డెడ్‌లైన్‌ ముగిసింది, మరి… మావోయిజం అంతమయిందా ..?

“దశాబ్దకాలంగా దేశ సంపదను దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఆదివాసి పోరాటాలు దేశ అంతర్గత భత్రదకు ముప్పని, అన్నలు సంఘ విద్రోహ శక్తులంటూ కాంగ్రెస్‌ ఆదివాసీ ముక్త్‌, మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌ను కాంగ్రెస్‌ అపరేషన్ గ్రీన్‌ హాంట్, సల్వాజుడం, సమాధాన్‌ వంటి మధ్య భారత్‌లో సొంత ప్రజలపై అర్థసైనిక మిలటరీ ఆపరేషన్‌లు మొదలుపెట్టితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆపరేషన్‌ కగార్, ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరుతో మావోయిస్ట్‌ ఉద్యమాన్ని ముగించాలని కలలు కంటుంది..”

మావోయిస్ట్‌ పార్టీ ఉద్యమ చరిత్రలో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.అనేక ఓడిదుడుకులు, గెలుపోటములు, ఎత్తిపల్లాలను సీపీఐ మావోయిస్ట్‌ పార్టీ తన దశాబ్దాల పోరాట చరిత్రలో చూసింది. మావోయిస్ట్ పార్టీ చరిత్ర ముగిసింది.దేశంలో అన్నల సాయుధ పోరటం ముగిసిందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ప్రకటించుకున్న ప్రతీసారీ ఫీనిక్స్ పక్షిలాగ మళ్లీ మళ్లీ ఉవ్వేత్తున లేస్తునే ఉంది.
అనేక త్యాగాల పునాదుల మీద మావోయిస్ట్‌ పార్టీ ప్రతీసారి పురుడు పోసుకుంటునే ఉంది. ఆకురాలు కాలం పోగానే కొత్త చిగురుతో అడవి పచ్చబడ్డట్టు ఉద్యమం వెనుకపడ్డ ప్రతీసారీ అడవితల్లి అన్నలకు పురుడు పోస్తునే ఉంది.చెట్టు చిగురించినట్లు అన్నలు ఉదయిస్తునే ఉన్నారు.సూర్యుడు ఆస్తిమిస్తూ రేపటి ఉదోయాన్ని వాగ్దానం చేసినట్లే, విత్తనం మరణిస్తు మొక్కను హామీ ఇచ్చినట్లే, విప్లవోద్యమంలో  అమరుల త్యాగాలు రేపటి నవ సమాజాన్ని వాగ్దానం చేస్తుంది.
అయితే విత్తనం మొలకెత్తడానికి, చెట్టు చిగురించడానికి స్థలకాల పరిస్థితి సహపడ్డంటే, విప్లవానికి కూడా స్థలకాల పరిస్థితి అనుకూలించాలి. అంతేకానీ భూమి సారవంతంగా లేదనో, వాతావరణం పరిగ్గా లేదనో విత్తనం మొలకెత్తకుండా, చెట్టుకు చిగురించకుండా తన సహజత్వాన్ని కోల్పోవు. సాయుధ పోరాటానికి అనుకూల వాతావరణం లేదని కొంత మంది మాజీలాగా ఆయుధ విసర్జన చేయదు.మొలకెత్తడం, చిగురించడమే విత్తనం, చెట్టు ఆయుధాలు.అది ప్రకృతి సిద్దాంతం, భౌతికవాదం. మావోయిజానికి పునాదే ప్రకృతి, భౌతికవాద సిద్దాంతం.
దేశంలో కార్పోరేట్‌ లాబింగ్‌..ప్రభుత్వంలో మల్టీనేషనల్‌ కంపెనీల  ఆధిపత్యం పెరగడంతో ప్రకృతి విధ్వంసం పెరిగింది..ప్రకృతిని ఎంత విధ్వంసం చేస్తే బడావ్యాపారుల లాభాలు అంతలా పెరుగుతాయి. అందుకే ప్రకృతిని కాపాడుతున్న ప్రజలను,వారికి పోరాటానికి మద్దతుగా ఉంటున్న మావోయిస్ట్‌ పార్టీని నిర్మూలించే చర్యలు ప్రభుత్వాలు చేపట్టుతున్నాయి. సంక్షేమ పాలనకు పాలకులు తిలొదకాలిచ్చారు. దోపీడి ఎజెండాకు ప్రధాన్యత ఇస్తున్నారు.
దశాబ్దకాలంగా దేశ సంపదను దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఆదివాసి పోరాటాలు దేశ అంతర్గత భత్రదకు ముప్పని, అన్నలు సంఘ విద్రోహ శక్తులంటూ కాంగ్రెస్‌ ఆదివాసీ ముక్త్‌, మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌ను కాంగ్రెస్‌ అపరేషన్ గ్రీన్‌ హాంట్, సల్వాజుడం, సమాధాన్‌ వంటి మధ్య భారత్‌లో సొంత ప్రజలపై అర్థసైనిక మిలటరీ ఆపరేషన్‌లు మొదలుపెట్టితే  ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న   బీజేపీ ఆపరేషన్‌ కగార్, ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరుతో మావోయిస్ట్‌ ఉద్యమాన్ని ముగించాలని కలలు కంటుంది.
అయితే పాలకుల కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి..నాటి నేటి బీజేపీ వరకూ వారి లక్ష్యం నెరవేరలేదు.గత పుష్కరకాలంగా మోదీ  ప్రభుత్వం దండకారణ్యంలో అర్థ సైన్యంతో సొంత పౌరులపై తూటాల వర్షం కురిపిస్తుంది.పచ్చటి అడవిలో రక్తపాతం పారిస్తూ మారణహోం సృష్టిస్తుంది. వీలైనంత త్వరగా విలువైన భూములు, వనరులు బడా కార్పొరేట్‌ కంపెనీలకు ధారదత్తం చేసేందుకు ఏకంగా దేశ ప్రజలపై యుద్దం ప్రకటించింది. ఆకాశమార్గాన బాంబుల వర్షం కురిపిస్తూ, భూమార్గంలో దండయాత్ర చేస్తూ కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎగరవేశామని నిసిగ్గుగా ప్రభుత్వం ప్రకటించుకుంటుంది. సొంత దేశంలో సొంత ప్రజలను అణచివేసి,ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేసి జాతీయ జెండాలను ఎగరవేగం బహుష ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిది కావచ్చు.
సరే అవన్ని మావోయిస్ట్‌ ఉద్యమాన్ని బలహీనర్చే ప్రభుత్వం అమలు చేస్తున్న మానసిక సైద్దాంతిక వ్యూహాలు కావచ్చు.అయితే దశాబ్దకాలంగా బీజేపీ అటు కాంగ్రెస్‌ సహా ప్రాంతీయ పార్టీల ముక్త్‌ భారత్‌ కోసం రాజకీయ వ్యూహాలు అమలు చేస్తునే మరోవైపు మావోయిస్ట్ ముక్త్‌ భారత్ ఎజెండాను అమలు చేస్తుంది. అవసరమైన రాజకీయ పార్టీల నేతలపై అర్బన్‌ నక్సలైట్ల ముద్ర వేయడంలో బీజేపీ వెనుకాడటం లేదు.రాహుల్‌ గాంధీనిపై కూడా అర్బన్‌ నక్సలైట్‌ అన్న ముద్ర వేసిన చరిత్ర బీజేపీది.
పదేళ్లుగా బీజేపీ మావోయిస్ట్‌ రహిత భారత్‌ కోసం అనేక వ్యూహాలు అమలు చేస్తుంది. అర్ట సైనిక అపరేషన్లతో పాటు మాజీ నక్సలైట్లతో, అరెస్ట్‌ అయ్యిన అన్నల కోవర్ట్ అపరేషన్లు కూడా చేస్తుంది..వాస్తవానికి అర్థసైనిక ఆపరేషన్లతో ప్రభుత్వం విఫలమయ్యాయి.గ్రీన్‌ హాంట్‌ నుంచి కగార్‌ వరకూ కేంద్రం అమలు చేసిన సైనిక అపరేషన్లు మావోయిస్ట్ పార్టీ సక్సెస్‌ ఫుల్‌గా తిప్పికొట్టింది.ఒక రకంగా ఈ పోలీస్ ఆపరేషన్లలో మావోయిస్ట్‌ పార్టీ పై చేయి సాధించి ఆధిపత్యాన్ని సాధించింది.
అయితే కోవర్ట్ అపరేషన్లను అంచవేయడంలో,పార్టీలో ఉంటూ రాజ్యానికి రహస్యాలు చేరవేసే వారిని గుర్తించి వ్యూహాలు అమలు చేయడంలో మావోయిస్ట్ పార్టీ విఫలమైంది.అపరేషన్‌ కగార్‌ అనేకది ఒక్క సైనిక ఆపరేషన్‌ మాత్రమే కాదు, అది కోవర్ట్‌ అపరేషన్‌ కూడా. అందుకే గతంలో కేంద్రం తీసుకువచ్చిన అన్నీ అపరేషన్లను తిప్పికొట్టిన మావోయిస్ట్ పార్టీ కగార్‌ను ఎదుర్కొలేకపోయింది.
కగార్‌ పేరుతో డెడ్‌ లైన్‌ పెట్టి మరీ కేంద్రం మావోయిస్ట్‌ ఉద్యమాన్ని అణచివేసింది..ఉద్యమ ద్రోహులు, కోవర్ట్‌ల అండతో అనేక మంది ఉద్యమకారులను రాజ్యం ఎన్‌కౌంటర్‌ల పేరుతో హత్య చేసింది. మాజీలుగా మారిన నాజీల మద్దతుతో మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్‌ ఉద్యమాన్ని ముగిస్తామని, మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌గా ప్రకటిస్తామని మోదీ  ప్రభుత్వం ప్రకటనలు జారీచేసింది.
అయితే ఇందులో ప్రభుత్వం కొత్త సక్సెస్‌ అయింది..మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోల్పోవల్సి వచ్చింది..పార్టీ చిల్లరగత్తర అయింది. సమిష్టి నిర్ణయాలకు, సమిష్టి పోరాటాల ఎత్తుగడు, వ్యూహాలు అమలు చేసే అవకాశాలు లేకుండా పార్టీ చెల్లచెదురైంది.అయితే ఇదంతా అపరేషన్‌ కగార్‌తోనే కేంద్రం సక్సెస్‌ కాలేదు.మాజీలు,ఉద్యమ ద్రోహుల సహకారంతో సక్సెస్‌ అయింది.అయితే ఇన్నీ రోజులు కేంద్రం ప్రకటించుకున్న లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు.డెడ్‌ లైన్‌ పెట్టుకుని మారణహోమం సృష్టించిన కేంద్రం తన లక్ష్యాల్ని చేరుకోలేదు.
దాదాపు రెండెళ్లుగా కగార్‌ పేరుతో మావోయిస్ట్ ఉద్యమాన్ని లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటిస్తుంది..మార్చి 31 డెడ్‌ లైన్‌ కూడా ప్రకటించింది.వాయు,సైనిక మార్గాలతో మావోయిస్ట్‌పై ప్రత్యేక్ష యుద్దాన్ని కేంద్రం ప్రకటించింది.మార్చి 31 లోపు ఉద్యమాన్ని నిర్మూలించి మావోయిస్ట ముక్త్‌ భారత్‌గా ప్రకటిస్తామని అమిత్ షా, మోదీ  పదేపదే ప్రకటించారు.
అయితే కేంద్రం వ్యూహాలన్నీ విఫలమయ్యాయి.మావోయిస్ట్ నాయకత్వాన్ని హత్య చేయడమో, కొంత మందిని లొంగదీసుకుని కోవర్ట్‌గా మార్చుకోవడమో ,ఇంకొంత మందిని ద్రోహులను చేరదీయడంలో కేంద్రం సక్సెస్‌ అయింది. ఉద్యమానికి తీవ్ర నష్టం చేసింది..పోరాటం వెనుకడుగుపడేలా చేసింది..అంతేకానీ మావోయిస్ట్‌ ముక్త్ భారత్‌ టార్గెట్‌ను కేంద్రం రీచ్‌ కాలేదు.
డేట్స్‌ పెట్టి ఎన్‌కౌంటర్‌లు చేసింది.ద్రోహులించిన సమాచారంలో అగ్రనేతలను కేంద్రం చంపింది..ఏ నేతను ఎప్పుడు చంపుతామో ముందే ప్రకటించింది.మార్చి 31లోపే దేశంలో మావోయిస్ట్‌లు లేకుండా చేస్తామని ప్రకటించింది.
కానీ ప్రభుత్వాల ఎత్తులన్నీ చిత్తయ్యాయి..మోదీ  షాలు పెట్టుకున్న డెడ్‌ లైన్‌ ముగిసింది..నిజానికి మావోయిస్ట్‌ ఉద్యమాన్ని అంతం చేయడం అంత ఈజీకాదని కేంద్రానికి తెలుసు, కేంద్రం డెడ్‌లైన్‌ అనేది  ఉద్యమాన్ని మానసికంగా బలహీన పర్చే కుట్రలని ప్రజలకు తెలుసు.అయితే రాజ్యం చాలా బలమైంది..అత్యాధునిక ఆయుధాలు టెక్నాలజీ ఉంది..రాజ్యం బలం ముందు మావోయిస్ట్ పార్టీ బలం చాలా తక్కువ..కానీ ప్రజా మద్దతుతో పాటు, సిద్దాంత బలం మావోయిస్ట్‌ పార్టీకి ఉంది.
అందుకే కేంద్రం డెడ్‌లైన్‌ పెట్టిన, అగ్రనేతలను కోవర్ట్‌లుగా, ఉద్యమ ద్రోహులుగా మార్చుకున్న ప్రజా బలం ముందు, సైద్దాంతిక బలం ముందు రాజ్యం ఓడిపోయింది..నష్టాలు జరగలేదని కాదు, గతంలో కంటే ఎక్కువ నష్టం జరుగింది. అగ్రనేతలను కోల్పోయింది. గద్దలా అపరేషన్‌ కగార్‌తో కేంద్రం దాడి చేస్తుంటే, కొడిపిల్లలా ఉద్యమం చెల్లచెదురైంది.  తేదీలు పెట్టి మావోయిస్ట్‌ ఉద్యమం లేకుండా చేస్తామని విర్రవీగినా కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా భయంతో మావోయిస్ట్‌లు లొంగిపోవాలి విజ్ఞప్తి చేశారు.కగార్‌ ప్రారంభించిన తర్వాత మావోయిస్ట్ ముక్త్‌ భారత్‌ అంటూ మార్చి 31 డెడ్‌లైన్‌ పెట్టుకుని గంభీరంగా ప్రకటించిన కేంద్రం ఇప్పుడు వణుకుతున్న గొంతులో పార్లమెంట్‌లో ప్రకటనలు చేసింది. మావోయిస్ట్‌ ఉద్యమం లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించకుండా మావోయిస్ట్‌ పార్టీని అంతం చేయడం సాధ్యం కాదని కేంద్రానికి తెలిసోచ్చింది.అందుకు పార్లమెంట్‌లో మావోయిస్ట్‌ ఉద్యమం ముగిసిందని చెప్పే సాహసం అమిత్‌ షా చేయలేకపోయాడు.
మావోయిస్ట్‌ పార్టీ అనేక ఒడిదోడుకులు ఎత్తుపల్లాలను అధికమిస్తూ  త్యాగాలు చేస్తూనే ఓటమి, జయాపజయాలను, విమర్శలను స్వాగతిస్తూ ఆత్మ విమర్శలు చేసుకుంటూ, సమీక్షించుకుంటూ ముందుకు సాగడం. వరుస ఎదురుదెబ్బలను అధికమిస్తూనే సుదీర్ఘకాలం పాటు అద్భుతమైన పోరాటాన్ని మావోయిస్ట్‌ పార్టీ కొనసాగిస్తుంది.
ఇవాళ అగ్రనేతలను పార్టీ కోల్పోయిన, సీనియర్లు లొంగిపోయిన పార్టీ ప్రజల్లో బలంగానే ఉంది.లొంగిపోయిన మాజీలు చెప్పేదానికి భిన్నంగా ప్రజా మద్దతు ఉందని చెప్పడానికి ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌ లైన్‌ విఫలం కావడమే ఉదాహరణ..కేంద్రం పెట్టుకున్న డెడ్‌ లైన్‌ ముగిసింది కానీ మావోయిస్ట్ పార్టీ ఉద్యమం ఆగలేదు. ఇప్పటి దండకారణ్యంలో ఉద్యమం సజీవ నదిలా సాగుతుంది.ఇంకా చాలా మంది అజ్ఞాతంతో ఉన్నారు. కనీసం వారిని పట్టుకునే అవకాశం కూడా కేంద్రానికి కనిపించడం లేదు.
మరోవైపు కేంద్రం డెడ్‌ లైన్‌ ముగిసిన మావోయిస్ట్ పార్టీ ఇంకా సజీవంగా ఉండటంతో ఆ పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సహం వస్తుంది.డెడ్‌ లైన్‌ పెట్టిన కూడా ఏమీ చేయలేకపోయిందనే ధైర్యం పెరుగుతుంది.లొంగిపోయిన మాజీలు చెప్పేవన్నీ అబద్దాలని ఇప్పటికి అజ్ఞానంలో ఉన్న క్యాడర్‌లో కొత్త జవసత్వాలను ఇస్తుంది. మార్చి 31 డెడ్‌ లైన్‌  రోజు ఏం జరుగుతుందో.కేంద్రం ఏం ప్రకటిస్తుందో అని విప్లవ శిబిరాలు, మావోయిస్ట్ సానుభూతిపరుల్లో ఉత్కంఠతో పాటు ఆందోళనలు కూడా వ్యక్తం చేశారు. అయితే కేంద్రం పెట్టిన డెడ్‌ లైన్‌ ను మావోయిస్ట్‌ పార్టీ బద్దలు కొట్టిందని ఇది ఆ పార్టీ విజయమంటున్నారు.మావోయిస్ట్‌ పార్టికి కగార్‌ వంటి ఆపరేషన్లు తాత్కాలిక బ్రేక్‌నిస్తాయిన తప్ప అంతం చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి డెడ్ లైన్ ముగియడంతో మావోయిస్ట్‌ క్యాడర్‌కు విప్లవ శిబిరాలకు, సానుభూతి పరులు కొండంత ధైర్యం వచ్చినట్లైంది.
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *