భవన నిర్మాణ నిబంధనలు పూర్తిగా పాటించాలి…
పార్కింగ్, ఫైర్‌స్టేషన్, ఎస్టీపీ, హెలీ అంబులెన్స్ సౌకర్యాలు ఉండాలి
అంబులెన్స్‌లు… ఫైర్ ఇంజిన్ సులువుగా రాకపోకలు సాగించాలి..
మార్చురీ, బాడీ ఫ్రీజింగ్‌లోనూ ఆధునిక పద్ధతులు పాటించాలి
ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ నెల 31న దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన…
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 25 : రానున్న వందేళ్ల అవస రాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా హాస్పిటల్ ను నిర్మించాలని ముఖ్యమంత్రి
రేవ ంత్ రెడ్డి ఆకాంక్షించారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడొద్దని ఆయన అధికారులకు సూచించారు. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో దవాఖన నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా హాస్పిటల్ భవన నిర్మాణాలతో పాటు బోధన సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినులకు వేర్వురుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ పూర్తి నిబంధనలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హాస్పిటల్ భవన నిర్మాణాలు, పార్కింగ్, ల్యాండ్ స్కేప్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు.

హాస్పిటల్ కు రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని… అవసరమైనచోట ఇతర మార్గాలను కలిపేలా అండర్‌పాస్‌లు నిర్మించాలని సీఎం సూచించారు. హాస్పిటల్ కి వొచ్చే రోగులు, సహాయకులు, పరామర్శకు వొచ్చే వారి వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలన్నారు. డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటిన్, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడుతుండడంతో వారు వొచ్చేందుకు రెండు మూడు రోజులు పడుతోందని.. అప్పటి వరకు మృతదేహాలను భద్రపర్చేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు.
అవయవాల మార్పిడి.. అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. హాస్పిటల్ లో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలని… హాస్పిటల్ కి వొచ్చామనే భావన ఉండకూడదని సీఎం సూచించారు. హాస్పిటల్ భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.