“గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన గ్రామ సర్పంచ్ లు బిల్లులను ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉంచారు. వడ్డీ చక్రబంధంలో ఇరుక్కొని కొందరు సర్పంచ్ లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించుకోవడం వలన కేంద్రం నుండి వచ్చే గ్రామాభివృద్ధి నిదులు రావడంలేదు..ఇక కోట్లాది రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది.ఈ విపత్తు నుండి తప్పించుకోడానికి రిటైర్మెంట్ వయస్సు మరికాస్త పెంచే యోచన ప్రభుత్వం చేస్తుంది. పెరిగిన కరువుభత్యం చెల్లింపు విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన సాచివేత వైఖరితోనే ఈ ప్రభుత్వం అనుసరిస్తోంది. సహజసిద్దంగా ఉద్యోగులకు అందవలసిన వేతనాలు నెల మొదటి తేదీన ఇచ్చి అదే పెద్ద సంస్కరణ గా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.”

సెల్:9441864514,
ఇమెయిల్: thirmal.1960@gmail.com
గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి.రాష్ట్రస్థాయి రాజకీయాల ప్రభావం స్థానిక సంస్థల పై ఉండకపోయినా, ఎంతోకొంత ప్రభుత్వ పధకాల ప్రబావం ఎన్నికల్లో పనిచేస్తుంది.గత ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పధకాలను ప్రవేశపెట్టడం మే కానీ,వాటి అమలు విషయం కు వచ్చేవరకు కేవలం ప్రచారం ఆర్భాటం చేసినంత గా ఆచరణ ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన అనేక వాగ్దానాలు ఆచరణకు నోచుకోవడం లేదు. అరకొర పధకాలను అమలు చేసినా అవి తుదకంటా అమలు జరగడం లేదు.
ముఖ్యంగా తెలంగాణా ఉద్యమం తల ఎత్తింది నిధులు, నీళ్ళు, నియామకాల విషయంలోనే అనే విషయం దృష్టి లో పెట్టుకుంటే ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగ యువత అసంత్రృప్తి గా ఉంది. సాఫ్ట్ వేర్ రంగం,విదేశీ ఉద్యోగాలు వైపు ఎదురు చూసిన తెలంగాణా యువత కు అవి అంత ఇప్పుడు ఆశాజనకంగా లేవు.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జనాలను ఊరించడంలో అందెవేసిన చెయ్యి! నిన్నటిదాకా “రాజీవ్ యువ వికాసం”గురించి చెప్పిన మాట చెప్పకుండా రెండు నెలలు చెప్పారు.తీరా ఆ పధకం ఏ తీరాలకు చేరిందో తెలియదు? ఇప్పుడు మహిళలను లక్షాధికారులను చేస్తామని అంటున్నారు..అది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తూందో తెలియదు? మాటలంత తీయగా పధకాల అమలు ఉండడంలేదు..!
ఇక తెలంగాణా రాష్ట్రం లో ఖాలీ అయిన ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా నోటిఫికేషన్లు రావడం లేదు.యూనివర్సిటీ, కళాశాల నుండి బయటకు వచ్చిన యువత దిక్కుతోచని స్థితిలో ఉంది. విదేశాలవైపు చూడాలన్నా ప్రస్తుతం పరిస్థితి ఎక్కడా ఆశాజనకంగా లేదు.. నిరుద్యోగుల అసంత్రృప్తిని చల్లార్చడానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనంగా “రాజీవ్ యువ వికాసం”అనబడే స్వయం ఉపాధి పధకం ముందుకు తెచ్చి హడావిడి చేశారు.ఈ పధకం క్రింద సుమారు 16లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే, రాష్ట్రం లో ఎంత నిరుద్యోగిత ఉందో అర్థం అవుతుంది.. ఈపధకం పై మంత్రులు రోజుకో నిబంధన ముందుకు తెచ్చి పూటకో ప్రకటన చేశారు. చివరకు ఆపధకం ఊసే ఎత్తడం లేదు? ఇక ఖమ్మం సభలో రాజీవ్ గాంధీతో నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి, కళాశాల యువతులకు లు స్కూటీలు ఇస్తామని వాగ్ధానం చేయించారు.ఇప్పుడు వీటి గురించి ప్రస్థావనే కరువైంది! ఇంకా డ్రగ్స్ నిరోధం కొరకు కృషి చేస్తున్న ప్రభుత్వం నేడు గ్రామాల్లో విచ్చల విడిగా ఏర్పడిన బెల్టుషాపులు పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూంంది. కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్త లకు నామినేటెడ్ పోస్టులు పంపిణీ లో చూపే ఆత్రుత,శ్రద్ద నిరుద్యోగులు,ప్రజలు విషయంలో కరువైంది.
ఇక నిధులు పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణా రాష్ట్రం లో వివాదస్పద,కాలుష్య కారకమైన ప్రాజెక్టుల విషయంలో ఆయా ప్రాంతాల రైతులు జైళ్ళు, నిర్బంధం ను సైతం ధిక్కరించి ప్రతిఘటిస్తున్నారు.కాంగ్రస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని చాలెంజ్ గా ప్రకటించింది. తీరా అమలు విషయంలోకొచ్చే సరికి కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ప్రభుత్వ ఉత్తర్వులలో అనేక అడ్డంకులను పెట్టి 30వేల కోట్లు రుణమాఫీ ని 20వేల కోట్లకు కుదించడం వలన 30శాతం రైతులకు రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ జరగని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆశలు పెట్టుకోవడం మూలంగా రుణమాఫీ కాకపోగా అప్పులు, అపరాధ వడ్డీలతో కలిసి మోయలేని భారం ఈ మిగిలిన రైతులపై పడింది.కనీసం రుణమాఫీ కాని రైతుల విషయంలో నూటికి నూరు శాతం రుణమాఫీ చేయడం గానీ,కనీసం వడ్డీమాపీతో వన్ టైం సెటిల్మెంట్ అయినా ఇవ్వడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న కనీస బాధ్యత. ఇకపోతే రబీ సీజన్లో రైతు భరోసా కూడా మూడున్నర ఎకరాల రైతులవారికే పూర్తి చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అయినా రైతులకు యూరియా కొరత రాష్ట్రం లోశాపంగా మారింది. ఇక లక్షలాదిగా ఉన్న కౌలు రైతుల విషయం గానీ, రైతు భరోసాలో బాగంగా భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇవ్వాల్సిన 13వేల రూపాయల ఆర్థిక సహాయం ఊసే లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన గృహ లక్ష్మి పధకం క్రింద ప్రతి మహిళకు నేలకు1500రూపాయల ఆర్థిక సహాయం గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు ఇస్తున్న ఒంటరి మహిళలు, వృద్దాప్య పెన్షన్లు విషయంలో 2వేలనుండి4వేలకు పెంపుదల, వికలాంగుల పెన్షన్ 4వేల నుండి 6వేలకు పెంపుదల ఊసే లేదు..ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్ళు కావస్తున్నా కొత్త చేయూత పధకం క్రింద దరఖాస్తులు స్వీకరించడం మే కాని నూతన పెన్షన్లు మంజూరు చేయడంలేదు. ఇక ప్రభుత్వ బడుల సంస్కరణ మూలన పడింది. అధికారం చేపట్టిన కొత్తలో ఆకునూరి మురళి నేతృత్వంలో తెలంగాణా విద్యా కమిషన్ నియమించారు. కమిషన్ ఓ నివేదిక అందజేసింది.
అమలుకు ఒక్క పైసా బడ్జెట్ లో కెటాయించలేదు సరికదా తాజాగా కేసీఆర్ దగ్గర అనేక ఏళ్ళుగా సలహాదారుగా ఉన్న కే.కేశవరావు రేవంత్ రెడ్డి వద్ద సలహాదారు గా చేరిపోయారు. ఇప్పుడు విద్యాశాఖ సమీక్షలో విద్యా కమిషన్ కు బదులు ఆయనే ప్రధానంగా కనిపిస్తున్నారు. ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యావ్యవస్థ లో కలపడానికి సలహా అడుగుతున్నారు. ఇప్పటికే తెలంగాణా విద్యా కమిషన్ ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది.తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ లో3-12వ తరగతి ఉండాలని పేర్కొంది. ప్రజాస్వామ్య బద్దంగా వచ్చిన నిర్ణయం ప్రక్కన పెట్టి, నివేదిక చెత్తబుట్టలో వేసి,తాజాగా స్వచ్చంధ సంస్థలను సలహా అడుగుతున్నారు. పొరుగు రాష్ట్ర లలో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉంది.మన తెలంగాణా రాష్ట్రం లోనే ఆ నిర్ణయం గత పదిహేనేళ్ళు గా పెండింగ్ లో ఉండి. అటు జూనియర్ కళాశాల వ్యవస్థ,ఇటు పాఠశాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సూచనలు అమలు పరచడమే ప్రభుత్వం ముందు ఉన్న సరైన ప్రత్యామ్నాయం గా భావించాలి.
ఇందిరమ్మ గృహ నిర్మాణం విషయంలో రెండు వందల గజాల స్థలం ఉన్న వారికే గృహాలు కేటాయించడం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిలో ఆందోళనకు కారణం అవుతుంది. అసలు ఇంటి స్థలం లేక,ఇల్లు లేక పరాయి పంచన తలదాచుకునే నిరుపేదలను ఈ విషయంలో వంచించినట్లు అయ్యింది..!ఇంకా స్థానిక సంస్థల పాలనా కలం గడువు పూర్తి అయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన గ్రామ సర్పంచ్ లు బిల్లులను ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉంచారు. వడ్డీ చక్రబంధంలో ఇరుక్కొని కొందరు సర్పంచ్ లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించుకోవడం వలన కేంద్రం నుండి వచ్చే గ్రామాభివృద్ధి నిదులు రావడంలేదు..ఇక కోట్లాది రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది.ఈ విపత్తు నుండి తప్పించుకోడానికి రిటైర్మెంట్ వయస్సు మరికాస్త పెంచే యోచన ప్రభుత్వం చేస్తుంది. పెరిగిన కరువుభత్యం చెల్లింపు విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన సాచివేత వైఖరితోనే ఈ ప్రభుత్వం అనుసరిస్తోంది. సహజసిద్దంగా ఉద్యోగులకు అందవలసిన వేతనాలు నెల మొదటి తేదీన ఇచ్చి అదే పెద్ద సంస్కరణ గా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.
గత ప్రభుత్వం కాలం నుండి ఈ ప్రభుత్వం వరకు పెండింగ్ లో ఉన్న ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కోట్లాది రూపాయలు పేరుకుపోయి ఉన్నాయి. విద్యార్థులు ఆందోళన చేస్తున్న వాటి ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువుల ఆక్రమణ అరికట్టడం కొరకు ‘హైడ్రా ‘ఏర్పాటు చేసీ తొలి ప్రయత్నంగా సినీనటుడు అక్కినేని నాగార్జున యన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు. కూల్చిన ఏడాదిన్నర తర్వాత రెండెకరాల భూమి స్వచ్చందంగా నాగార్జున ప్రభుత్వం కు దాఖలు పరచారని స్వయంగా ముఖ్యమంత్రి నే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరఖాస్తుల తిరునాళ్ళ లాగా జరపడం,యువత,రైతులను ఆశపెట్టడం తప్ప ఒక్కటంటే ఒక్క పధకం వాగ్ధానం చేసిన విధంగా సంపూర్ణంగా అమలు చేసింది లేదు..దిగువ నుండి పైస్థాయి వరకు గత ప్రభుత్వం కంటే అవినీతి పెరిగింది తప్ప తరగలేదు.
అందుకు అవినీతి నిరోధక శాఖకు పట్టుపడుతున్న కేసులే ప్రాతిపదిక గా ఉంది. మంత్రి పదవి నుండి నామినేటెడ్ పదవుల పై సిగపట్లు వరకు వెళ్ళడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో వైఫల్యం చెందుతుంది. గతంలో పాలించిన కేసీఆర్ పార్టీకీ గానీ, కేంద్రం లో అదికారంలో ఉన్న బిజేపి కిగానీ పరిపాలనా విధానం లో సారూప్యత ఉండడం వలన అవి రాష్ట్ర ప్రభుత్వం విధానాలను విమర్శించే నైతికత కోల్పోయాయి. కనుక తెలంగాణా రాష్ట్రం లో అసంతృప్తి గా ఉన్న ప్రజలు,రైతులు,యువత, మహిళలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి, చేసిన వాగ్దానాలు అమలు పరచాలి. కాకుంటే గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రజల అసంతృప్తి జ్వాల రగిలితే ఏ ప్రభుత్వం అయినా దిగిపోక తప్పదు.. కనుక తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పొంచి ఉన్న ప్రమాదం గమనించి ప్రజా ప్రభుత్వం గా రుజువు చేసుకోవడానికి ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు పరిచే దిశగా ప్రయాణం ఉండాలని ఆకాంక్షిద్దాం…..





