రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్13: డిసెంబర్ 25 న క్రిస్మస్ పర్వదినం పండుగ ను పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం నిర్వహిం చనున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు నిర్వ హణ, మరియు కమిటీ ఏర్పా టుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం డాక్టర్ బి.ఆర్‌అంబేడ్కర్ రాష్ట్రసచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షిం చారు.
క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహణపై రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు ప్రతి నియోజ• •వర్గంలో నిర్వహించే వేడుకలకు సంబం ధించి కూడా కమిటీలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. జిహెచ్‌ఎంసిలో కూడా వేడుకల నిర్వణకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కమిటీల ఏర్పాటు తర్వాత వేడుకల నిర్వా హణకు సంబంధించిన పూర్తి యాక్షన్ ప్లాన్‌తో రావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తాప్సీద్ ఇక్బాల్, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ యాస్మిన్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండి సబిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





