కులగణనపై విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి

  • పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకున్నాం
  • పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చించాం
  • ఈ నెలలోనే రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం
  • టీపిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి6:  కులగణనపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వాటిని తిప్‌ఇకొట్టాలని కాంగ్రెస్‌ ‌నిర్ణయించిందని పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించామని అన్నారు. పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చించాం. రాష్ట్ర ఆదాయం, అప్పులు, వ్యయంపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా వివరించాం. ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం. బహిరంగ సభలకు అధిష్ఠానం నేతలను ఆహ్వానించేందుకే దిల్లీ వెళ్తున్నాం. ఎమ్మెల్యేలు డిన్నర్‌ ‌సమావేశాలు నిర్వహించుకోవటం తప్పే కాదని కూడా అన్నారు. సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ‌డియాతో మాట్లాడారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్‌ అం‌శాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాం.

సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా వారి అభిప్రాయాలు చెప్పారు. పథకాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. సుమారు మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించామని అన్నారు. ఈ క్రమంలో సమావేశంలో చర్చించిన అంశాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. .స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన చేపట్టామని… రాహుల్‌ ‌గాంధీ ఆశయం మేరకు పరిపూర్ణంగా సర్వే చేసి ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో తేల్చామని అన్నారు. వాస్తవాలు తెలియక బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

చాలా అంశాలపై సీఎల్పీ సమావేశం జరిగిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చారని అన్నారు. సూర్యాపేటలో కులగణన జరిగిన తీరుపై బహిరంగ సభ నిర్వహించ నున్నామని, ఈ సభకు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించటానికి దిల్లీ వెళ్తున్నామని అన్నారు. ఈ సమావేశం ద్వారా ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేశామని అన్నారు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకే కేటిఆర్‌ ‌దిల్లీ వెళ్లారని మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *