కవి చేసిన చైతన్య సంతకం

సమాజ హితం కోరే సాహిత్యం అవసరమని భావించే యువ కవి కార్తీక రాజు. ఎవరి గుండెల్లో కొంచెం గుబులైనా అతని మదిలో ‘అలికిడి’ మొదలైతదేమో! సమాజంలోని సమస్యలను స్పృశిస్తూ అతడు రాసే కవితలు ఎలుగెత్తి సూటిగా ప్రశ్నిస్తుం టాయి. ఎదుటివారి కష్టం చూసి మనసు ముక్కలు జేసుకుంటేనే అలాంటి వాక్యాలు రూపుదాలుస్తుంటాయి.     కార్తీక రాజు 2015 నుండి 2020 మధ్యకాలంలో రాసిన వచన కవితల సమా హారం ‘అలికిడి’. ఈ కవితా సంపుటి తన తొలి పుస్తకం. పుస్తక ముఖచిత్రంతోనే తన కవిత్వ ఉద్దేశం ఏంటో  చెప్పేసాడు కవి. అణ గారిన జనాల్లో ఓపిక నశించినప్పుడు ఎత్తబడే పిడికిళ్ళు, అర్ధాంతరంగా అన్యా యంగా పోరా ట వీరుల మెడకు చుట్టబడ్డ ఉరితాళ్ళు, నేలమ్మ నుదుటన వలస జీవుల నెత్తుటి పాదాలు వేస్తున్న ఎర్రటి ముగ్గులు… మొదలైన కొన్ని దృశ్యాలు చిత్రంలో దర్శన మిస్తాయి.
ఈ పుస్తకంలో మొత్తం 63 కవిత లున్నాయి.  మొదటి కవిత నుండి చివరి కవిత వరకు కవి ఎంచుకున్న వస్తువును, కవితను తీర్చిదిద్దిన క్రమాన్ని గమనిస్తే, తన భావజాలం, దృక్పథం చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. పుస్తకమంతా తెలం గాణ లోగిళ్ళపై కవి చేసిన చైతన్య సం తకమే.

‘రైతు జీవన చక్రం’ అనే శీర్షికతో తెలంగాణ యాసలో ఉన్న మొదటి కవి తలోని ప్రతి అక్షరంలో మట్టివాసన మనకు స్పష్టంగా తగులుతుంది.’’నాగలి కొయ్యను ఎద్దులకు గట్టి/ వాటిని నడిపించుకుంట/ వాటి ఎనుకనే నడుసుకుంట/ నేలమ్మ నెత్తిని సక్కంగ దువ్వుతుంటడు’’ అంటాడు కవి. ఎంతటి చక్కటి వాక్య నిర్మాణం. ఎంత మంచి పోలిక.  ‘చాకిరి బండ’ అనే కవితలో ‘‘అరవై కూరలు తింటారని/ అలుసుగా చూడకుండ్రి/ చేసిన దాస్యానికి మూలం/ మేము అడుక్కునే ధాన్యం/ అది మా శ్రమ ఫలం’’ అంటూ చాకలి వృత్తిపనివారలను తక్కువ చేసి చూడొద్దని చెబుతాడు. ఒకప్పుడు ఊరూరికి మడేలయ్య గుడి ఉండేది. ఇప్పుడు అవి కూడా ఏమైనవో! అని మనకు అనిపిస్తుంది ఈ కవిత చదువుతుంటే. నేను రజకున్నని గర్వంగానే చెప్పుకుంటూ, చాకలి కులవృత్తి పట్ల సానుకూల దృక్పథాన్ని స్పష్టంగా చాటుతూ, చాలా చక్కటి వాక్యాలు తన కలం నిర్మించిందనడంలో సందేహం లేదు.

‘‘నీచ జాతి కింద తోసేయబడ్డ రాచ జాతి అది/ క్రిమినల్‌ ‌తెగగా ముద్రపడ్డ మహా జాతి అది/ రాజ్యాంగంలో అసలు ఊసే లేని ఉన్నత జాతి అది’’ అంటూ సంచార జాతుల పట్ల తనకున్న ఉద్దేశాన్ని గట్టిగానే వినిపి ంచాడు ఒక కవితలో.‘అసహ్యంగా ఉంది’ అనే శీర్షికన రాసిన కవితలో తన అంతర్గత భావాన్ని అద్భుతంగా బయ టపెట్టే సాడు. ’’ఛీ../ అస హ్యంగా ఉంది/ మనుషుల్లో మానవత్వం చచ్చిపోయి/ కుళ్ళిన మనసుల కంపు గొడుతున్న/ ఈ సమాజ శ్మశానంలో/ ఇంకా శ్వాసిస్తున్నందుకు’’ అంటాడు. అంతేకాక అంతరించిపోతున్న వాటి జాబితాలో మానవ త్వాన్ని కూడా చేర్చి, నవీన కోణాన్ని ఆవిష్కరించాడు. నేను విప్లవ సాహిత్యకారున్నని నిర్భయంగా చాటుకునే కార్తీక్‌ ‌కొన్ని కవి తలతో నిప్పురవ్వలను, ఉక్కు పిడికిళ్ళను సంధించాడు.నేటి సమాజం సిగ్గుతో, లజ్జతో తలదించుకోవాల్సిన స్థితి తెచ్చిన పాశవిక పనుల్లో మొదటిది అభం-శుభం ఎరుగని పసిపాపలపై లైంగిక అరాచకత్వం. ఈ సమస్య పై ధర్మాగ్రహంతో ‘అంగాలను తెగ్గోద్దాం పదండి’ అనే శీర్షికన కాస్త దీర్ఘంగా రాసిన కవితలో పదునైన పదాలను వాడి, సమాజాన్ని సూటిగానే ప్రశ్నించాడు. ‘‘ఎందరు బలై ఉంటారిప్పటికి/ ఈ అత్యాచార భారతదేశంలో?/ లెక్క పెట్టారా ఎవరైనా?/ లెక్క చేశారా ఎప్పుడైనా?’’ లాంటికవితావాక్యాలు అగ్గిరవ్వల్ని కురి పించాయి.

‘‘ఇంతకీ… ఆమె చేసిన అంతటి నేరం?’’ అంటూ ప్రశ్నార్థకాలతో ముగించిన ‘కల్లో లిత’ కవిత ద్వారా కార్తీక్‌ ఒక విషయాన్ని కవిత్వీకరించడంలో ప్రదర్శించిన నేర్పరి తనాన్ని మనం గుర్తించవచ్చు. ‘‘పండుగలు, పబ్బాలు/ పెళ్ళిళ్ళు, పేరంటాలు/ ఉత్సవాలు, ఊరేగింపులు/ వ్రతాలు, వాయినాలు/ పూ జలు, పునస్కారాలు/ వీటిలో వేటిలోకి ప్రవే శించే అర్హతే/ ఆమెకిపుడు లేదట’’ అం టాడు. నిజంగా ఆలోచిస్తే మన దేశంలో భర్త చనిపోయిన ఆడదానిది ఎంత జుగుప్సా క• •మైన పరిస్థితో కదా! ‘‘అందరూ ఒక్కసారి ఆమె స్థానంలో ఉండి ఆలోచించి చూడండి. పనికిరాని ఆచారాన్ని ఇంకా పట్టుకొని వేలాడాలంటారా?అందరిలా తనూ ఉంటే ఆకాశమేమైనా మీద పడిపోతుందంటారా?’’ అన్నట్టు కార్తీక్‌ ‌ప్రశ్నిస్తున్నట్టే అనిపిస్తుంది ఈ కవిత చదివాక.ఈ ఒకటీ రెండే కాదు.. స్త్రీల పక్షాన నిలబడి రాసిన మరికొన్ని కవితలనూ కలిగి ఉందీ సంపుటి. ‘వెళ్తున్నావా చెల్లీ’, ‘కన్నీటి కావ్యం’, ‘తల్లితనం’ వంటి కవితల్లో స్త్రీల ఔన్నత్యం గురించి ఉదాహరించడం గొప్ప విషయం.

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రచయిత తన సామ్రాజ్యమంతటా పిల్లలుండడం వల్ల చాలా చోట్ల చిన్నపిల్లాడు అయిపోయాడు. ఓ కవితతో తామరాకుల గొడుగులను, చిను కుల సవ్వడులను, తనువంతటా కలిగే గిలి గింతలను, మనసంతటా కలిగే పుల కరింతలను గుర్తు చేస్తూ, చక్కగా మనల్ని కూడా అనుభూతి చెందిస్తాడు.అందరూ ఆలోచించాల్సిన ఇంకొక విషయం. ఒక ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యా యుడిగా తను పడ్డ మానసిక వేదనను ‘బజారుపాలైపోయింది’ అంటూ ఒక కవి తగా రాశాడు. ప్రస్తుత సమాజంలోని ఉపా ధ్యాయుల పరిస్థితికి అద్దం పట్టే కవిత ఇది. ఇందులో ‘‘అన్ని రంగాలు నడవడానికి మూలకారకులు/ చదువు సంస్కారం నేర్పే గురువులు /ఆత్మ గౌరవాన్ని చంపుకొని/ ఏనాడైతే రోడ్డున పడ్డారో/ ఆనాడే బజారు పాలైపోయింది/ వేదభూమిగా పిలవబడే ఈ దేశం పరువు’’ అన్నాడు. విద్యార్థులు విద్య కోసం రావాలి. విద్యార్జన గావించి, ఆనం దంగా అంచెలంచెలుగా ఎదగాలని కోరు కునే ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వారిని ఇంటింటికి, వీధివీధికి కాళ్ళు అరిగేలా తిప్పుతున్న దుస్థితి నేడు నెలకొని ఉన్నది. దీన్ని నిరసించాడు కవి.     మొత్తంగా పుస్తకాన్ని పరిశీలిస్తే, ఎన్నో చక్కని అంశాలను తీసుకొని, చాలా చక్కగా కవిత్వీకరించాడని చెప్పొచ్చు. సున్నితమైన అంశాలను చెప్పేటప్పుడు ఆర్థ్రతతో కూడిన పదాలను, సమస్యల పై విరుచుకుపడుతూ ఆవేశంతో చెప్తున్నప్పుడు పదునైన పదాలను వాడుతూ కవితలల్లాడు ఈ అలికిడిలో. తన భావాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడంలో  కృతకృత్యుడయ్యాడు. ఈ అలి కిడి పాఠకుడి మనసులో అలజడి సృష్టిస్తుంద నడంలో అతిశయోక్తి లేదు.
 – వకుళాభరణం శివరంజని
    హనుమకొండ, 9490006031  

 (పుస్తకం కోసం 8977336447 నంబర్‌ ‌ద్వారా పుస్తక రచయితకు కాల్‌ ‌లేదా మెసేజ్‌ ‌చేసి సంప్రదించండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *