప్రమాదాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం బాడీ గార్డు ఉపగ్రహాల పథకానికి పూనుకోవడం సముచితంగా ఉన్నది. ఈ దేశాలు మన ఉపగ్రహాల విధ్వంసానికి కూడా ప్రణాళికలు వేసే ప్రమాదం కూడా ఉన్నందున ఈ నిర్ణయాన్ని ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవడం జరుగుతున్నది. అంతరిక్ష కక్ష్యల్లో చైనాకు చెందిన 930 ఉపగ్రహాలు, పాకిస్థాన్‌కు చెందిన 08 ఉపగ్రహాలతో మన భారత్‌కు చెందిన దాదాపు 100 ఉపగ్రహాలకు భద్రతాపరమైన చిక్కులు రావచ్చని అంచనా వేస్తున్నారు.”

అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టబడిన మన ఉపగ్రహాలు అత్యంత ప్రధానమైన అమూల్య అంతరిక్ష ఆస్తులుగా భావిస్తున్నాం. అంతరిక్ష కక్ష్యలోకి ప్రేవేశ పెట్టబడున భారతీయ ఉపగ్రహాలకు (సాటలైట్లకు) ఇతర దేశాల ఉపగ్రహాలతో ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన ఇస్రో రానున్న రోజుల్లో మన ఉపగ్రహాలకు రక్షణ కవచంగా ‘బాడీ గార్డు ఉపగ్రహాల’ను లేదా ‘ బాండీ గార్డు సాటలైట్’లను ప్రయోగించడానికి నిర్ణయం తీసుకోవడం ఒక ఆశ్చర్యకరమైన అంశంగా పౌర సమాజం భావిస్తున్నారు. అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టబడునా మన ఉపగ్రహాలు వాతావరణ హెచ్చరికలు, దేశ రక్షణ రంగాలు, ఖనిజ సంపద అధ్యయనాలు, సమాచార డిజిటల్ ఉపకరణాలు లేదా కమ్యూనికేషన్, భూ సంపద పర్యవేక్షణ లాంటి పలు అత్యంత ప్రయోజనాలు కలిగి ఉండడంతో వాటి భద్రత మన తక్షణ కర్తవ్యంగా ఇస్రో ప్రణాళికలు వేస్తున్నట్లు తాజా వార్తలు చూస్తున్నాం. వివిధ దేశాలు ప్రయోగించిన అంతరిక్ష ఉపగ్రహాలకు తోడుగా ఎలాన్ మాస్క్ స్టార్‌లైనర్ నెట్‌వర్క్ ఉపగ్రహాలతో “స్పేస్ ట్రాఫిక్” లేదా “అంతరిక్ష రద్దీ” క్రమంగా పెరగడంతో కక్ష్యలోని ఉపగ్రహాల భద్రత ప్రమాదంలో పడుతున్నట్లు తేల్చారు. ఈ విధంగా ఉపగ్రహ-రక్షణ చర్యలను వెంటనే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్రోకు సూచనలు చేయడంతో పాటు ఈ ప్రాజెక్టుకు రూ 270 బిలియన్ల నిధులు కేటాయించడం కూడా జరిగింది.
50కి పైగా బాడీ గార్డు ఉపగ్రహాల ప్రయోగం:
ఇటీవల 2024 ఏడాది మధ్యలో భూతలం నుంచి 500 – 600 కిమీ దూరంలో ఉన్న మన ఉపగ్రహాలకు అత్యంత సమీపంలోకి (ఒక కిమీ సమీపానికి) మరో దేశపు ఉపగ్రహం రావడాన్ని గమనించారు. ఇదే జరిగితే రెండు ఉపగ్రహాలు ఢీకొని విధ్వంసం కావడం జరిగే ప్రమాదం ఉందని ఇస్రో అంచనా వేస్తున్నది. కక్ష్యలో తిరుగుతూ తమ తమ విధులను నిబద్దతతో నిర్వహిస్తున్న మన ఉపగ్రహాలకు రక్షకులుగా దాదాపు 50 “బాడీ గార్డు ఉపగ్రహాల”ను ప్రయోగించడానికి ఇస్రో సమాయత్తం అవుతున్నది. ఇలా ప్రయోగించిన బాడీ గార్డు ఉపగ్రహాలు మన ఉపగ్రహాలకు సమీపంలో ఉంటూ నిరంతర నిఘా చేస్తూ, అంతరిక్ష భద్రత కవచం వలె పని చేస్తుందని ఇస్రో వివరిస్తున్నది.
బాడీ గార్డు ఉపగ్రహాలు తమ సమీపానికి వచ్చే ఇతర ఉపగ్రహాలను గుర్తించడం, ‘లిడార్’ టెక్నాలజీతో సత్వరమే హెచ్చరికలు చేయడం ద్వారా అత్యంత విలువైన మన ఉపగ్రహాలను కాపాడడం జరుగుతుందని తెలుపుతున్నారు. మన ప్రయోగించనున్న బాడీ గార్డు ఉపగ్రహాలు మన భూతల రాడార్ వ్యవస్థలతో అనుసంధానం కావడం ద్వారా నిరంతర నిఘా చేస్తూ, పొంచి ఉన్న ప్రమాదాలను పసిగట్టి సమాచారం అందించడం జరుగుతుందని వివరిస్తున్నారు. మన ఉపగ్రహాల పని తీరు, సమాచార విశ్లేషణ, భద్రత నిఘా లాంటి విధుల్లో 400లకు పైగా ఇస్రో అంతరిక్ష శాస్త్రజ్ఞులు ప్రతి క్షణం విధులు నిర్వహించడం జరుగుతున్నది.
చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న అంతరిక్ష ప్రమాదాలు:
భారతదేశ పొరుగు శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న సరిహద్దు వివాదాలు, కక్ష పూరిత ప్రమాదాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం బాడీ గార్డు ఉపగ్రహాల పథకానికి పూనుకోవడం సముచితంగా ఉన్నది. ఈ దేశాలు మన ఉపగ్రహాల విధ్వంసానికి కూడా ప్రణాళికలు వేసే ప్రమాదం కూడా ఉన్నందున ఈ నిర్ణయాన్ని ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవడం జరుగుతున్నది. అంతరిక్ష కక్ష్యల్లో చైనాకు చెందిన 930 ఉపగ్రహాలు, పాకిస్థాన్‌కు చెందిన 08 ఉపగ్రహాలతో మన భారత్‌కు చెందిన దాదాపు 100 ఉపగ్రహాలకు భద్రతాపరమైన చిక్కులు రావచ్చని అంచనా వేస్తున్నారు.
డిజిటల్ ఏఐ యుగంలో అంతరిక్ష ఉపగ్రహాలు చేస్తున్న సేవలు అనంతరసాధ్యాలు. ఒక్క క్షణం ఉపగ్రహం పని చేయకపోయినా పౌర జీవనం అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తగా పొరుగు దేశాల దురాలోచనలను దృష్టిలో పెట్టుకొని మన ఉపగ్రహాలకు బాడీ గార్డులను నియమించాల్సిందే అని సామాన్యులు కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టును ఇస్రో విజయవంతంగా ప్రయోగించారని కోరుకుందాం, ముందస్తు అభినందనలు తెలియజేద్దాం.





