ఏదో జరిగింది నా మనసుకు

కుదుట పడతలేదు

కుదురుగా కూర్చొనిస్తలేదు

సముద్రపు అలలు తీరాన్ని తాకిన

స్థిరంగా ఉండనట్టు

నా మనసు కుదుట పడతలేదు

కుదురుగా కూర్చొనిస్తలేదు

మారణ ఆయుధాలు ఆటంబాంబులు

గడియ గడియకు

అడుగు అడుగున పడుతుంటే

శివుడు మూడో కన్ను తెరుస్తున్నాడా

నా మనసు కుదుట పడతలేదు

కుదురుగా కూర్చొనిస్తలేదు

మూడడుగుల నేల కోసం

ముల్లోకాలను ఆక్రమించిన వామననుడిలాగా

మూడుదేశాల యుద్ధం

మూడో ప్రపంచయుద్ధంగా మారుతుందేమోనని

నా మనసు కుదుట పడతలేదు

కుదురుగా కూర్చోనిస్తలేదు

బలం ధనం సైన్యం ఉన్నదని

దేశ దేశాలను జయించి శాసిస్తానంటే

సైరేంద్రియను చరబట్టిన కీచకుడు

భీముని చేతుల్లో హతమైనాడు

దురాశ అసూయ ద్వేషాలను వదిలి

ఓర్పు సహనముతో బోధివృక్షం కింద

తపస్సు చేసిన బుద్ధుని శాంతి మార్గం

ప్రపంచమంతా విస్తరించాలి

బుద్ధభూమిగా మారాలి

పిట్ల. నర్సింలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *