29‌న రాష్ట్రవ్యాప్తంగా దీక్షాదివస్‌

‌తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం ఇది• బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిర్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌21:  ‌తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్‌ ‌నిలుస్తుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో జరిగే దీక్షాదివస్‌ ‌కార్యక్రమంలో కేటీఆర్‌ ‌పాల్గొననున్నారు. 2009, నవంబర్‌  29‌న కేసీఆర్‌ ‌చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదలు వేసిందని కేటీఆర్‌ ‌తెలిపారు.

దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వొచ్చుడో ? కేసీఆర్‌ ‌సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండవర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని పేర్కొన్నారు. ఈ దీక్ష యావత్‌ ‌భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *