“అభివృద్ధి చెందిన అమెరికాలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండవ తరం క్రికెట్ పై ఎక్కువగా ఆసక్తిని చూపుచున్నారు. అందులో మిస్సోరి స్టేట్ లోని మిస్సిస్సిపి,మిస్సోరి, మెరామెక్ నదుల పరిసరాల్లో అమెరికాలో 19వ, పట్టణంగా విలసిల్లుతున్న “”సెయింట్ లూయిస్” పట్టణంలో దినదినం క్రికెట్ పై ఆదరణ పెరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా “”ధ్వని ఫౌండేషన్”” స్వచ్ఛంద సేవా సంస్థ “”ధ్వని క్రికెట్ లీగ్ (డీసీఎల్) పేర క్రికెట్ పోటీలను నిర్వహిస్తోంది..”
మేరుగు రాజయ్య, వాట్సప్ 9441440791.
క్రికెట్ ఆట పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.క్రికెట్ అంటే అభిమానించే వారు ఉన్నట్లుగానే విమర్శించే వారు కూడా ఉన్నారు.అయితే ఇతర క్రీడలకంటే క్రికెట్ మెజారిటీ దేశాల్లో ప్రజాదరణను పొందింది.ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో భాగంకాని దేశాల్లో క్రికెట్ కు ప్రధాన గుర్తింపు లేదు.16వ,శతాబ్దంలో ఆగ్నేయ ఇంగ్లాండ్ లో క్రికెట్ పురుడు పోసుకుంది.బ్యాట్ అండ్ బాల్ ఆటల నుండి అభివృద్ధి చెందింది.వీల్డ్ ప్రాంతంలో గొర్రెల కాపరులు ఆడారు. క్రమేపి బ్రిటిష్ సామాజ్యవాద విస్తరణలో క్రికెట్ కూడా వలస వచ్చింది.1624 లో సస్సెక్స్ లో రెండు పారిష్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జాప్సర్ వినాల్ అనే ఆటగాడు అనుకోకుండా తలపై కొట్టబడి మరణించాడు. కింగ్ చార్లెస్ –1 ఉరితీయబడిన తర్వాత 1649 లో ఇంగ్లీష్ కామన్వెల్త్ స్థాపించబడింది.ఇది ఇంగ్లాండ్ లో రిపబ్లిక్ పాలనకు దారితీసింది.1660 లో కింగ్ చార్లెస్ –2 ఇంగ్లాండ్ కు తిరిగి రాకతో రాచరిక పునరుద్ధరణతో కామన్వెల్త్ ముగిసింది.ఆ సమయంలో ప్యూరిటన్లు కొన్ని సార్లు క్రికెట్ ను నిషేధించినట్లుగా చర్చి కోర్టు కేసుల రికార్డ్ లలో లభించిన సూచనల ద్వారా తెలుస్తుంది.
సామాజిక చరిత్రకారుడు డెరెక్ బిర్లీ ప్రకారం 1660 తరువాత పునరుద్ధరణతో క్రికెట్ క్రీడ వ్యాప్తి చెందింది.1664 లో బ్రిటిష్ పార్లమెంట్ జూదం చట్టాన్ని ఆమోదించింది.అందులో క్రికెట్ ను కూడా జూదం క్రీడగా చేర్చారు.ధనవంతులైన కొంత మంది క్రికెట్ పోషకులుగా మ్యాచ్ లను నిర్వహించి లాభాలను పొందారు.శతాబ్దం చివరి నాటికి ఇంగ్లీష్ నావికులు,వలస వాదులు క్రీకెట్ ను కూడా విదేశాలకు తీసుకుపోయారు. 1700 ప్రారంభంలో బ్రిటిష్ వాళ్లు క్రికెట్ ను భారత దేశానికి తీసుకువచ్చారు.మొదటిసారిగా 1721 లో ఆడారు. భారతీయులను బ్రిటిష్ సాంస్కృతిక నిబంధనలలో కలిసిపోవడానికి మాధ్యమంగా ఉపయోగించారు. బ్రిటిష్ వాళ్ల అభిమానాన్ని చూరగొనడానికి భారతీయ ఉన్నత వర్గాలు క్రికెట్ ను ఆడారు.1800 చివర్లో భారత్ లో క్రికెట్ ఇమేజిని సంతరించుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ మొదటిసారిగా 1864 లో కలకత్తా మద్రాస్ జట్ల మధ్య జరిగింది.1860 నాటి మద్రాస్ చట్టం ××1 ప్రకారం 1928 డిసెంబర్ 1న బిసిసిఐ(బోర్డాఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ని స్థాపించారు.మరల తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1975 కింద తిరిగి నమోదు చేశారు.
అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీలో 206 సభ్యదేశాలు ఉండగా ఐసీసీలో 108 దేశాలు ఉన్నాయి.స్పోర్ట్స్ బూమ్ ప్రకారం ఐసీసీలో 12 దేశాలు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్,శ్రీలంక, ఇంగ్లాండ్, ఆప్ఘనిస్తాన్, వెస్టిండీస్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఐర్లాండ్ పూర్తి సభ్య దేశాలుగా ఉన్నాయి.అమెరికాతో కలిసి 96 దేశాలు అసోసియేట్ సభ్య దేశాలుగా ఉన్నాయి. గతంలోని బ్రిటిష్ సామ్రాజ్యవాదం క్రికెట్ ను వ్యాప్తి చేయగా స్పానిస్ సామ్రాజ్యవాదం ఫుట్ బాల్ ను వ్యాప్తి చేసింది.అమెరికా, కెనడా దేశాలలో కూడా బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని సాగించింది.
1848లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో అమెరికా, కెనడా దేశాలు ఆడినవి.అయితే 19వ, శతాబ్దం అనంతరమే క్రికెట్ ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. కాని అమెరికా 1776 జూలై 4ననే స్వాతంత్య్రాన్ని సాధించుకుంది.అందువలన అమెరికన్స్ క్రికెట్ ను వలసవాద క్రీడగా,అణచివేత దారుడి క్రీడగా భావించడం వలననే క్రికెట్ కు దూరమైనారని పరిశోధకులు చెబుతున్నారు. అదీ గాక క్రికెట్ పొడవైన ఆటయని,టైమ్ వెస్ట్ అవుతుందని,టెస్ట్ క్రికెట్ ను ఐదు రోజులు ఆడితే బోరు కొడుతుందనే ఉద్దేశంతో కూడా క్రికెట్ పై ఆసక్తి చూపరు.తక్కువ సమయం, నిడివి గల తొమ్మిది ఇన్నింగ్స్ బేస్ బాల్, ఫుట్ బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్,ఐస్ హాకీ మొదలగు క్రీడలు ఆడతారు. క్రికెట్ ను ఇష్టపడుతున్న భారత దేశం లాంటి దేశాల నుండి ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన అమెరికన్స్ మాత్రం క్రికెట్ ను వ్యాప్తి చేస్తున్నారు.
ఇప్పుడు అమెరికాలో తక్కువ నిడివి కలిగిన”ట్వంటీ 20(టి20)క్రికెట్ ను ఆడించడం ద్వారా ఆసక్తిని పెంచుచున్నారు.2023 ఏప్రిల్ లో “మైనర్ లీగ్ క్రికెట్(MiLC)” ఏర్పాటైంది. ఇందులో ఉన్న 26 జట్లను అంట్లాటిక్,పసిఫిక్ విభాగాలుగా విభజించారు.స్పాన్సర్ షిప్ కారణంగా “కాగ్నిజెంట్ మేజర్ లీగ్ క్రికెట్ అని పిలువబడుతున్న MiLC కి “అమెరికన్ క్రికెట్ ఎంటప్రైజెస్ (ఎసిఇ)తోడ్పాటు కూడా ఉంది.మేజర్ క్రికెట్ లీగ్ లో 4 జట్లు “ఐపీఎల్ ” (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫ్రాంచైజీల యాజమాన్యంలో ఉంది.అందులో (1)లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్,(2)Mi న్యూయార్క్(ఇండియావిన్ నైట్ రైడర్స్ స్పోర్ట్స్ గ్రూప్,(3)టెక్సాస్ సూపర్ కింగ్స్,చెన్నై సూపర్ కింగ్స్,(4)సియాటిల్ ఓర్కాస్ జిఎంఆర్ ,సత్య నాదెళ్ల మొదలగువారు,(5) శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్,ఆనంద్ రాజారామన్,వెంకీ హరి నారాయణ్,(6) వాషింగ్టన్ ఫ్రీడమ్ సంజయ్ గోవిల్ యాజమాన్యంలో ఉంది.
మేజర్ క్రికెట్ లీగ్,అమెరికన్ క్రికెట్ ఎంటప్రైజెస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ ద్వారా ఆమోదింపబడి ప్రొఫెషనల్ ట్వంటీ 20 లీగ్ తో క్రికెట్ అభిమానులను,కొత్త ప్రేక్షకులను పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు.ప్రధాన కార్యాలయాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుండి టెక్సాస్ లోని గ్రాండ్ ప్రైరీ కేంద్రంకు మార్చి మేజర్ లీగ్ క్రికెట్ కు అంతర్జాతీయ గుర్తింపును, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో పూర్తి సభ్యత్వాన్ని పొందడానికి లక్ష్యంగా పని చేస్తున్నారు.నిజంగా అమెరికాలో క్రికెట్ఆర్థిక విజయం సాధించినట్లయితే ఐసీసీ ఇంకా శక్తివంతం అవుతుంది.ఇప్పటికే అమెరికా క్రీడా మార్కెట్ వివిధ విభాగాల నుండి ఏటా దాదాపు $ 100(రూ.8,730,597,340,000.00)బిలియన్ డాలర్ల సంపాదన ఉంది. స్పాన్సర్షిప్ అపరిమితంగా ఉండటం వలన అమెరికన్ కార్పొరేషన్స్ క్రికెట్ ను సంపన్న జనాభాకు చేరే ప్రీమియం కంటెంట్ గా చూస్తున్నారు.అమెరికాలో పెరుగుతున్న దక్షిణాసియా జనాభా అంతర్నిర్మిత జ్ఞాన స్థావరాన్ని మరియు క్రికెట్ పట్ల మక్కువను అందిస్తూ సాంస్కృతిక వారసులుగా వాసికెక్కబోతున్నారు.
ఐసీసీ 2007 సెప్టెంబర్ 13న ట్వంటీ 20 (టి20)ప్రారంభించి నిర్వహించిన ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది.దానితో బీసీసీఐ 2008 ఏప్రిల్ 18 న ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)ను ప్రారంభించింది.”బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్” లెక్కల ప్రకారం అత్యంత ధనిక స్పోర్ట్స్ లీగ్ ల లో ఒకటిగా ఎదిగింది.2023 అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై , దిల్లీ, ధర్మశాల, హైదరాబాద్, కలకత్తా,లక్నో, ముంబాయి, పూణె పట్టణాలలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ పోటీలను దాదాపు 12,50,000 మంది ప్రేక్షకులు స్టేడియంలలో తిలకించారు.ఇంకా టీవీల ముందు కూర్చొని వీక్షించిన ప్రేక్షకుల కోట్లలో ఉంటారు.
ఈనాడు క్రికెట్ ఆటలో ప్రవేశపెట్టిన ట్వంటీ 20 (టి20) పార్మాట్ క్రికెట్ క్రీడా అభివృద్ధికి ,ప్రేక్షకుల అభిమానానికి తోడ్పడిందని ఐసీసీ,బీసీసీఐ,ఐపీఎల్, ఆస్ట్రేలియా బిగ్ బాస్ లీగ్(బీబీఎల్) ఇంకా క్రికెట్ ఆడే దేశాల క్రికెట్ లీగ్ లు ప్రపంచ కప్ పోటీలకు తలపడుతున్నాయి.నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వన్ బిలియన్ పైగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందులో 99 శాతం మంది దక్షిణాసియా దేశాల్లో ఉండటం గమన్హారం. అయితే క్రికెట్ ను విమర్శించే వాళ్లు కూడా ఉన్నారు.
అభివృద్ధి చెందిన అమెరికాలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండవ తరం క్రికెట్ పై ఎక్కువగా ఆసక్తిని చూపుచున్నారు. అందులో మిస్సోరి స్టేట్ లోని మిస్సిస్సిపి,మిస్సోరి, మెరామెక్ నదుల పరిసరాల్లో అమెరికాలో 19వ, పట్టణంగా విలసిల్లుతున్న “”సెయింట్ లూయిస్” పట్టణంలో దినదినం క్రికెట్ పై ఆదరణ పెరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా “”ధ్వని ఫౌండేషన్”” స్వచ్ఛంద సేవా సంస్థ “”ధ్వని క్రికెట్ లీగ్ (డీసీఎల్) పేర క్రికెట్ పోటీలను నిర్వహిస్తోంది.2025 ఆగస్ట్ లో నిర్వహించిన డీసీఎల్ క్రికెట్ పోటీలలో 96 పురుషుల జట్లు,8 మహిళల జట్లు,17 సంవత్సరాల వయస్సు లోపు బాలుర,బాలికల జట్లు 11 పాల్గొన్నవి.మూడు వీకెండ్ లలో జరిగిన క్రికెట్ పోటీలలో పాల్గొన్నవారు, తిలకించిన వారిలో తెలుగు అమెరికన్స్ 80 శాతం, భారత్, దక్షిణాసియా దేశాల వారు 20 శాతం ఉండటం గమన్హారం. కాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు,సాంకేతికతకు,శక్తికి,వినోదానికి కేంద్రం అయిన అమెరికాలో అమెరికన్స్ కూడా క్రికెట్ పై ఆసక్తి చూపుతారని ఆశావాహులు ఆశిస్తున్నారు.