“జిల్లాల కుదింపు ఆలోచన సమస్యల తేనె తుట్టేను కదిలించినట్లే అవుతుంది. అంతేకాదు అన్నిటికిమించి హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయాలన్న కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టాలి. లేకపోతే ఏ హైదరాబాద్ ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం రగులుకుందో ఇప్పుడు హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేస్తే రాష్ట్రం మరోసారి భగ్గుమంటుంది. నాటి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైతే, ఇప్పుడు మళ్లీ నిప్పుతో చెలగాటం ఆడితే పోరాటం మరో రూపం దాల్చి అది ఏటు వైపు అయిన దారి తీయవచ్చు.”
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాల పునాదుల మీద పురుడు పోసుకుంది.వచ్చిన తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికి అందేకు పదేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది..ఒకవైపు కొత్తగా ఏర్పాడిన రాష్ట్రం, మరోవైపు సమైక్యవాదుల కుట్రల మధ్య తెలంగాణ దశాబ్ద కాలంగా సాగుతోంది. కేంద్రం, సీమాంధ్రుల కుట్రలు ఛేదిస్తూ పదేళ్లు రాష్ట్రం ధిక్కారస్వరమై నిలిచింది. మన ఉద్యోగాలు మన యువతకు వచ్చేలా చట్ట సవరణలు చేసుకుని కొత్త చట్టాలను చేసుకున్నాం. పాలన వికేంద్రీకరణ , ప్రణాళికలతో అభివృద్దిని అన్ని జిల్లాలకు విస్తరించుకున్నాం. అభివృద్ది మొత్తం హైదరాబాద్ చుట్టే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించుకున్నాం.
ఇందులో భాగంగానే పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలకు పెంచుకున్నాం. పాలన సౌలభ్యం కోసం, ప్రభుత్వం ప్రజల వద్దకే చేరువయ్యేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది.ప్రజల సమస్యలు జిల్లా మండల కేంద్రాల్లోనే పరిష్కారం దొరికేలా ప్రతి జిల్లాకు కొత్త కలెక్టరేట్‌లును నిర్మించింది. అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఒకే చోట ఉండేలా సమీకృత కలెక్టరేట్లను బీఆర్ఎస్ నిర్మించింది. .కొత్త రాష్ట్రంలో అభివృద్దితో పాటు ఉద్యోగాల కల్పనకు బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా పునర్విభజన చేసింది..10 జిల్లాలను 33 జిల్లాలు చేసింది.దీంతో ప్రతి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది.కలెక్టర్ నుంచి క్లర్క్ వరకూ, ఐపీఎస్ నుంచి హోంగార్డ్ వరకూ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగింది.
అంతేకాదు జిల్లాలు పెరగడంతో పాలన ప్రజలకు చెంతకు చేరడమే కాదు, పాలన సౌలభ్యం పెరిగింది..జిల్లాలో ప్రభుత్వ ఆఫీస్‌లకు తోడు స్వయం ఉపాధి రంగాలు పెరిగాయి..కలెక్టరేట్ల చుట్టూ అనేక వేల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది..సర్వీస్ సెక్టార్‌లో ఉపాధి పెరిగింది.ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ, గురుకులాలు పెరిగాయి, అందులో వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలే ఏర్పాటు చేయడంతో ఫార్మా రంగంలో లక్షల ఉద్యోగాలు యుతవకు వచ్చాయి.
అయితే, బీఆర్ఎస్, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న దురుద్దేశ్యంతో నేడు రేవంత్ రెడ్డి జిల్లాలను కుదించే కుట్రలు చేస్తుంది.జిల్లాలుంటే జిల్లాలో కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లు రేవంత్ రెడ్డిని నిత్యం ఎక్కిరిస్తాయి.అందుకే వాటిని లేకుండా చేయడమో, లేదా నిరూపయోగం మార్చడమో చేయాలన్న కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేసే ప్రయత్నంలో ఏపీ జల దోపిడికీ కాంగ్రెస్ సహకరిస్తూ మన నీళ్లకు వాళ్లకు దోచిపెట్టుతున్నారు..కేసీఆర్ కట్టిన కట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారు..చివరికి జిల్లాల విభజనతో సృష్టించిన ఉద్యోగాలను కూడా తొలగించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది.ప్రాజెక్ట్‌లు పడావు పెట్టి రైతుల పొట్ట కొట్టిన రేవంత్ రెడ్డి, జిల్లాల కుదింపులో నిరుద్యోగుల పొట్టేకుట్రలు చేస్తున్నారు..నిధులు ఎలాగూ దిల్లీకి వరదలా పారుతున్నాయి.
జిల్లాల కుదింపుతో నిరుద్యోగులకు రేవంత్ మరో ధోకా చేస్తున్నారు. రెండేళ్లైనా రెండు లక్షల ఉద్యోగాలు ఎలాగు ఇవ్వలేదు..భవిష్యత్తులో కూడా ఇస్తారన్న నమ్మకం లేదు.ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదని ప్రకటించారు. అంతేకాదు ఉద్యోగులు రిటైర్‌మెంట్ అయితే వారికి బెఫిట్ ఇవ్వాల్సి వస్తుందని వారి వయోపరిమితి 64కు పెంచింది..దీంతో ఉద్యోగులు రిటరైమెంట్ మరో మూడేళ్లు కారు, ప్రభుత్వ శాఖల్లో ఖాలీలు ఏర్పడవు, కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కాంగ్రెస్ వ్యూహం. విచారణలు, ఎంక్వైరీల పేరుతో ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసినట్లే, ఇప్పుడు జిల్లాల కుదింపు పేరుతో ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తిపలికే కుట్రలు చేస్తుంది..జిల్లాల కుదింపు వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతాయి..ఉన్నవారినే వివిధ శాఖల్లో అడ్జెస్ట్ చేసి కొత్త నోటిఫికేషన్లకు మంగళం పాడే కుట్రలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. జిల్లాల కుదింపు వల్ల కొత్త ఉద్యోగాలు రాకపోగా, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఊడుతాయి. ఇది నిరుద్యోగులకు, తాత్కాలిక ఉద్యోగులకు అన్యాయం చేయడమే అవుతుంది.కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయినట్లైంది.
గత ప్రభుత్వం ఆనవాళ్లు తొలగించే కుట్రలో భాగంగానే జిల్లాలను కుదిస్తూ ఉద్యోగాల భర్తీని మరింత కాలం వాయిదా వేసేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం మొదలు పెట్టింది.నిజానికీ జిల్లాల కుదింపు వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం మిగులుతుంది, కానీ నిరుద్యోగం పెరుగుతుంది. అసలు జిల్లాలను కుదించాల్సిన అవసరం లేదు.ఎందుకు కుదించాల్సి వస్తుందో ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.శాస్త్రీయ అధ్యాయనం లేదు..కేవలం కేసీఆర్ బీఆర్ఎస్ మీద కోపం, రేవంత్ రెడ్డి ఈగో ఒక్కటే కారణం.తన ఈగోను తన అక్కసును జిల్లాల ప్రజలపై నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన వెనుక కేసీఆర్ దీర్ఘ దృష్టి ఉంది..పాలన సౌలభ్యం ఒక్కటే కాదు, స్థానికులకు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగుల ప్రయోజనాలు ఉన్నాయి..ఏ ఉద్యోగాల కోసం తెలంగాణ యువత కొట్లాడిందో ఆ యువతకు ఉద్యోగా ఫలాలందేందుకు కేసీఆర్ జిల్లాల పునర్విభజను చేపట్టారు. జిల్లాలను పెంచడం, తగ్గించడం అంత సులువైన పని కాదు, ఒక్క కలం పోటుతో చేయడం అసాధ్యం..దాని కోసం అనేక శాస్త్రీయ విధానాలు అవసరం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్ట సవరణలు అవసరం..రాష్ట్రపతి అమోదం అవసరం..కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనుకున్నంత ఈజీ కాదు.
.గతంలో ఈ సవాళ్లన్నిటీని కేసీఆర్ అధికమించి జిల్లాల విభజన చేశారు..జిల్లాల సంఖ్య పెంచడమే కాదు, స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జోనల్ వ్యవస్థను తీసుకువచ్చారు..దీంతో స్థానికులకే ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చే అకాశం కల్పించారు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఒకే విధంగా అభివృద్ది చెందలేదు.విద్య ఉపాధి మౌలిక వసతులు కల్పలన తేడాలు వివక్షను చూపించడం వల్ల కొన్న ప్రాంతాలు అభివృద్ది చెందితే మరి కొన్ని ప్రాంతీలు వెనుకబాటును అనుభవించాయి. ఏజేన్సీ ప్రాంతం యువత మైదాన ప్రాంతంవారిలో పోటీ పడలేరు..గ్రామీణ యువత పట్టణ యువతతో పోటీపడలేదు. దీంతో అన్ని జిల్లాల నిరుద్యోగులు ఇతర జిల్లాల్లో ఉద్యోగాల కోసం పోటీ పడటంలో వెనుబడ్డారు. ఉద్యోగాలు స్థానికులకు కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు పొందారు..దీంతో స్థానికుల అన్యాయం జరిగింది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ జిల్లాల పెంపుతో పాటు స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగాలు దక్కేలా జోనల్ వ్యవస్థను కేసీఆర్ కేంద్రంతో కొట్లాడి సాధించారు.
ఇప్పుడు జిల్లాల కుదింపు వల్ల మళ్లీ ఉద్యోగాల భర్తీ మొదటికి వస్తుంది. జోనల్ వ్యవస్థ మారుతుంది.కొత్త జోనల్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వానికి రెండేళ్లకు పైగా టైం పడుతుంది..కేంద్రం అనుమతి, రాష్ట్రపతి ఆమోదం రావాలంటే మూడేళ్లు పట్టిన ఆశ్చర్యం లేదు.జిల్లాల కుదింపుతో వచ్చే మూడేళ్లు ఉద్యోగాల భర్తీ లేనట్లే..కొత్త నోటిఫికేషనట్లు లేనట్లే, ఒకవేళ ఇచ్చిన అవి న్యాయస్థానంలో నిలువవు, నిలిచిన అది స్థానికులను అన్యాయం జరుగుతుంది. జోనల్ వ్యవస్థ రద్దుతో స్థానికులు ఉద్యోగ హక్కును కోల్పోతారు. ఉన్న ఉద్యోగులకు డిమోషన్లు తప్ప ప్రమోషన్లు ఉండవు. ఉద్యోగుల సర్థుబాటు సవాల్ గా మారుతుంది.
జిల్లాల కుదింపుతో కొత్త ఉద్యోగాలు రాకపోక ఉన్న ఉద్యోగాలు ఊడుతాయి.ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పోతాయి. ఇప్పటికే రాష్ట్రంలో కుదేలైన రియల్ ఎస్టేట్ మరింత పడిపోతుంది. సర్వీస్ సెక్టార్ తలకిందులైతుంది. జిల్లాల కుదింపు వల్ల జిల్లా హెడ్ క్వార్టర్ మారడం వల్ల అతిథ్య రంగం కుదేలైతుంది. ఇప్పటికే పూర్తైన మౌళిక సదుపాయాలు నిరుపయోగమౌతాయి. అంతేకాదు జోనల్ వ్యవస్థ రద్దైతే మెడికల్ సీట్లలో, ఇంజనీరింగ్ సీట్లలో వృత్తి విద్య కోర్స్‌ల్లో స్థానికులకు అన్యాయం జరుగుతుంది. జిల్లాలు కుదిస్తే కేంద్రం ఇచ్చే మెడికల్ సీట్లు తగ్గుతాయి.
మరోవైపు జిల్లాల కుదింపు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి భారీ కుట్రలకు తెర తీసే ప్రయత్నం చేస్తున్నారు..జిల్లాల కుదింపుతో జోనల్ వ్యవస్థ రద్దైతుంది.కొత్త జోనల్ వ్యవస్థను రేవంత్ సాధిస్తారన్న నమ్మకం లేదు. అంతేకాదు, ఇప్పటికే ఏపీకి సర్వం దోచిపి పెడుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లాల కుదింపుతో హైదరాబాద్‌పై భారీ కుట్రలు చేస్తున్నారు. ఒకవైపు జిల్లాలు కుదించి స్థానికులకు ద్రోహం చేస్తూ మరోవైపు హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి హైదరాబాద్ ఆధిపత్యం కోసం సీమాంధ్రులు అనేక కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం నిండా సీమాంధ్ర ఉద్యోగులే నిండిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం సీమాంధ్రులకు కట్టబెట్టే కుట్రలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు.ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన తర్వాత కేంద్రం పాలిత ప్రాంతంగా మార్చేందుకు, లేదా మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా గడువు పొగించుకునేందుకు చంద్రబాబు కేంద్రం అనేక ప్రయత్నాలు చేశారు.
ఉద్యోగుల విషయంలో కాదు, రాజకీయంగా స్థానికులకు అన్యాయం జరుగుతుంది. జిల్లా కుదింపుతో రాజకీయ పార్టీల పదవులు తగ్గుతాయి..జిల్లాలు కుదిస్తే మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా మార్చాల్సి ఉంటుంది..అవసరం అయితే వాటిని కూడా కుదించాల్సి వస్తుంది..దీంతో ప్రజల జీవితాల్లో గందరగోళం ఏర్పడుతుంది..పాలన వ్యవస్థ అస్థ వ్యవస్థం అవుతుంది. జిల్లాల కుదింపు ఆలోచన సమస్యల తేనె తుట్టేను కదిలించినట్లే అవుతుంది. అంతేకాదు అన్నిటికిమించి హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయాలన్న కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టాలి. లేకపోతే ఏ హైదరాబాద్ ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం రగులుకుందో ఇప్పుడు హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేస్తే రాష్ట్రం మరోసారి భగ్గుమంటుంది. నాటి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైతే, ఇప్పుడు మళ్లీ నిప్పుతో చెలగాటం ఆడితే పోరాటం మరో రూపం దాల్చి అది ఏటు వైపు అయిన దారి తీయవచ్చు.
రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడు జిల్లాల కుదింపుతో జోనల్ వ్యవస్థను రద్దు చేసి హైదరాబాద్‌ను ఫ్రీజోన్ చేయాలన్న సర్కార్ ఆలోచనలపై తెలంగాణ సమాజం మరింత లోతుగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి..లేకపోతే ఇప్పటికే నీళ్లు దోపిడీ జరుగుతుంది. నిధులు హస్తినాకు పోతున్నాయి..రేపు హైదరాబాద్‌ను ఫ్రీజోన్ చేస్తే ఉద్యోగాలు కూడా సీమాంధ్రకు తరిలిపోయే ప్రమాదముంది. ఏమరాపాటుతో కాకుంగా అప్రమత్తంగా ఉంటు రాష్ట్రాన్ని, ఉద్యోగాలను కాపాడుకోవాలి..!
-తోటకూర రమేష్





