పిల్లల సృజనాత్మకత వెలికితీయాలి

అమెరికా లో టీచర్ వృత్తి తో ప్రారంభించి ప్రస్తుతం అకాడమిక్ సలహాదారులు గా పనిచేస్తున్న డాక్టర్ వాణి గడ్డం తో అమెరికా పాఠశాల విద్యా విధానం గురుంచి సాన్ ఫ్రాన్సిస్కో లో తెలంగాణ డెవలమెంట్ ఫోరం 25 సంవత్సరాల అవతరణ ఉత్సవాల సందర్భంగా ఎం. వి. ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్. వెంకట్ రెడ్డి  సంభాషణ !!

  పరిచయం ,  విద్యాభ్యాసం .. అమెరికా ప్రయాణం 

.నేను నిజామాబాద్ లో జన్మించి పెరిగాను. నా చదువును నిర్మల హృదయ పాఠశాలలో ప్రారంభించాను. 6వ తరగతిలో జవహర్ నవోదయ విద్యాలయ (నిజాంసాగర్) లో ఎంపికయ్యాను. అక్కడ 12వ తరగతి వరకు చదివిఆ తరువాత నిజామాబాద్ మహిళా కళాశాలలో B.Sc (BZC) పూర్తిచేశాను. తర్వాత హైదరాబాద్‌కి వచ్చిఆంధ్ర మహిళా సభ (ఉస్మానియా యూనివర్సిటీ) నుండి B.Ed పూర్తి చేశాను. M.Sc (జూవాలజీ) చదువుతున్న సమయంలోనేఉస్మానియా యూనివర్సిటీలోడీఎస్‌సీ పరీక్ష రాశాను. ఆ పరీక్షలో ఎంపికైనిజామాబాద్ జిల్లాదుబ్బాక హైస్కూల్ లో బయాలజీ మరియు ఇంగ్లీష్ హైస్కూల్ టీచర్‌గా నియమితులయ్యాను. అక్కడ కొన్ని నెలలు సేవలందించిన తరువాతఎడ్యుకేషన్ లీవ్ తీసుకునినా M.Sc మరియు M.Ed ను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాను. ఆ తరువాతఅమెరికాకు వచ్చి ఎడ్యుకేషన్‌లో పీహెచ్.డి. పూర్తి చేశాను. పీహెచ్.డి. పూర్తయ్యాకన్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హైస్కూల్ బయాలజీ మరియు కెమిస్ట్రీ టీచర్‌గా చేరాను.

అమెరికాలో  టీచర్‌గా , విద్యాశాఖలో వివిధ బాధ్యతలు 

అమెరికాలో నా వృత్తి ప్రయాణం హైస్కూల్ బయాలజీ మరియు కెమిస్ట్రీ టీచర్‌గా ప్రారంభమైంది. తరువాత అసిస్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గనైజేషన్ గా సేవలందించాను. ఆ తరువాతజిల్లా స్థాయిలో టీచర్ ఈవాల్యుయేషన్ స్పెషలిస్ట్ గా పని చేశాను. అలాగే బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రాం డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించాను.

తర్వాతటెనెసీ టెక్ యూనివర్సిటీలో అకాడమిక్ అడ్వైజర్ మరియు ప్రొఫెసర్ గా పనిచేశాను. ఆ తరువాత కాలేజ్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లినరీ స్టడీస్ లో సైట్ డైరెక్టర్ హోదాలో పాఠ్య ప్రణాళికకోర్సు షెడ్యూలింగ్మరియు ఫ్యాకల్టీ నియామక బాధ్యతలు చేపట్టాను. చివరిగానా స్వంత కంపెనీని స్థాపించి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ గా విద్యార్థులకు కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నాను.

      అమెరికా విద్యా వ్యవస్థ 

అమెరికాలో చిన్నపిల్లలను 6 వారాల వయసు నుండే డే కేర్ సెంటర్లకు పంపే తల్లిదండ్రులు ఉన్నారు. డే కేర్ సెంటర్లు సాధారణంగా 4 సంవత్సరాల వయసు వరకు చూసుకుంటాయి. 4 సంవత్సరాల వయసులోఅదే డే కేర్ సెంటర్‌లో ప్రీ-స్కూల్‌ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. అలాగేతక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం హెడ్ స్టార్ట్ (Head Start) ప్రోగ్రాంలు అందిస్తుంది.

సంవత్సరాల వయసులో పిల్లలు కిండర్‌గార్టెన్‌లో చేరతారు. కిండర్‌గార్టెన్‌ నుండి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్”, 6 నుండి 8వ తరగతి వరకు మిడిల్ స్కూల్”, 9నుండి 12వ తరగతి వరకు హై స్కూల్” ఉంటుంది. 12వ తరగతి పూర్తయ్యే సరికి విద్యార్థుల వయసు సాధారణంగా 17-18 సంవత్సరాలు ఉంటుంది.

      ఉపాధ్యాయులుగా పని చేయడానికి అర్హతలు

అమెరికాలో ఉపాధ్యాయుడిగా పనిచేయాలంటే ముందుగా నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి. ఈ కోర్సులో బోధన పునాదులుబోధన విధానాలు నేర్పుతారు మరియు 6 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలితద్వారా B.Ed డిగ్రీ పొందవచ్చు.

కోర్సు చదువుతున్న సమయంలోనేతాము బోధించదలచిన సబ్జెక్టులు మరియు గ్రేడ్ లెవెల్స్‌కు సంబంధించిన లైసెన్సింగ్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలి.

ఈ అన్ని అర్హతలు పూర్తయిన తరువాతఅభ్యర్థి లైసెన్స్ పొందుతారు. ఆ తరువాతవివిధ స్కూల్ డిస్ట్రిక్టులు ప్రకటించే ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించిపై పేర్కొన్న అర్హతల ఆధారంగా బోధన పదవులు ఇస్తారు.

      ఉపాధ్యాయుల శిక్షణ ..

ప్రతి సంవత్సరంపాఠశాల జిల్లా నిర్దేశించిన కొన్ని ఇన్-సర్వీస్ ట్రైనింగ్ గంటలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. అదేవిధంగాలైసెన్స్ రిన్యువల్ కోసం కనీసం 24 గంటల శిక్షణ పూర్తిచేయాలి. ఈ అవసరాలు రాష్ట్రానికీ రాష్ట్రానికి కొంత మారుతూ ఉంటాయి.

      ఉపాధ్యాయులపై పర్యవేక్షణ, పనితీరు అంచనా 

అమెరికాలో టీచర్ ఈవాల్యుయేషన్స్ తప్పనిసరి. కొత్త ఉపాధ్యాయుల కోసంప్రతి సెమిస్టర్‌లో గరిష్టంగా 3అబ్జర్వేషన్లు (అంటే సంవత్సరానికి 6 సార్లు) నిర్వహిస్తారు. 1–3 సంవత్సరాల అనుభవం ఉన్న ఉపాధ్యాయుల కోసంప్రతి సెమిస్టర్‌లో 2 అబ్జర్వేషన్లు చేస్తారు. సీనియర్ టీచర్ల కోసంప్రతి సెమిస్టర్‌లో 1 అబ్జర్వేషన్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఫలితాల ఆధారంగా టీచర్ లైసెన్సు రెన్యువల్ చేయబడుతుంది .

కొన్ని రాష్ట్రాలలోఈ పనితీరు అంచనాలను నేరుగా వారి బోనస్ స్ట్రక్చర్ కు అనుసంధానిస్తారు.

     ఉపాధ్యాయులకు సహకారం 

ఉపాధ్యాయులకు పాఠశాల మరియు జిల్లా స్థాయిలో సపోర్ట్ టీమ్స్మెంటార్ టీచర్స్ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్మరియు అవసరమైన రిసోర్సులు అందిస్తారు.

     ప్రమోషన్స్

అమెరికాలో ప్రమోషన్లు కేవలం సంవత్సరాల అనుభవం ఆధారంగా ఎప్పుడూ ఇవ్వబడవు. ప్రమోషన్ ఇవ్వడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు — విద్యార్హతలుమంచి టీచర్ రేటింగ్స్ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ సెషన్స్‌లో సక్రమ హాజరుమరియు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత అందించే అడ్మినిస్ట్రేటివ్ లైసెన్సులు ఉండాలి.

     పబ్లిక్ స్కూల్ సిస్టమ్ నైబర్హుడ్ సిస్టమ్ 

అమెరికాలో చాలా సందర్భాలలోతల్లిదండ్రులకు పాఠశాలను ఎంచుకునే అవకాశం ఉండదు. వారు తమ పిల్లలను తప్పనిసరిగా తమ నివాస చిరునామా ఆధారంగా కేటాయించిన జోన్ స్కూల్‌కు పంపాలి. ఇది కచ్చితంగా అమలు చేయబడుతుంది. అయితేఫెయిలింగ్ స్కూల్స్ (పనితీరు తక్కువగా ఉన్న పాఠశాలలు) సందర్భంలోతల్లిదండ్రులకు జిల్లా పరిధిలోని ఇతర పాఠశాలలను ఎంచుకునే అవకాశం ఇస్తారుకానీ బస్ సర్వీసులు అందించబడవు.

 ప్రభుత్వ నిధులు పాఠశాల బోర్డు 

అమెరికాలో ప్రభుత్వ పాఠశాల బడ్జెట్‌లో ప్రధాన భాగం ప్రాపర్టీ టాక్స్ నుండి వస్తుంది. ఈ పన్నులు ఎక్కువగా ఉంటేపాఠశాలలకు అందే నిధులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్లప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న రిసోర్సులు మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి చాలా భిన్నంగా ఉంటాయి. మంచి పాఠశాల జిల్లాలలో రియల్ ఎస్టేట్ విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

ప్రతి జిల్లాలో ఆ జిల్లా పౌరులుగా చే ఎన్నుకోబడిన స్కూల్ బోర్డు ఉంటుందిఇది బడ్జెట్పాలసీలుమరియు పాఠశాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటుంది.

 నేటి తరం విద్యార్థులు

   ఈ తరం పిల్లలు సాంకేతిక పరిజ్ఞానంలో ముందున్నారుకానీ అదే సాంకేతికం (ప్రత్యేకంగా సెల్‌ఫోన్సోషల్ మీడియా) వారిని చదువుల నుండి దారి తప్పిస్తోంది. తరగతిలో దృష్టి తారుమారవడంనిద్రలో అసమయాలుపాఠ్యాంశాలపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.

పరిష్కార సూచనలు: పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ పాఠాలు ప్రవేశపెట్టాలిటెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం నేర్పాలి. తల్లిదండ్రులుఉపాధ్యాయులు కలిసి స్క్రీన్ టైమ్ పరిమితులు పెట్టాలి. పాఠాలలో సాంకేతికతను ఉపయోగకరంగా మిళితం చేసిఆకర్షణీయంగానువిద్యాసంబంధంగాను ఉంచాలి.

పిల్లలను దండించడం నిషేధం ,అమెరికా అనుభవం 

అమెరికాలో శారీరక దండన చాలా ఏళ్ల క్రితమే నిషేధించారు. అక్కడ క్రమశిక్షణ కోసం పాజిటివ్ డిసిప్లిన్ పద్ధతులు అనుసరిస్తున్నారు — రివార్డ్ సిస్టమ్బిహేవియర్ కాంట్రాక్టులుకౌన్సెలింగ్రెస్టోరేటివ్ ప్రాక్టీసులుస్పష్టమైన నియమాలు మొదలైనవి.

పాజిటివ్ డిసిప్లిన్ – వివరణ

పాజిటివ్ డిసిప్లిన్ అనేది పిల్లలకు స్వీయ నియంత్రణసమస్య పరిష్కారంసానుభూతి వంటి నైపుణ్యాలను నేర్పే విధానం. ఇది భయంపై ఆధారపడి ఉండే విధానాలను తొలగించిపరస్పర గౌరవం మరియు మార్గదర్శకతపై ఆధారపడుతుంది. శిక్షించడంకన్నా నేర్పించడం.

విమర్శకన్నా ప్రోత్సాహం.

సులభంగా అర్థమయ్యేప్రత్యేకమైన సూచనలు ఇవ్వడం (ఉదా: తరగతి గదిలో నడవాలి” అనడం, “పరిగెత్తవద్దు” అని కాకుండా). తప్పిదం వల్ల సహజంగానే ఎదురయ్యే ఫలితం అనుభవించనివ్వడం లేదా చేసిన తప్పును సరిచేయడం. పాజిటివ్ ప్రవర్తనకు టోకెన్లుప్రశంసలుచిన్న ప్రివిలేజీలు ఇవ్వడం.ఒంటరిగా ఉంచడం బదులుపిల్లతో కూర్చొని భావాలుప్రవర్తన గురించి మాట్లాడడం. ఉపాధ్యాయుడు స్వయంగా గౌరవంసహనం చూపించడం. చేసిన తప్పుతో కలిగిన నష్టాన్ని సరిచేయడంలో విద్యార్థిని పాల్గొనించడం. చిన్న చిన్న పనులు అప్పగించడం ద్వారా బాధ్యతాభావం పెంపొందించడం మొదలగు చర్యలు చేపట్టాలి.

పిల్లల సృజనాత్మకత వెలికితీతకు ఉపాధ్యాయులకు సలహా

ప్రాజెక్ట్ ఆధారిత బోధన ద్వారా అన్వేషణసృష్టికి అవకాశం ఇవ్వాలి. ప్రశ్నలు అడగడం ప్రోత్సహించాలివిభిన్న ఆలోచనలకు విలువ ఇవ్వాలి. అవును/కాదు లేదా పాఠ్యపుస్తకం ఆధారిత ప్రశ్నలకన్నా ఎందుకు” అనే ప్రశ్నలు ఎక్కువగా అడగాలితద్వారా లోతైన ఆలోచన పెరుగుతుంది. నిజజీవిత సమస్యలు పరిష్కరించే పనులు అప్పగించాలి. చిత్రకళకథా రచనసైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ వంటి వివిధ కార్యకలాపాలు చేర్చాలితద్వారా విభిన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *